మనసుకు నచ్చే ఆధునిక ఆవిష్కరణలు

Publish Date:Sep 9, 2014

 

ప్రపంచం వేగంగా పరిగెడుతుంటే, ఆ వేగానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు జరిగిపోతున్నాయి. కొన్ని మన జీవితాన్ని, జీవన విధానాన్ని సౌకర్యవంతంగా చేస్తే, మరికొన్ని కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి ఓ ఆవిష్కరణలివి...

 

మీ మనసులోని మాటలు అద్దంపై అక్షరాలుగా కనిపిస్తే మీరెంతో థ్రిల్ అవుతారు కదా... అద్దమంటే కేవలం మన ప్రతిబింబం చూసుకకోవడానికే కాదు, మనవారి మనసులోని భావాలను చూసుకోవటానికి కూడా. నిజం... ప్యారిస్‌కి చెందిన డిజైనర్ రాబర్ట్ స్టాండ్లర్ ఈ సరికొత్త ఆవిష్కరణకి ప్రాణం పోశాడు. స్నేహితులు, బంధువులు ఎవరైనా తమ సెల్ ఫోన్ నుంచి పంపిన సందేశాలు ఇతను ప్రత్యేకంగా రూపొందించిన అద్దంపై ప్రత్యక్షమయ్యేలా ఏర్పాటు చేశాడు. అంటే, ఈసారి మీ ఇంట్లో ఆ అద్దాన్ని బిగించారనుకోండి.. మీకు కావలసినవాళ్ళు ఏదైనా మెసేజ్ వాళ్ళ సెల్ నుంచి పంపితే ఆ అద్దంపై చక్కగా, అందంగా కనిపిస్తుంది. నచ్చినవాళ్ళకి ప్రత్యేకంగా ఈ అద్దాన్ని బహుమతిగా ఇస్తే....

రమ

By
en-us Political News