153 ఏ సెక్షన్ కింద అక్బరుద్దీన్ ఫై కేసు నమోదు

 

 

 

రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణతో ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఫై ఢిల్లీ లో కేసు నమోదు అయింది. ఇటీవల ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, ప్రజాస్వామ్య, లౌకిక విలువలఫై దాడి చేసినట్లుగా ఉన్నాయంటూ శబ్మం హష్మీ అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేయడంతో ఆయనఫై ఢిల్లీ లోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

 

ఈ ఫిర్యాదుఫై ఇండియన్ పీనల్ కోడ్ లోని 153 ఏ సెక్షన్ కింద పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. అక్బరుద్దీన్ ఇటీవల నిర్మల్ లో జరిగిన సభలో మాట్లాడుతూ, ముంబాయి మారణకాండ సబబేనని, అది ముస్లింల ప్రతీకార చర్య మాత్రమేనని అన్నారు. ఒక్క 15 నిమిషాల పాటు పోలీసులు పక్కకు తప్పుకొంటే, కేవలం 15 కోట్ల మంది ముస్లింలు 100 కోట్ల మంది హిందువులను ఏమి చేయగలరో తెలుస్తుందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ముస్లింలు తలచుకొంటే, చార్మినార్ ప్రాంతంలోని భాగ్య లక్ష్మి ఆలయం కూలిపోతుందని కూడా ఆయన ఆ సభలో మాట్లాడుతూ అన్నారు.

 

అయితే, ఆయన వ్యాఖ్యలఫై హైదరాబాద్ లో కూడా ఇప్పటికే ఓ కేసు నమోదు అయి ఉంది. అక్బరుద్దీన్ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లో ప్రకటించింది.