ఆఖ‌రి సందేశం రాహుల్‌కే

 

163 సంవ‌త్సరాలుగా భార‌తీయుల‌కు సేవ‌లందించిన ఓ వ్యవ‌స్థ నిన్నటితో క‌నుమ‌రుగ‌య్యింది.. ఇన్ని సంవత్సరాలుగా మంచి చెడు అన్నిర‌కాలు విష‌యాల‌ను అతి శీఘ్రంగా అందించిన టెలిగ్రామ్‌ వ్యవ‌స్థ ఇక క‌నిపించదు.. త‌న వాణి వినిపించ‌దు.. అయితే ఈ నేప‌ధ్యంలో టెలిగ్రామ్ స‌ర్వీస్ ద్వారా పంపే ఆఖ‌రి సందేశం త‌మ‌దే కావాలంటూ దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు పోటి ప‌డ్డారు.. దాదాపు అన్ని న‌గ‌రాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది.

 

ప్రతీ పోస్ట్ ఆపీస్‌లోనూ ఉద‌యం నుంచే భారీగా క్యూలైన్‌లో జ‌నం క‌నిపించారు. అయితే ఆఖ‌రి మెసేజ్ అందుకుంది కూడా ఓసెల‌బ్రిటీనే.. అర్ధరాత్రికి స‌రిగా 15 నిమిషాల ముందు ఏఐసిసి వైస్ ప్రెసిండెంట్ రాహుల్‌గాంది ఆఖ‌రి టెలిగ్రామ్‌ను అందుకున్నార‌ట‌. అయితే ఈ సందేశం పంపిన వ్యక్తితో అందులోని వివ‌రాల‌ను మాత్రం వెల్లడించలేదు.

 

అయితే రాత్రి ఆఖ‌రున 11.45 నిమిషాల‌కు టెలిగ్రామ్ కౌంట‌ర్ క్లోజ్ చేసే ముందు ఈ మెసేజ్ పంపింన‌ట్టుగా డిల్లీలోని పోస్టల్ వ‌ర్గాలు చెపుతున్నాయి. అంతే కాదు ఇన్ని ఒక్క రోజులోనే ప్రజ‌లు వేలాదిగా సందేశాల‌ను త‌మ బందు మిత్రుల‌కు పంపించారు..