కేసీఆర్ అనే నేను

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ కేసీఆర్‌‌ చేత ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం సరిగ్గా 1.25 గంటలకు కేసీఆర్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ‌కేసీఆర్‌ కుటుంబ సభ్యులు, మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నూతన ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎంపీలు, మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ, ఇతర ప్రముఖులు తరలివచ్చారు.