అధిష్టానంఫై కావూరి ఫైర్

 

 

తనకు మంత్రి పదవి దక్కలేదనే కోపంతో ఉన్న ఏలూరు పార్లమెంట్ సభ్యుడు కావూరి సాంబశివ రావు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై విమర్సల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. సమైఖ్యాంధ్ర ఉద్యమ సమావేశాల్లో పాల్గొంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొంటున్నారు.

 

కేంద్ర ప్రభుత్వంలో సమర్ధవంతమైన నాయకులు లేరని వ్యాఖ్యానించారు. అసలు సమస్యలఫై అవగాహనే లేని నాయకులు అందించిన సమాచారంతో నిర్ణయాలు తీసుకొనే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని కావూరి అన్నారు. ఇది దేశ ప్రజల దురదృష్టమని ఆయన అన్నారు. కొంత మంది నాయకులకు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ గుర్తుకు రావని, పదవులు పోయిన తర్వాత ఉద్యమాలు గుర్తుకు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.

 

అధికారం పోయిన తర్వాత విద్యార్ధులను పణంగా పెట్టి ఉద్యమాలు నిర్వహిస్తుంటారని కావూరి వ్యాఖ్యానించారు. వివిధ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే మార్గాలు ఉంటాయని, అభివృద్ధి జరగలేదనే పేరుతో హైదరాబాద్, ఉత్తరాంధ్రా, దక్షిణాంధ్ర, రాయలసీమ ఇలా విడగొట్టుకొంటూ పోవడం సరికాదని రాష్ట్ర విభజనను మొదటి నుండీ వ్యతిరేకిస్తున్న కావూరి అన్నారు.

 

కొంత మంది నాయకులు విధ్వంసాలకు దిగినంత మాత్రాన రాష్ట్రాన్ని విభాజించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.