ఢిల్లీ దొరలకు వ్యతిరేకంగా 'జనసేన' పార్టీ

 

 

 

రాజకీయాలంటే తనకు ఇష్టం లేదని, ఎంపీగా గెలవాలని లేదు, ముఖ్యమంత్రిని కావాలని లేదని, ఇవన్నీ తనకు తుచ్ఛమని ఆయన అన్నారు. అందరిలాగా బతకాలని అనుకున్నానని, కానీ సమస్యలు తన వద్దకే వచ్చాయని ఆయన అన్నారు. దౌర్జన్యాన్ని, అవినీతిని అరికట్టడానికి ముందుకు సాగుతానని ఆయన అన్నారు. పిరికితనంతో నీ బాంచెన్ కాల్మోక్తా అనే పిరికిపందను కాదు, ఢిల్లీలో ఉన్నవారిని కాల్మొక్తా అని మన రాష్ట్రాన్ని ఈ పరిస్థితికి తెచ్చారని ఆయన అన్నారు. దానిని మార్చడానికే 'జనసేన' పార్టీ పెట్టానని అన్నారు.