పులివెందులలో రీ పోలింగ్ తప్పదా?

 

 

 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్‌ల దగ్గర వైసీపీ కార్యకర్తలు సృష్టించిన ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. అనేక పోలింగ్ కేంద్రాల్లో వున్న ఇతర పార్టీల పోలింగ్ ఏజెంట్లను తన్ని బయటకి తరిమేసి యథేచ్ఛగా రిగ్గింగ్‌కి పాల్పడ్డారు.

 

పులివెందులలో వైసీపీ భారీగా ఎన్నికల అక్రమాలకు పాల్పడే అవకాశం వుందని తెలుగుదేశం పార్టీ ఎన్నికల సంఘానిక నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు చేసింది. అయితే పోలింగ్ రోజున పులివెందుల నియోజకవర్గంలో వైసీపీ చేసిన ఎన్నికల అక్రమాలను నిరోధించడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయింది. దాంతో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు ఎన్నిరకాలుగా నిబంధనలను అతిక్రమించవచ్చో అన్ని రకాలుగా తమ ప్రతిభ చూపించారు.



అయితే పులివెందులలో వైసీపీ నాయకులు వ్యవహరించిన తీరును ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. వైపీసీ నాయకుల అక్రమాలకు తగిన శాస్తిని చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. పులివెందుల నియోజకవర్గంలోని సగానికి పైగా కేంద్రాలలలో రీ పోలింగ్ నిర్వహించడానికి ఆదేశాలు జారీచేసే విషయాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే, పాపం వైసీపీ కార్యకర్తలు కష్టపడి చేసిన రిగ్గింగ్ వృధా అయిపోయే అవకాశం వుంది.