ఓవైసీ అరెస్టు: పాతబస్తీలో టెన్షన్ టెన్షన్

 

 

 Hyderabad MP Asaduddin Owaisi, MIM chief Asaduddin Owaisi surrenders in 2005 case,   MP Asaduddin Owaisi arest

 

 

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్‌కు నిరసనగా పార్టీ కార్యకర్తలు బంద్‌కు పిలుపు నిచ్చారు. బలవంతంగా షాపులను మూసివేయిస్తున్నారు. బంద్ చేయని దుకాణాలపై రాళ్లతో దాడి చేశారు. పలుచోట్ల దుకాణాదారులు స్వచ్ఛందంగా షాపులను మూసివేశారు. కవరేజీకి వెళ్లిన మీడియాపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో పాతబస్తీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పాతబస్తీలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.


పాతబస్తీలో పరిస్థితిపై సీపీ అనురాగశర్మ మాట్లాడుతూ చిన్నచిన్న ఘటనలు మినహా పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని ఆదేశించారు. ఎలాంటి ఘటనలనైనా ఎదుర్కుంటామని సీపీ అనురాగ్‌శర్మ తెలిపారు.