గాంధీజి గురించి అందరికి తెలియని ఓ పది విశేషాలు

మహాత్మా గాంధీ అనే వ్యక్తీ ఈ భూప్రపంచం మీద ఒకప్పుడు నడయాడాడు ...అంటూ ఎన్ని యుగాలు గడిచినా ప్రజలు మరచిపోని, మర్చిపోలేని వ్యక్తీ గాంధీజీ. మన దేశంలో ఆయనకి ప్రతివ్యక్తి తన గుండెలలో గూడు కట్టి పూజిస్తాడు. అయితే మన మహాత్ముడు కేవలం మన దేశ జాతిపిత మాత్రమే కాదు. ఆయన ప్రభావం విశ్వవ్యాప్తం. గాంధీజీ గురించి తెలుసుకు తీరవలసిన ఒక పది విశేషాలు ఇవిగో ...

 

1. గాంధీజీ తన ఆత్మ కథ " మై ఎక్స్పెరి మెంట్స్ విత్ ట్రూత్" ని 1925 లో గుజరాతి భాషలో రాసారు. అది నవజీవన్ అనే పత్రికలో ధారావాహికంగా వచ్చింది. దానిని ఇంగ్లీష్ లోకి అనువదించినది " మహాదేవ్ దేశాయ్ " .


 

2. మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా గాంధీజి ఆత్మకథ ఎంతో ఆదరణ పొందించి. చివరికి పాకిస్తాన్ లో కూడా బెస్ట్ సెల్లెర్స్ జాబితాలో వుంది అంటే దాని ప్రభావం ఎంతో అర్ధం చేసుకోవచ్చు.


3. 20 శతాబ్దపు అతి గొప్ప ఆద్యాత్మిక పుస్తకాల జాబితాలో గాంధీజీ ఆత్మ కథది ప్రముఖ స్థానం.


 

4. గాంధీజీకి మన దేశంలో ఎన్నో చోట్ల గుళ్ళు వున్నాయి. అక్కడ ఆయనని దేవుడిలా కొలుస్తారు.


 

5. మన దేశంలోనే కాదు చాలా దేశాలలో గాంధీ పేరున వీధులు, నగరాలూ వున్నాయి. అమెరికాలోని టెక్సాస్ ప్రాంతానికి ' మహాత్మా గాంధీ డిస్ట్రిక్ట్ ' అని పేరు పెట్టారు. ఆఫ్రికా లోని బోట్సువాన దేశం లో వున్న ఫ్రాన్సిస్ టౌన్ లో గాంధీ పేరుతో ఒక వీధి వుంది. ఉరుగ్వే లోని మోంట్ వీడియో తీరప్రాంత౦ లో ఓ కాలనీకి మహాత్ముడి పేరు పెట్టుకున్నారు, దక్షిణాఫ్రికాలో 'గాంధీ స్క్వేర్ ' డర్బన్ లో గాంధీ మెమోరియల్ ఆసుపత్రి వున్నాయి. 


 

 6. ఇక గాంధీ విగ్రహాలు మన దేశంలో ఎంత విరివిగా దర్శనమిస్తాయో, ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాలలో, ఎన్నో ప్రాంతాలలో  కనిపిస్తాయి. జర్మన్ పార్లమెంట్లో మహాత్ముని విగ్రహం ప్రతిష్టించారు. మాస్కోలో కూడా గాంధీజీ విగ్రహంవుంది. ఆస్ట్రేలియా యూనివర్సిటీలో  కెనడాలో, ఇటలి,కజికిస్తాన్, ఫ్రాన్స్, మొరాకో, ఇలాఎన్నో దేశాలలో గాంధీజీ విగ్రహాలు ప్రతిష్టించారు.


 

7. సుమారు వందకు పైగా దేశాలు గాంధీజీ పేరున స్టాంపులు విడుదల చేసాయి.

 



 

8. గాంధీజీ ఎందరినో ప్రభావితం చేసారు. అమెరికా హక్కుల వీరుడు మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఐన్ స్టీన్, అల్గోరే, బరాక్ ఒబామా,అంగ్సాన్ సూకీ, దలైలామా, వీరంతాగాంధీజీ అడుగుజాడలలో నడిచినవారు. ఆయనని ఆదర్శంగా తీసుకుని తమ జీవన మార్గాలని నిర్దేశించుకున్నవారు.

9 . అరబ్ దేశాల ఉద్యమగీతాలలో గాంధీయిజం నిండివుంటుంది.


10 . అంతర్జాతీయంగా అనేక విశ్వవిద్యాలయాలు గాంధీయిజంలోని మేనేజ్మెంట్ సూత్రాలని తమ కోర్స్ లో భాగం చేసాయి.

.......రమ