దానం దాదాగిరీ

 

 

‘ఈ బస్తీలో మా అన్నతిరుగొద్దన్నడు..మీరు వెంటనే వెళ్లిపోండి.. లేకుంటే బాగుండదు..’ ఇవీ ఏ వీధి రౌడీయో అన్న మాటలు కావు, ఇతర పార్టీల నాయకులకు తాజా మాజీమంత్రి దానం నాగేందర్ అనుచరుల హెచ్చరికలు. పాదయాత్ర చేస్తుంటే అడ్డుకోడానికి మీరెవరు.. అని ప్రశ్నించిన వేరే పార్టీల కార్యకర్తలపై పిడిగుద్దులు కురిపించారు. దాదాపు మూడు గంటల పాటు ఈ దౌర్జన్యకాండ నిరాఘాటంగా పోలీసులు పక్కనుంచి చూస్తుండగానే జరిగింది. బంజారాహిల్స్ డివిజన్ నందినగర్ పక్కనే ఉన్న వెంకటేశ్వర నగర్ లో ఈ సంఘటన జరిగింది. కార్పొరేటర్ కొడుకు, అతడి అనుచరులు ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డారు.


కార్యకర్తలు, నేతలపై దాడులకు పాల్పడిన బంజారాహిల్స్ కార్పొరేటర్ భారతి కొడుకు భానుప్రకాష్, తమ్ముడు రామ్జీ, అనుచరులు సంజీవ్‌నాయక్, రాజేందర్‌లపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 341 (దౌర్జన్యం), సెక్షన్ 509 (మహిళలపై అసభ్యప్రవర్తన, అసభ్య పదజాలంతో దూషించడం), 506 (చంపుతానని బెదిరించడం) తదితర నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.