రామజోగయ్య శాస్త్రికి ఎన్నారైల సన్మానం

Publish Date:Jun 3, 2013

 

 

Dallas NRIs felicitate Ramajogayya Sastry, NRIs felicitate Ramajogayya Sastry

 

 

మే 28న డాలస్ లో ప్రముఖ సినీగేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారిని అభిమానులు, మిత్రులు కలిసి తానా గత అధ్యక్షులు తోటకూర ప్రసాద్, టాన్టెక్స్ అధ్యక్షుడు సురేశ్ మండువ ఆధ్వర్యంలో సన్మానించారు.

 

ఇదే సందర్భంలో ప్రముఖ గాయకుడు సూపర్ గురు రామాచారి గారిని కూడా సన్మానించారు. విద్య రీత్యా ఇంజనీర్ అయినా, తను జీవితంలో సాధించాలని అనుకొన్న లక్ష్యం వైపు ఎంతో ఆత్మబలంతో సాగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న శాస్త్రి పిల్లలకి, యువతరానికి స్ఫూర్తి అని, సభకు రామజోగయ్య శాస్త్రిని పరిచయం చేశారు, రాయవరం విజయ భాస్కర్.

 


పిల్లలు, పెద్దలు దాదాపు వందమంది దాకా హాజరైన ఈ సమావేశంలో రామజోగయ్య తన సినీ ప్రయాణంలో ఆరంగేట్రం గురించి, ప్రస్తుతం నడుస్తున్న తీరు, తను పనిచేసే విధానం గురించి వివరించారు. తన జీవితంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ప్రభావం, తను గురువుగా రామజోగయ్య నేర్చుకొన్న సినీపాటల మెళకువలు అన్నీ తన మనసు పరచి పంచుకొన్నారు రామ్-జో. అభిమానులతో ఫోటోలు, ఆత్మీయుల ప్రశ్నలు , చిన్నారుల పాటల మధ్య ఓ మంచి సాయంత్రాన్ని డాలస్ తెలుగువారు రామజోగయ్యకి కానుకగా సమర్పించారు.  ఈ సమావేశానికి వేదికతోబాటు భోజనాల ఏర్పాటు చెయ్యడానికి సహకరించిన స్వగృహ భోజనశాల వారికి, వినోద్ ఉప్పు గారికి,  కృతజ్ఞతలు ప్రకటించారు రాయవరం భాస్కర్.