అలాగయితే నేను క్రికెట్ ఆడేవాడినే కానేమో? శ్రీశాంత్

 

క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ మరియు అజిత్ చండిలా ముగ్గురూ 2013 సం.లో జరిగిన ఐ.పి.యల్. మ్యాచ్ లలో స్పాట్ ఫిక్సింగ్ మరియు బెట్టింగ్ నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ డిల్లీ పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి ముగ్గురిపై చార్జ్ షీట్లు దాఖలు చేసారు. వారిలో శ్రీశాంత్ కి కి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సబందాలు కూడా ఉన్నాయని డిల్లీ పోలీసులు ఆరోపించారు. వారు ముగ్గురూ 2013సం.లోనే బెయిలుపై విడుదలయినప్పటికీ వారిపై ఇంతవరకు ఆ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ కేసులను విచారించిన డిల్లీ హైకోర్టు, వారు ముగ్గురూ ఆ నేరం చేసినట్లు డిల్లీ పోలీసులు సరయిన ఆధారాలు చూపలేకపోయినందున వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

 

ఈ కేసులో నిర్దోషిగా బయటపడిన తరువాత శ్రీశాంత్ డిల్లీ నుండి తన స్వస్థలమయిన కేరళలో కొచ్చి చేరుకొన్నప్పుడు విమానాశ్రయంలో ఆయనకి ఆహిమానులు ఘన స్వాగతం పలికారు. ఆ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ చాలా ఆసక్తికరమయిన వ్యాఖ్యలు చేసారు. తనకు దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లయితే అసలు క్రికెట్ ఆడేవాడినేకాదేమో! అతనిలాగే నేను కూడా ఏ దుబాయ్ లోనో దాక్కోవలసివచ్చేది. కానీ క్రికెట్ పై ఉన్న మక్కువతోనే పట్టుదలగా ఆడి ఈ పేరు, డబ్బు, అభిమానులను సంపాదించుకోగలిగాను. నాపై ఆరోపణలు వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసారు. కానీ ఆ కష్టకాలంలో నా కుటుంబ సభ్యులు, అభిమానులు నాకు అండగా నిలబడ్డారు. వారి ప్రార్దనలు, ఆశీస్సుల కారణంగానే నేను ఈ కేసు నుండి నిర్దోషిగా బయటపడగాలిగాను. అందుకు వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. మళ్ళీ క్రికెట్ పై దృష్టి కేంద్రీకరించి పూర్వ వైభవం సాధించేందుకు గట్టిగా కృషి చేస్తానని” ఆయన అన్నారు.