42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల రాజీనామా...

 

ఒకేసారి 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ఘటన పంజాబ్ లో చోటుచేసుకుంది. సట్లజ్‌-యుమునా లింకు(ఎస్‌వైఎల్‌) కెనాల్‌ నీటిపై గత కొద్ది రోజులుగా వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎస్‌వైఎల్ నీటి వినియోగంలో హరియాణాకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో పంజాబ్‌ లో 42 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను శుక్రవారం శాసనసభ కార్యదర్శికి అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ అమరీందర్‌ సింగ్‌ గురువారం తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలనూ రాజీనామా చేయమని ఆదేశించారు. దీనికి స్పందనగా కాంగ్రెస్‌ శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించారు.