సీఎం కిరణ్‌ చిన్నపిల్లాడు

 

 Cm Kiran Kumar Reddy, telangana issue cm kiran

 

 

కోర్‌ కమిటీలో తెలంగాణ విషయమై కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇచ్చిన రోడ్‌మ్యాప్‌ పై టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్యాకేజి ఇవ్వాలన్న సీఎం మాటలతోనే తెలంగాణ వెనుకపడిందన్న విషయం ప్రభుత్వం అంగీకరించిందన్నారు ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కేశవరావు.. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే నక్సల్స్‌ సమస్య వస్తుందనటం సియం అజ్ఞానం అన్నారు..

 

రాష్ట్రన్ని విడదీస్తే జలవివాదాలు వస్తాయంటూ చెప్తున్న సీఎం మాటలు చిన్నపిల్లాడిలా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు కేకే. తెలంగాణ ఉద్యమం ప్యాకేజీలు సాదించటానికి కాదని స్వరాష్ట్ర సాదించే వారకు ఉద్యమాన్ని కోనసాగిస్తామన్నారు..



సియం తెలంగాణకు వ్యతిరేకంగా రోడ్‌మ్యాప్‌ ఇచ్చినప్పటికీ నోరు మెదపని టికాంగ్రెస్‌ నేతలపై కూడా కేకె విరుచుపడ్డారు.. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు సియం ఎందుకు నిలదీయటం లేదంటూ ప్రశ్నించారు.. తెలంగాణ పై కాంగ్రెస్‌కి ముందునుంచి సానుకూల వైఖరి లేదని... కాంగ్రెస్‌కు ప్రత్యేకరాష్ట్ర అంశాన్ని తేల్చే ఉద్దేశం లేదన్నారు.