శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమం

Publish Date:Apr 24, 2014

 

 

 

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వైకాపా కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ నియోజక వర్గం అభ్యర్ధి శోభా నాగిరెడ్డి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శోభా నాగిరెడ్డి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు చెబుతున్నారు. గుండె వైపు పక్కటేముకలు విరగడంతో ఆమెకు శ్వాస తీసుకోలేకపోతున్నట్లు వైద్యులు తెలిపారు.

 

 బుధవారం నంద్యాలలో షర్మిల పర్యటించారు. ఆమెతోపాటు శోభానాగిరెడ్డి కూడా ప్రచారంలో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో షర్మిలకు వీడ్కోలు పలికి... తన మిత్సుబిషి ఔట్‌ల్యాండర్ వాహనంలో శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డకు బయలుదేరారు. దూబగుంట గ్రామం సమీపంలో రోడ్డు పక్కన పోసి ఉన్న ధాన్యం కుప్పపైకి ఆమె పయనిస్తున్న కారు ఎక్కడంతో, కారు అదుపు తప్పి నాలుగు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె పక్కటెముకలు విరిగి, తలకు తీవ్ర గాయాలయినట్లు సమాచారం. ఆమెతో బాటు కారు డ్రైవర్ మరియు ఆమె గన్-మెన్ క్కూడా తీవ్ర గాయాలయ్యాయి.

By
en-us Political News