చిరుకు చిన్నల్లుడు శిరీష్ ఝలక్

 

 

Bail granted to Chiranjeevi's son in law Shirish,  Chiranjeevi son in law Shirish

 

 

కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి చిన్నల్లుడు శిరీష్ భరద్వాజ భారతీయ జనతా పార్టీలో చేరడం ఆసక్తి కలిగిస్తుంది. చిన్నకుమార్తె శ్రీజను వివాహమాడిన శిరీష్ భరద్వాజ్ భార్యతో విడిపోయిన తరువాత, అతనిపై అతని భార్య శ్రీజ వరకట్నం కోసం వేదిస్తున్నాడని పిర్యాదు చేయడంతో, పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆ తరువాత దాదాపు కనుమరుగు అయిపోయాడనుకొన్న శిరీష్, మళ్ళీ చాలా కాలం తరువాత వార్తల్లోకి ఎక్కాడు.


శిరీష్ భరద్వాజ్ బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. బహుశా ఇక తన కాపురం చక్కబడే అవకాశం లేదని గ్రహించిన ఆయన, రాజకీయంగా ఉన్నత స్థాయికి ఎదిగిన మామ చిరంజీవిని డీ కొట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యమ్నాయమైన భారతీయజనతా పార్టీని ఎంచుకొని ఉండవచ్చును. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన శిరీష్ భరద్వాజ్ లెక్క సరైతే రేపు ఎన్నికలలో ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగేతే, తానూ మామకు వ్యతిరేఖంగా చక్రం తిప్పవచ్చుననే ఆలోచనతోనే భాజాపాను ఎన్నుకొని ఉండవచ్చునని అంటున్నారు.