వైద్యం కోసం బెంగుళూరుకు కేజ్రీవాల్...

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి ఈ సామెత ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు బాగా సూటవుతుంది. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి, అనేక విమర్శలకు గురై కూడా మళ్లీ గెలవడం సామాన్యమైన విషయం కాదు. కానీ పాపం ఆయన గెలిచినాకూడా అనారోగ్యం వల్ల సంతోషం లేకుండా పోయింది. ప్రమాణ స్వీకారం రోజు కూడా ఆయన చాలా జ్వరంతో ఉన్నారు. చాలా కాలంగా ఆయన షుగర్, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. దీనికోసం ఆయన ప్రకృతి చికిత్స కోసం మార్చి 5న బెంగుళూరు వెళ్లనున్నారు. వైద్యం తరువాత ఆయన చక్కగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో ఢిల్లీవెళ్లాలని కోరుకుందాం.