మున్సిపల్ ఫలితాలపై తాత్కాలిక స్టే!

 

 

 

మునిసిపల్ ఫలితాలను ఈనెల తొమ్మిదో తేదీన వెల్లడి చేయడానికి ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు ఫలితాల వెల్లడి మీద తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను ఈనెల 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి తమకు వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎక్కువకాలం ఫలితాలను వెల్లడించకుండా వుండలేమని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, ఎందుకు వెల్లడించకూడదో కారణాలు తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.