సీమాంధ్రలో 3గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు

 

 

 

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు 63 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 67 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్‌లాల్ తెలిపారు. మరోవైపు విశాఖ జిల్లాలోని కొయ్యూరు మండలం, పలకజీడిలో రెండు ఈవీఎంలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది మావోయిస్టులు పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు :

1. శ్రీకాకుళం : 63శాతం

2. విజయనగరం : 65 శాతం

3. విశాఖపట్నం : 55 శాతం

4.తూగో : 63 శాతం

5. పగో : 67 శాతం

6. కృష్ణా : 62 శాతం

7. గుంటూరు : 67శాతం

8.ప్రకాశం : 62 శాతం

9. నెల్లూరు :63 శాతం

10. కడప : 65 శాతం

11. కర్నూలు : 63 శాతం

12. అనంతపురం : 66 శాతం

13.  చిత్తూరు : 61 శాతం