విభజనకు జీజం వేసింది రాజశేఖర్‌రెడ్డే

 

 Anam Ramanarayana Reddy, jagan Anam Ramanarayana Reddy

 

 

రాష్ట్ర విభజనకు జీజం వేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డేనని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై 40 మంది శాసనసభ్యులతో చిన్నారెడ్డి నాయకత్వంలో అధిష్ఠానానికి వైఎస్ లేఖ పంపారని గుర్తు చేశారు. వైఎస్ బాటలోనే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా పయనించారని వ్యాఖ్యానించారు.



2009 ఎన్నికల్లో వేర్పాటువాదానికి అనుకూలంగా కేసీఆర్‌తో కలిసి టీడీపీ పోటీ చేసిందని గుర్తుచేశారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా అఖిల పక్ష భేటీలో వేర్పాటువాదానికి అనుకూలంగా అభిప్రాయాలు చెప్పడంతో చివరగా కాంగ్రెస్ నిర్ణయం ప్రకటించిందన్నారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్‌ను దోషిగా నిలపాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తుండటం నీచమన్నారు. దేశ సమగ్రతకు పాటుపడిన ఇందిరా, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసానికి వైసీపీ నేతలు పాల్పడుతుండటం దౌర్భాగ్యమని, ఆ పార్టీలో విష పురుగులు ఉన్నందునే ఇలా జరుగుతోందన్నారు.