సోనియాను ప్రశ్నించినందుకే జైలులో జగన్ ?

 

 

 

 

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని , కాంగ్రెస్ పభుత్వాన్ని ప్రశ్నించిన పాపానికే తమ నేత జగన్ ను జైలులో పెట్టారని ఆయన అన్నారు.

 

హత్య చేసిన ఖైదీకి కూడా ఆరు నెలలు అవ్వగానే బెయిల్ ఇస్తారని, ఏ తప్పూ చేయని జగన్ కు బెయిల్ ఎందుకు ఇవ్వడం లేదని అంబటి అన్నారు. జగన్ జైలులో అడుగు పెట్టి రెండు వందల రోజులు పూర్తయిన కారణంగా శ్రీకాకుళం లో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలు కుమ్మక్కు అయి, జగన్ ను జైలులో అంబటి ఆరోపించారు. కాంగ్రెస్ దిగజారుడు కార్యక్రమాలకు ఇది నిదర్శనమని అంబటి వ్యాఖ్యానించారు. జగన్ ను అక్రమంగా జైలులో పెట్టారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని అంబటి అన్నారు.

 

కాంగ్రెస్ పార్టీలో అవినీతి చేయని మంత్రి ఎవరున్నారని అంబటి ప్రశ్నించారు. మోపిదేవికి ఒక న్యాయం, ధర్మానకు మరో న్యాయమా అని ఆయన అన్నారు. జగన్ త్వరలోనే బయటకు వస్తాడని, ప్రజల కష్టాలు తీరుస్తారని అంబటి అన్నారు.