నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్...

 

ప్రధాని నరేంద్ర మోడీ నల్లధనాన్ని అరికట్టే చర్యలో భాగంగా రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నా.. ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పాత నోట్లను తొలగించే క్రమంలో, కేంద్ర ప్రభుత్వం సహజమైన న్యాయ సూత్రాలను పాటించలేదని, రాజ్యాంగ సమన్యాయ విధానాన్ని ఆచరించలేదని.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల జీవించే హక్కును హరిస్తుందని.. పాత నోట్లను తొలగించే క్రమంలో, కేంద్ర ప్రభుత్వం సహజమైన న్యాయ సూత్రాలను పాటించలేదని, రాజ్యాంగ సమన్యాయ విధానాన్ని ఆచరించలేదని పిటిషనర్ ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు. మరోవైపు యూపీకి చెందిన లాయర్ సంగంలాల్ పాండే కూడా పిటిషన్ వేశారు.