వాళ్లు కుక్కపిల్లలన్న మోడీ

 

  Shock and haw as Narendra Modi speaks, Narendra Modi Puppy Love

 

 

మరో రాజకీయ దుమారానికి తెరతీశారు మోడీ.. 2002లొ జరిగిన గుజరాత్‌ అల్లర్ల సమయంలో ఆయన వ్యవహరించిన తీరు తీసుకున్నచర్యలను ఆయన సమర్థించుకున్నాడు.. ఆ సమయంలో తను చేసింది నూటి నూరుశాతం సరైనదే అన్నారు. తాను పక్కా హిందూ జాతీయ వాదినని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు..

 

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది కాని అప్పటి అల్లర్లలో మరణించిన వారిని ఉద్దేశిస్తూ కుక్కపిల్ల కారు చక్రం కింద పడితే బాధపడతాం కదా అన్న మోడీ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి.. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇతర పార్టీలు మోడీని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు..

 

భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ సారథిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చిన మోడీ గుజరాత్‌ అల్లర్ల సమయంలో జరిగిన విషయాలను వివరించారు. ఆ సమయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని అందుకే సుప్రిం కోర్టు కూడా తనను నిర్దోషిగా తెల్చిందన్నారు..

 

ఈ విషయంలో ఎప్పుడైన పశ్చాతాప పడ్డారా అన్న ప్రశ్నకు కుక్కపిల్ల కారు కింద పడితే ఎవరికైన బాధ ఉంటుందని బదులిచ్చారు.. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీతో పాటు సమాజ్‌వాది, సిపిఐ, సిపియం పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి.. భవిష్యత్‌ ప్రదానిగా అభివర్ణిస్తున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు..