పార్లమెంట్ ను కుదిపేసిన గ్యాంగ్ రేప్: బీజేపీ ధ్వజం

 

 

 

ఢిల్లీలో మెడికల్ స్టూడెంట్ పై జరిగిన గ్యాంగ్ రేప్‌ పై పార్లమెంట్ ఉభయ సభల్లో గందగోళం నెలకొంది. రాజ్యసభలో ప్రశ్నోత్తర సమయాన్ని రద్దు చేసి, అత్యారారంపై చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు పట్టుపట్టారు. ప్రశ్నోత్తర సమయం అనంతరం అవకాశమిస్తామని ఛైర్మన్ చెప్పినప్పటికీ సభ్యులు వినలేదు. దీంతో సభను 15 నిముషాలపాటు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనా మరో అరగంట వాయిదా వేశారు.

 

మరోవైపు లోక్‌సభలోనూ ఇదే అంశం కుదిపేసింది. దీనిపై ఎంసీ జయాబచ్ఛన్ ఉద్వేగంతో ప్రసంగించారు. అత్మాచార ఘటనపై ప్రభుత్వం సమాధానం సరిగా లేదని విమర్శించారు. విద్యార్ధినిపై జరిగిన రేప్‌ను హత్యాయత్నం కేసుగా పరిగణించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరారు. అందుకు స్పీకర్ అంగీకరించలేదు.


దేశ రాజధానిలో నేరాలను అదుపుచేయలేకపోతున్నారని బీజేపీ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. ఈ ఘటన చాలా సీరియస్ అంశమని, ఇలాంటివి తరచూ జరుగుతున్నాయని బిజేపీ వ్యాఖ్యానించింది. కాగా ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని గుర్తించినట్లు సమాచారం.