మంత్రివర్గం నుంచి డీఎల్ బర్తరఫ్

Publish Date:Jun 1, 2013

 

 

 

 

మంత్రివర్గం నుంచి డీఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేశారు. పార్టీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో నెలకొన్న విభేదాల కారణంగానే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. సీఎం ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన మరునాడే డీఎల్ పై వేటు వేయడం గమనార్హం. డీఎల్ ను తప్పించేందుకు సీఎంకు అధినేత్రి సోనియాగాంధీ అనుమతి ఇచ్చారని సమాచారం.