BREAKING NEWS

కోల్ స్కాంపై విపక్షాల రగడ, లోక్‌సభ రేపటికి వాయిదా

Publish Date:Aug 21, 2012

కోల్‌స్కాంపై విపక్షాల రగడతో లోక్‌సభ రేపటి(బుధవారం)కి వాయిదా పడింది. మంగళవారం ఉదయం సమావేశం ప్రారంభంకాగానే బొగ్గు కుంభకోణంపై విపక్షాలు గందరగోళం సృష్టించడంతో సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన సభలోనూ విపక్షాలు తమ పట్టు వీడలేదు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లిన విపక్ష సభ్యులు నిరసన వ్యక్తపరిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ మీరాకుమార్ సభను బుధవారానికి వాయిదా వేశారు.