BREAKING NEWS

సిరీస్‌కు సేలేక్ట్ అయి, రిటైర్‌మెంట్ ప్రకటించిన లక్ష్మణ్

Publish Date:Aug 19, 2012

వీవీఎస్ అంటే వెరీ వెరీ స్పెషల్! పరుగులు తీయడమే కాదు... ఆ పరుగును ఆపడంలోనూ లక్ష్మణ్ వెరీ వెరీ స్పెషల్. జెంటిల్‌మెన్ గేమ్‌లో మనవాడు అసలు సిసలైన్ జెంటిల్‌మన్! ఈ సొగసరి షాట్ల బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌కు సెలవు పలికాడు. మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగే టెస్టులో ఆడాల్సి ఉన్నా... అంతకంటే ముందే గుడ్‌బై చెప్పాడు.


 

ఉద్వేగ భరిత వాతావరణం మధ్య... శనివారం తన రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఒక ఆటగాడు సిరీస్‌కు సెలెక్ట్ అయి, అది ఆడకుండానే రిటైర్మెంట్ ప్రకటించడం భారత క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి! ఏ ఆటగాడైనా సొంత గడ్డపై, సొంత ప్రేక్షకులమధ్య బ్యాటు ఝళిపించి... కెరీర్‌కు చిరస్మరణీయమైన ముగింపు పలకాల ని భావిస్తాడు. కానీ... లక్ష్మణ్ దీనికిముందే ఎందుకు 'లక్ష్మణ రేఖ' గీసుకున్నాడు? ప్రత్యర్థులు కూడా ప్రశంసించే లక్ష్మణ్ మనసును 'ఎవరైనా' గాయపరిచారా? అయితే... వారెవ రు?