BREAKING NEWS

చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించిన కుతూహలమ్మ

Publish Date:Aug 6, 2012

ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నేత కుతూహలమ్మ చెంగల్రాయ నాయుడు సంస్మరణ సభలో మాట్లాడుతూ చంద్రబాబు పై పొగడ్తల వర్షం కురిపించారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానంటే అందుకు కారణం చంద్రబాబు అని, తనను జెడ్పీ చైర్ పర్సన్‌గా చేసి రాజకీయాల్లో రాణించేందుకు తనకు మంచి అవకాశం కల్పించారన్నారు. కాగా చంద్రబాబును పొగుడుతున్న సమయంలో చెంగల్రాయ నాయుడు సంస్మరణ సభకు వచ్చిన వారంతా చప్పట్లు కొట్టడం గమనార్హం.