BREAKING NEWS

అన్నా టీమ్ ను రద్దు చేసిన హజారే

Publish Date:Aug 6, 2012

అన్నా హజారే తన టీమ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై పోరాడేందుకు తామంతా కలిసామని.. ఐతే ఇప్పుడు ఆ అవసరం లేదని బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇకపై లోక్‌పాల్‌ కోసం ప్రభుత్వంచో చర్చలు ఉండబోవని స్పష్టం చేశారు. రాజకీయ ప్రత్యమ్నాయంగా ఏర్పడుతున్నందున టీమ్‌ను రద్దుచేస్తున్నట్టు హజారే తన బ్లాగ్‌లో రాశారు.