BREAKING NEWS

వీడుతున్న నీలిమ మృతి మిస్టరీ

Publish Date:Aug 6, 2012

Infosys employee Neelima death, infosys Neelima dead, infosys Neelima died, infosys Neelima diesఇన్ఫోసిస్ కార్యాలయంపై నుంచి దూకి మరణించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నీలిమ మృతి మిస్టరీని ఛేదించే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతికి ముందు ఇన్ఫోసిస్ మాజీ ఉద్యోగి ప్రశాంత్, సంస్థలోని ఇతర స్నేహితులకు పంపిన ఈ మెయిళ్లను పోలీసులు తెరిచి చూశారు. ఈ మెయిల్స్‌ను, మెసేజ్‌లను, ఫోన్ కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు. వీటి ఆధారంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో మృతి చెంది ఉంటుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటి ఆధారంగా పోలీసులు ఒక అభిప్రాయానికి వచ్చారు. నీలిమది ఆత్మహత్యే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని వారు భావిస్తున్నారు. ఆ కోణంలోనే దర్యాఫ్తును ముమ్మరం చేశారు. నీలిమ నుంచి చివరి కాల్ అందుకున్న వ్యక్తి ప్రశాంత్ విశాఖపట్నంలో ఉన్నట్లుగా ఇప్పటికే సెల్ ఫోన్ టవర్ ఆధారంగా గుర్తించారు. ఆమె భర్త సురేష్‌ని విచారించారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదించే ప్రయత్నాల్లో పోలీసులు నిమగ్నమయ్యారు.