BREAKING NEWS

ఇంగ్లండ్‌ను చిత్తుచేసిన దక్షిణాఫ్రికా

Publish Date:Jul 24, 2012

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌కు చివరిరోజైన  ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది.  కాగా, ఓవల్‌లో దక్షిణా ఫ్రికా జట్టు గెలుపొందడం ఇదే తొలిసారి. ఓవర్‌నై ట్ స్కోరు 102/4తో ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ను డేల్ స్టెయిన్ (5/56) దెబ్బతీశాడు. బెల్ (55), ప్రయర్ (49) తప్ప ఎవరూ రాణించలే దు. లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఆమ్లాకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.