LATEST NEWS
  గోదావరి బోటు ఘటన జరిగి నెల రోజులు కావోస్తున్నా ఇప్పటికి బోటు బయటకు రాలేదు.నిన్న ఆపరేషన్ వశిష్ట మళ్ళీ ప్రారంభించిన సత్యం బృందం ఆపరేషన్ వశిష్ట పార్ట్ 2 విజయవంతమవుతున్నట్లే అనిపిస్తోంది. ధర్మాడి సత్యం చేస్తున్న ప్రయత్నాలకు ఫలితం కనిపిస్తుంది. గోదావరి వరద ఉధృతి తగ్గిన నేపథ్యంలో పెద్ద లంగర్ కు రాయల్ వశిష్ట బోటు తగిలింది. ప్రస్తుతం దాన్ని బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు.  రాయల్ వశిష్ట బోటును కచ్చులూరు మంద వద్ద వెలికి తీసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దాదాపుగా ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో పంట్లు సాయం తోటి కావాల్సినటువంటి ఐరన్ రోప్ లో నైలాన్ తాళ్ళు బలమైన లంగరుల తోటి ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో కచ్చులూరుకు సత్యం బృందం చేరుకుంది. అక్కడకు చేరుకున్న తర్వాత మూడు నాటు పడవల్లో విడివిడి గా మూడు బృందా లు మూడు లంగర్లు చిన్న లంగర్ లు తీసుకుని బోటు మునిగిన ప్రాంతంలో  లంగరు వేస్తూ గాలించే ప్రయత్నం చేసింది సత్యం బృందం. అయితే కొద్ది సేపటి క్రితమే ఒక బరువైన వస్తువు లంగర్ కు చిక్కినట్లు సత్యం బృందం వెల్లడిస్తోంది.బోటును బయటకు లాగటానికి కావాల్సిన ఐరన్ రోపులను,నైలాన్ తాడుల సహయంతో,పంటు సహయంతో లంగర్ కు తగిలిన బలమైన వస్తువును ఎట్టి పరిస్థితిలో బయటకు తీసేందుకు ఇరవై ఐదు మంది ఉన్న బృందంతో సిద్ధమైయ్యింది.ఎట్టి పరిస్థితిలో ఈ రోజు బోటును బయటకు తెచ్చేందుకు ధర్మాడి సత్యం బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.ఈ రోజు ఐనా బోటుకు ఏ ఆటంకాలు లేకుండా బయటకు వస్తోందో లేదో వేచి చూడాలి.
  పోలీసులకు వారాంతంలో సెలవులు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు ఏపీ హోంమత్రి సుచరిత. డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలను అరికట్టాలని సూచించారు. మంగళగిరి ఆరవ పోలీస్ బెటాలియన్ లో ఇవాళ డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత శిక్షణ పూర్తి చేసుకున్న తొలి డీఎస్పీల టీమ్ ఇదే. ఈ టీమ్ లోని మొత్తం ఇరవై ఐదు మంది డీఎస్పీలలో పదకొండు మంది మహిళలు ఉన్నారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న డీఎస్పీల నుంచి హోంమంత్రి సుచరిత గౌరవ వందనం స్వీకరించారు. వృత్తిపరమైన సవాళ్లను అధిగమించి ప్రజాసేవ దిశగా ముందుకు వెళ్లాలని పిలుపు నిచ్చారు ఆమె. గ్రామీణాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.  సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కొత్త డీఎస్పీలకు చెప్పారు డిజిపి సవాంగ్. విధి నిర్వహణలో అనేక సవాళ్లు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయని, వాటన్నింటిని విజయవంతంగా ఎదుర్కోవాలంటే ధైర్యం, సంకల్పం మరియు ఉన్నత విలువలతో వ్యవహరించవలసినటువంటి అవసరముంది అన్నారు. మన జనాభాలో డెబ్బై శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు అని, అందువలన గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన మీరు కలిగి వుండవలసినటువంటి అవసరం ఉందని అందుకోసం విస్తృతంగా గ్రామాల్లో మీరు పర్యటించాలి అని, వారితో మమేకమవ్వాలి అని సూచించారు. 
  రాజకీయ ప్రస్థానంలో పద్నాలుగేళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉండి, నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం సొంతం చేసుకున్న మన చంద్రబాబు ఇటీవల తెల్లవారుజాము వరకు సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారట. వివరాళ్లోకి వెళ్తే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు చంద్రబాబు ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా సమీక్షలు అపాయింట్ మెంట్ లతో బిజీగా ఉండేవారు. కొత్త రాష్ట్రం కనుక కష్టపడాలని ధోరణిని చంద్రబాబు తన కార్యాచరణలో చూపించేవారు. అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఈ హడావుడిలో పడి ఆయన టిడిపిని పూర్తిగా విస్మరించారని పార్టీ నేతలే చెబుతున్నారు. అప్పట్లో ఆయనను కలిసేందుకు కార్యకర్తలు వస్తే అపాయింట్ మెంట్ సులభంగా దొరికేది కాదట, చివరకు మంత్రులు కూడా గంటల తరబడి చంద్రబాబును కలవడం కోసం నిరీక్షించేవారు. ఆయన దర్శనం దొరకని వారు నిరాశతో వెనుదిరిగిన సందర్భాలు కూడా ఉండేవి. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరాజయం తర్వాత చంద్రబాబు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు.  తాజాగా ఆయన జిల్లాల వారీగా పార్టీ సమీక్ష నిర్వహించడం ప్రారంభించారు. తూర్పు గోదావరి, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాలో ఆయన సమీక్షలు నిర్వహించారు. విశాఖలో రెండ్రోజుల పాటు సమీక్ష కొనసాగింది. ఈ సందర్భంగా మొదటి రోజు పార్టీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని మధ్యాహ్నం వరకు నిర్వహించారు. సాయంత్రం నాలుగైదు నియోజక వర్గాల సమీక్షలు చేపట్టారు. అవి పూర్తయ్యేసరికి సమయం రాత్రి పది గంటలు అయింది. ఇంకా రెండు మూడు నియోజక వర్గాల సమీక్షలు మిగిలిపోయాయి. దీంతో చంద్రబాబు రేపు ఉదయం సమీక్ష నిర్వహిద్దాం అని చెప్పినప్పటికీ కార్యకర్తలు అంగీకరించలేదు. ఎంత టైమైనా సమీక్షలు పూర్తి చేయాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తెల్లవారుజామున నాలుగు గంటల వరకు ఆయా నియోజక వర్గాల సమీక్షలు నిర్వహించారు చంద్రబాబు. పార్టీ అధినేత వైఖరి పట్ల కార్యకర్తలో వచ్చిన మార్పుకి ఇదొక నిదర్శనం అని చెప్పాలి.  విశాఖపట్టణం టిడిపి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. విమానాశ్రయానికి చంద్రబాబు విచ్చేసినప్పుడు ఆయన ప్రయాణించిన దారి పొడవునా కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. ఈ పరిణామం చంద్రబాబుని కూడా ఉత్సహపరిచింది. సాధారణంగా చంద్రబాబే తెల్లవారుజాము వరకు సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. గతంలో అలాంటి పరిస్థితి వస్తే కార్యకర్తలు నేతలు విసుక్కునేవారు. కాని ఈ సారి రివర్స్ లో కార్యకర్తలే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు. సమీక్షలు నిర్వహించాలని పట్టుబట్టడం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ నీయాంశంగా మారింది. ఉదయం మళ్లీ పది గంటలకే సమీక్ష నిర్వహించాల్సి ఉండటంతో రాత్రి ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీ నేతలు కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేశారట. అయినా కార్యకర్తల మాత్రం వినిపించుకోలేదట. దీనికి తోడు ఒక నియోజక వర్గ సమీక్ష పూర్తయిన వెంటనే కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబుతో సెల్ఫీల కోసం ఎగబడటంతో అనూహ్య జాప్యం జరిగిందని పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి విశాఖ టూర్ అక్కడి కార్యకర్తల జోష్ తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్పష్టమవుతోంది.  
ALSO ON TELUGUONE N E W S
  చిరంజీవి పన్నెండేళ్ల కల 'సైరా.. నరసింహారెడ్డి' సినిమా తెలుగునాట మినహా మిగతా అన్ని ఏరియాల్లోనూ ఫ్లాప్ కావడం ఖాయమని తేలింది. నిజానికి ఒక చరిత్రకు.. అందునా బ్రిటిషర్లపై రాజీలేని పోరుసల్పి, ఆ పోరులో ప్రాణాల్ని పణంగా పెట్టిన రేనాటి వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథకు.. సాక్షీభూతంగా నిలిచిన సినిమాని తెలుగువాళ్లు సొంతం చేసుకోవాలి. తమ వీరుడి గాథను సెల్యులాయిడ్‌పై ఆవిష్కరించడాన్ని గొప్పగా భావించాలి. ఇక్కడ కమర్షియల్ అంశాల కంటే, సినిమానే హైలెట్ కావాలి. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఏ సినిమాకైనా బాక్సాఫీస్ కలెక్షన్లే కొలబద్దగా మారాయి.  ఒక సినిమాకు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందటే.. ఎంతమంది ప్రేక్షకులు చూస్తే.. అంత కలెక్షన్ వస్తుంది? మల్టీప్లెక్సుల్లో టికెట్ ధర 130 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ఉంటుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 40 రూపాయల నుంచి 100 రూపాయల వరకు టికెట్ రేట్లు ఉంటున్నాయి. వాటిలో యావరేజ్ టికెట్ రేటు 70 రూపాయలుగా లెక్క కడితే.. 'సైరా' మూవీని 2 కోట్ల మందికి పైగా థియేటర్లలో వీక్షించి ఉంటారని అంచనా. ఇంతమంది చూసిన సినిమా హిట్టయినట్లా, ఫ్లాపయినట్లా? జనరల్‌గా చూస్తే.. బ్లాక్‌బస్టర్ హిట్ అనుకోవాలి. కానీ బాక్సాఫీస్ పరంగా చూసినప్పుడు 'సైరా' బ్లాక్‌బస్టర్ కాదు. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో మినహాయిస్తే.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ రాష్ట్రాలు, ఓవర్సీస్ ఏరియాలన్నింటిలోనూ ఆ సినిమా ఫ్లాప్ అని ట్రేడ్ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. అంటే ఆ ప్రాంతాల్లో బయ్యర్లు లేదా నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి తగినట్లు కలెక్షన్లు రాలేదు. మునుముందు వస్తాయనే ఆశ ఏమాత్రమూ లేదు. ఇప్పటివరకూ 'సైరా' ఎంత వసూలు చేసిందనే విషయంపై 'సైరా' ప్రొడ్యూసర్ రాంచరణ్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ అనేది ఇవ్వలేదు. ఇవ్వనని ఆయన స్పష్టం చేశాడు కూడా. 'సైరా'ను డబ్బుల్తో కొలవకూడదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీ కలెక్షన్లపై పెద్ద యుద్ధమే నడుస్తోంది. కొన్ని బాక్సాఫీస్ ట్రాకింగ్ సైట్లు 'సైరా' కలెక్షన్ లెక్కల్ని వెల్లడి చేస్తూ వస్తున్నాయి. ఒక సైట్‌కూ, ఇంకో సైట్‌కూ ఈ లెక్కల్లో తేడా కనిపిస్తోంది. ప్రి రిలీజ్ బిజినెస్ విషయంలోనూ, కలెక్ట్ చేసిన షేర్ విషయంలోనూ లెక్కలు భిన్నంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి ట్రేడ్ విషయాల్నీ, కలెక్షన్ల రిపోర్టునీ ఇస్తూ వస్తున్న ఒక పేరుపొందిన ట్రాకింగ్ సైట్ 'సైరా' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలుగా లెక్కగడితే, మరో పాపులర్ సైట్ ఆ విలువ సుమారు 153 కోట్ల రూపాయలనీ, తమిళనాడు, కేరళ, నార్త్ ఇండియా ఏరియాల్లో ప్రొడ్యూసర్ స్వయంగా రిలీజ్ చేశారనీ తెలిపింది. ఓన్ రిలీజ్ విలువను అది లెక్కకట్టలేదు. మరొక సైట్ అయితే 'సైరా' ప్రి బిజినెస్ వాల్యూ 187 కోట్లుగా తేల్చింది. ఈ విరుద్ధమైన విలువల కారణంగా, ఇప్పుడు వచ్చిన కలెక్షన్లను బేరీజు వేస్తే, అవి కూడా విరుద్ధమైన లెక్కలే చెబుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ ప్రి బిజినెస్ విలువను మొదట ప్రస్తావించిన ట్రాకింగ్ సైట్ 34 కోట్ల రూపాయలుగా తెలిపింది. రెండు వారాలకు ఈ ఏరియాలో 'సైరా' 31.5 కోట్ల రూపాయలు వసూలు చేసిందనేది తాజా సమాచారం. అంటే బ్రేకీవెన్ కావడానికి ఇంకా 2.5 కోట్ల రూపాయలు రావాలి. కానీ మిగతా సైట్లలో కొన్ని ఈ ప్రి బిజినెస్ విలువను 30 కోట్ల రూపాయలని చెబితే, ఒకట్రెండు 28 కోట్ల రూపాయలని పేర్కొన్నాయి. వాటి ప్రకారం తెలంగాణలో 'సైరా' బ్రేకీవేన్ సాధించి, హిట్ రేంజికి వెళ్లింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 'సైరా' ప్రి రిలీజ్ బిజినెస్ విలువ 115 కోట్ల 40 లక్షల రూపాయలుగా మొదటి సైట్ లెక్కవేసి, 12 రోజులకు వచ్చిన వసూళ్లు 98.5 కోట్లుగా వెల్లడించింది. అంటే ఆ సైట్ ప్రకారం ఇంకా 16 కోట్లకు పైగా వస్తేనే, తెలుగునాట ఈ సినిమా బ్రేకీవెన్ సాధించినట్లు లెక్క. రెండో సైట్ తెలుగునాట ఈ ప్రి బిజినెస్ వాల్యూ 107 కోట్ల 90 లక్షల రూపాయలుగా పేర్కొంది. ఆ సైట్ ప్రకారం 12 రోజుల్లో 'సైరా' రాబట్టిన షేర్ 99 కోట్ల 67 లక్షలు. అంటే ఈ సైట్ ప్రకారం 8.5 కోట్ల షేర్ వస్తే, బ్రేకీవెన్ అయినట్లే. వీటిలో ఏది జెన్యూన్, ఏది ఫేక్ అనే విషయం తేల్చడానికి ఎవరూ సిద్ధపడటం లేదు. సాధారణంగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వచ్చే 'డైలీ కలెక్షన్ రిపోర్ట్' ఆధారంగానే గ్రాస్, నెట్, షేర్ విలువను లెక్కగడుతుంటారు. టాక్స్ వాల్యూని తగ్గించుకోడానికి కొంతమంది ఉద్దేశపూర్వకంగా వసూళ్లను తక్కువచేసి చూపుతుంటారనే వాదన చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉంది. ప్రొడ్యూసర్ నోరు విప్పి చెబితే తప్ప నిజమైన వసూళ్ల విలువ ఏదో మిగతా వాళ్లెవరికీ తెలీదనే చెప్పాలి.  'సైరా' ఫ్లాప్ అని చెప్పడానికి కావాలనే ఒక సైట్, దాని ప్రి రిజీల్ బిజినెస్ విలువను ఎక్కువ చేసి రాస్తున్నదంటూ సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. 'సైరా' బాక్సాఫీస్ లెక్కల్లోని ఈ గందరగోళంతో, ఎవరి రిపోర్ట్ జెన్యూన్, ఎవరి రిపోర్ట్ ఫేక్.. అనే విషయం అర్థంకాక చాలామంది తలలు పట్టుకుంటున్నారు. "శుభ్రంగా సినిమాని చూశామా, దాన్ని ఆస్వాదించామా, లేదా.. అనే విషయాన్ని పక్కనపెట్టి, ఈ కలెక్షన్ల గొడవేమిట్రా బాబూ" అని వాపోతున్నవాళ్లూ ఉన్నారు. 
మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్‌ ‘అల... వైకుంఠపురములో’ సినిమాల సంక్రాంతి సమరం గురించి ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్‌ మీడియాలో ప్రేక్షకాభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సంక్రాంతికి ముందే... క్రిస్మస్‌ బరిలో మరో సమరానికి ఈ రోజు తెర లేచింది. క్రిస్మస్‌కి ఐదు రోజుల ముందు, థియేటర్ల బరిలో బాలకృష్ణతో ‘ఢీ’ కొట్టబోతున్నాడు మెగా మేనల్లుడు సాయితేజ్‌. బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మిస్తున్న ‘రూలర్‌’ సినిమా డిసెంబర్‌ 20న విడుదల కానుంది. అఫీషియల్‌గా అందరికీ ప్రెస్‌ నోట్‌ ఇవ్వలేదు కానీ కొన్ని రోజుల క్రితమే నిర్మాత సి. కల్యాణ్‌ ఓ పత్రికతో విడుదల తేదీ వెల్లడించారు. ఇప్పుడు అదే తేదీకి ‘ప్రతిరోజూ పండగే’ విడుదల చేయనున్నట్టు ఈ రోజు ప్రకటించారు. క్రిస్మస్‌ బరిలో నటసింహంతో మెగా మేనల్లుడు పోటీ పడనున్నాడన్న మాట! అసలు, వీరిద్దరి కంటే డిసెంబర్‌ 20 మీద ముందుగా కర్చీఫ్‌ వేసింది నితిన్‌. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నటిస్తున్న ‘భీష్మ’ సినిమాను ఆ రోజున విడుదల చేస్తామని ఆ టీమ్‌ ఎప్పుడో ప్రకటించింది. ఇప్పుడు ఎవరు వెనక్కి తగ్గుతారో... ఎవరు ముందుకు వెళతారో! ఇటు ఇండస్ట్రీ ప్రముఖుల్లో, అటు ప్రేక్షకుల్లో టెన్షన్‌ టెన్షన్‌ నెలకొంది. బాలకృష్ణ, నితిన్‌, సాయి తేజ్‌ కంటే రవితేజ ఐదు రోజులు ఆలస్యంగా డిసెంబర్‌ 25న ‘డిస్కో రాజా’తో థియేటర్లలోకి రానున్నాడు.
కాజల్‌ అగర్వాల్‌, తమన్నా, శ్రియ వంటి అతికొద్ది మంది హీరోయిన్లు మాత్రమే పదేళ్లుగా తమ అందచందాలను, ప్రేక్షకుల్లో అభిమానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ స్టార్‌ హీరోల పక్కన ఛాన్సులు అందుకుంటున్నారు. అప్పట్లో నాగార్జున, రవితేజ, తరుణ్‌ తదితర హీరోల పక్కన నటించిన స్నేహ... అక్క, వదిన పాత్రలకు షిఫ్టయ్యారు. ‘తీన్‌మార్‌’లో పవన్‌కల్యాణ్‌ పక్కన ఫ్లాష్‌బ్యాక్‌లో హీరోయిన్‌గా నటించిన కృతీ కర్భందా ఇప్పటికీ హిందీలో హీరోయిన్‌గా చేస్తున్నారు. కానీ, తెలుగులో రామ్‌చరణ్‌ ‘బ్రూస్‌లీ’లో అక్కగా నటించారు. కాస్త క్రేజ్‌ తగ్గిన హీరోయిన్లు ఇతర పాత్రల కోసం చూస్తున్నారు. కానీ, ప్రియమణి మాత్రం హీరోయిన్‌గా చేస్తానని చెబుతున్నారు. తెలుగులో ఒకప్పుడు ప్రియమణి స్టార్‌ హీరోయిన్‌. బికినీలో హల్‌చల్‌ చేశారు. ఇప్పుడు మాత్రం స్టార్‌ కాదు. అలాగని, ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. పెళ్లి తర్వాత నటించడమూ మానలేదు. కొంచెం ఒళ్లు చేసినా... ఫిట్‌నెస్‌, ఫిజిక్‌ మెంటైన్‌ చేస్తున్నారు. అయినా సరైన అవకాశాలు రావడం లేదు. వస్తే... యాక్టింగ్‌, గ్లామర్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. కానీ, ఇప్పుడు ప్రియమణికి హీరోయిన్‌గా ఛాన్స్‌ ఇచ్చే స్టార్‌ హీరోలు ఎవరున్నారు? ప్రతి ఏడాది కొత్త హీరోయిన్లు వస్తున్నప్పుడు ఆలోచించాల్సిందే.
టీవీ ఆడియన్స్‌కు ఓంకార్‌ అన్నయ్య గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. రియాలిటీ డ్యాన్స్‌ షోలు, టీవీ ప్రోగ్రామ్స్‌తో పాపులర్‌ అయ్యారు. సినిమా ఆడియన్స్‌కు జీనియస్‌, రాజుగారి గది సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ‘రాజుగారి గది 3’తో ఈ నెల 18న మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా ప్రెస్‌మీట్స్‌లో ఓంకార్‌ ఎప్పుడూ తెల్లకుర్తాలో కనపడుతున్నారు. నిజానికి, ఓంకార్‌ స్టైల్‌ అది కాదు. సూట్స్‌ లేదా స్టైలిష్‌ డ్రస్సులో కనపడతారు. అటువంటి వ్యక్తి ఎందుకు తెల్లకుర్తా వేసుకుంటున్నారో తెలుసా? ఏడాది క్రితం ఓంకార్‌ తండ్రి మరణించారు. అప్పట్నుంచి ఆయన తెల్లకుర్తా వేసుకుంటున్నారు. ‘‘నాన్నగారు మరణించిన తర్వాత ఇలా తెల్లకుర్తా వేసుకుంటే ఆయన మాతోనే ఉన్నారనే ఫీలింగ్‌ కలుగుతోంది. అమ్మానాన్నలు నాకు జన్మనిచ్చినా... నా కెరీర్‌కు జన్మను ఇచ్చింది మాత్రం నా ఇద్దరు తమ్ముళ్లు అశ్విన్‌బాబు, కల్యాణ్‌. అశ్విన్‌ను హీరోను చేయాలని నా కల. అది నా బాధ్యత. హీరోగా తమ్ముణ్ణి నిలబెట్టేవరకూ తెల్లకుర్తాలో ఉండాలని నిర్ణయించుకున్నా. 18న ఈ కుర్తా తీసేసి రోజు. తప్పకుండా సినిమా హిట్టవుతుంది. తర్వాత చిన్న తమ్ముడు కల్యాణ్‌ను నిర్మాతను చేస్తా’’ అని ఓంకార్‌ అన్నారు.
ఆర్నాల్డ్‌ ష్వార్జనెగ్గర్‌ నటించిన హిట్‌ ఫిల్మ్‌ ఫ్రాంచైజీ ‘టెర్మినేటర్‌’ తరహా యాక్షన్‌ సినిమాలు ప్రభాస్‌ అన్న చేయాలనీ... చేస్తే బాగుంటుందనీ... అటువంటి సినిమాలు చేయడానికి నేనింకా బచ్చాగాడినే అనీ యంగ్‌ సన్సేషనల్‌ హీరో, రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ అన్నారు. ఐదారేళ్ళ తరవాత అటువంటి సినిమాలు వస్తే చూద్దామన్నారు. ‘టెర్మినేటర్‌: డార్క్‌ ఫేట్‌’ తెలుగు ట్రైలర్‌ను బుధవారం ఉదయం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ మీరు పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా చేయలేదు. ఎప్పుడు చేస్తారని అడగ్గా... ‘‘పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో చేయబోయే సినిమా యాక్షన్‌ సినిమాయే’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆ సినిమా కోసం సిక్స్‌ప్యాక్‌ చేయాలనుకుంటున్నాననీ... ఏం జరుగుతుందో చూద్దామనీ అన్నారు. తెలుగులో హాలీవుడ్‌ సినిమాలను డబ్బింగ్‌ చేయడం గురించి మాట్లాడుతూ ‘‘సాధారణంగా నేను హాలీవుడ్‌ సినిమాలను ఇంగ్లిష్‌లో చూస్తాను. తెలుగులో ‘300’ చూశా. విచిత్రంగా ఉంది డబ్బింగ్‌. ఇప్పుడు చాలా క్వాలిటీగా చేస్తున్నారు. డిస్నీ వాళ్లు తెలుగులో హాలీవుడ్‌ సినిమాలను డబ్బింగ్‌ చేసినట్టు, మన ‘సైరా’, ‘సాహో’, ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ సినిమాలను హిందీలో డబ్బింగ్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు.  
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది ఏపీలో సీఎం ఆర్ఎఫ్ బాధితుల పరిస్థితి. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండర్ల తో సొమ్ము ఆదా చేసినట్టు ప్రజల ఆరోగ్య విషయంలోనూ అదే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పాత వారికి డబ్బులు జమ చేయకుండా కొత్త వారికి దరఖాస్తులు చూడకుండా ప్రభుత్వం వారితో ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు దాటినా ముఖ్య మంత్రి సహాయ నిధి నుంచి నామ మాత్రం గానే బాధితులకు సొమ్ము విడుదల చేస్తోంది. ఇతర ప్రాజెక్టుల మాదిరిగా ఇక్కడ కూడా రివర్స్ పద్ధతిని పాటిస్తున్నట్లు కనబడుతుంది. గత ప్రభుత్వంలో వచ్చిన దరఖాస్తులను మళ్లీ తనిఖీ చేస్తున్నామంటూ కాలయాపన చేస్తోంది. దీంతో రిలీఫ్ పండ్ సెక్షన్ లో సుమారు ముప్పై మూడు వేల దరఖాస్తులు నూట యాభై కోట్ల బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. గత ప్రభుత్వం తన మన అని చూడకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎల్వోసీలోని ఉదారంగా అందించింది. కొత్త ప్రభుత్వం అంత కంటే ఎక్కువే చేస్తుందని ప్రజలు ఆశించారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి నాలుగు నెలలుగా ప్రతి రోజూ మూడు వందల నుంచి నాలుగు వందల దరఖాస్తుల సీఎంఆర్ఎఫ్ వస్తున్నాయి. అధికారులు వాటి అన్నింటినీ పక్కన పడేస్తున్నారు. జూన్ ఒకటి నుంచి అక్టోబర్ వరకు పదమూడు వేల సీఎం ఆర్ కు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి విలువ సుమారు డెబ్బై కోట్లని అంచనా. ఇవి కాకుండా టీడీపీ ప్రభుత్వంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు వచ్చిన పద్దెనిమిది వేల దరఖాస్తులను కొత్త ప్రభుత్వం పెండింగ్ లో ఉంచింది. వీటి విలువ కూడా అరవై ఐదు కోట్ల పైనే ఉంటుంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులను మాత్రమే క్లియర్ చేస్తుంది.వీటిలో ఐదు వందల నుంచి ఆరు వందల దరఖాస్తులకు మాత్రమే చెక్కులు అందించింది.ఆ చెక్కులు కూడా బాధితుల అకౌంట్ లలో జమ కాలేదని తెలుస్తోంది. దరఖాస్తులను ఇంకా వాయిదాలో ఉండటంతో  బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది జిల్లాల్లో ఎమ్మెల్యేల కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. దీంతో ఎమ్మెల్యే లు సీఎం కార్యాలయం పై ఒత్తిడి తెస్తున్నారు ఫలితంగా నియోజకవర్గాని కి యాభై దరఖాస్తుల చొప్పున క్లియర్ చేసేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. అయితే ఎమ్మెల్యేలు పేద ప్రజలను వదిలేసి తమ బంధువుల అనుంగు సహచరులు దరఖాస్తులు మాత్రమే నిశ్చితం చేయించుకుంటున్నారు. డబ్బుల్లేక నిధులు విడుదల చేయడం లేదా అంటే ప్రస్తుతం సుమారు ఎనభై కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. వీటిని విడుదల చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఐదు వేల మందికి ఇచ్చిన చెక్కు లను కూడా ఇప్పటి వరకు క్లియిర్ చేయకుండా ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. చెక్కులు చేతికి వచ్చిన బ్యాంకుల్లో డబ్బు లు జమ కాకపోవడం తో కొంత మంది బాధితులు ఆశలు వదిలేసుకున్నారు. ప్రస్తుత వాతావరణం చూసి ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యా లు భయపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియక ఆందోళన చెందుతున్నాయి. అందుకే రోగులకు లెటర్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం చాలా ఆస్పత్రుల్లో ముప్పై నుంచి అరవై లక్షల వరకు ఎల్ వోసీలు బకాయిలున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టుకొని కొత్తగా రోగుల కు ఎల్ వోసీ నుంచి తాము అప్పులపాలు కాలేమని ప్రైవేటు ఆసుపత్రుల చేతులెత్తేస్తున్నాయి. ఇదే విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరిస్తున్నాయి డబ్బులుంటే బిల్లు కట్టే వైద్యం చేయించుకోండి లేదంటే వెళ్లిపొమ్మని కటువుగా చెప్పేస్తున్నారు విధిలేక కొందరు రోగులు లక్షల్లో అప్పు లు చేసి వైద్యం చేయించుకుంటున్నారు ఇంకొంతమంది అనారోగ్యం తో యుద్ధం చేస్తున్నారు.ఇక జగర్ సర్కార్ ఏమి చేయ్యబోతోందో వేచి చూడాలి.
  జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ దారుణ పరాజయంతో చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొని ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లి పోయారు. అందుకే సోదరుడు పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీ పెట్టినా దానికి దూరంగానే ఉన్నారు. జనసేన వైసీపీకి పూర్తి వ్యతిరేక పార్టీ, మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఓడించేందుకు పవన్ కళ్యాణ్ తన వంతు ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు. తమ్ముడు పవన్ ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకం కనుకనే జగన్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినా ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు చిరంజీవి. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్ళిన చిరంజీవి దంపతులు తాడేపల్లి లోని ముఖ్యమత్రి జగన్ క్యాంప్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. సమావేశం తరువాత జగన్ తన నివాసంలో చిరంజీవి దంపతులకు విందు ఇవ్వబోతున్నారు. జగన్ తో చిరంజీవి జరిపే భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే విషయం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. కాంగ్రెస్ కు దూరంగా జరిగి తమ్ముడు స్థాపించిన జనసేనకు దూరంగా ఉంటున్న చిరంజీవి కేవలం తాను ఇటీవల సైరా సినిమా గురించి మాట్లాడతారా లేక రాజకీయాలు కూడా చర్చిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది.  తెలుగు నాట తొలి స్వాతంత్య్ర సమరయోధుడు రేనాటి ప్రాంత వీరుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు అదనపు షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతించింది. అడగ్గానే అదనపు షోలు వేసుకోవడానికి అనుమతించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పడానికే చిరంజీవి దంపతులు తాడేపల్లి వెళ్లారని సమాచారం. ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ కోరగా సోమవారం రావాల్సిందిగా సీఎం కార్యాలయం ఆహ్వానించింది. జగన్ కు కృతజ్ఞతలు చెప్పి సైరా నరసింహా రెడ్డి సినిమా చూడాలని ఆహ్వానించనున్నట్లు సమాచారం. విజయవాడలో సినిమా చూడటానికి జగన్ అంగీకరించినట్లు కూడా సమాచారం. తమ్ముడు పవన్ కల్యాణ్ కు రాజకీయంగా ఇబ్బంది కలుగుతోందని ఆలోచనతో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆహ్వానం అందినప్పటికీ చిరంజీవి హాజరు కాలేదు. వైసిపి అధినేత జగన్ కు చిరంజీవి సోదరుడు పవన్ రాజకీయంగా బద్ధ వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. ఇప్పుడు విజయవంతం గా ఆడుతున్న సైరా నరసింహా రెడ్డి సినిమాను నిర్మించింది చిరు తనయుడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమా ప్రదర్శన విషయంలో జగన్ సహకారానికి కుమారుడు తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ ను ఏపీకి ముఖ్యంగా విశాఖకు తరలి రావటానికి గల అవకాశాలపై ఇటు జగన్, చిరంజీవి చర్చిస్తారని తెలుస్తోంది. విశాఖలో స్టూడియో నిర్మించాలనే ఆలోచనలో చిరంజీవి ఉన్నట్టు సమాచారం. ఇందుకు స్థలం కేటాయించడంతో పాటు సహకారం అందించాలని చిరంజీవి కోరే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సమాచారం.
  చైనా భారత్ ద్వైపాక్షిక చర్చలకు మహాబలిపురం వేదికగా మారడంతో ఈ పేరు బాగా ప్రముఖంగా మారింది. మోదీ, జిన్ పింగ్ ల భేటీకి మహాబలిపురాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు, ఈ ప్రాంత ప్రత్యేకత ఏంటి అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. 2014 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల్లో దిగారు మోదీ. ప్రచారం ఆద్యంతం సహజత్వానికి భిన్నంగా సాగింది. ఈ క్రమం లోనే మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేశారు. తాను ప్రధానిగా ఎన్నికైతే విదేశాలతో సంబంధాల బలోపేతానికి కృషి చేస్తానని ఇందు కోసం దేశీయంగా పర్యాటక ప్రదేశాలను వినియోగిస్తానని చెప్పారు మోదీ. సమావేశాలు, కీలక భేటీల నిర్వహణకు ప్రాముఖ్యత పర్యాటక ప్రదేశాలను ఉపయోగించుకుంటామని, తద్వారా ఆ ప్రాంతాలకు మరింత వన్నె తీసుకొస్తామని ప్రకటించారు. మోదీ ప్రధాని అయిన తరువాత చెప్పిన మాట ప్రకారం విదేశీ సంబంధాల పునరుద్ధరణకు ఆయన దేశంలోని పర్యాటక ప్రదేశాలను ఎంచుకుంటున్నారు. 2017లో కోల్ కతా వేదికగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పశ్చిమబెంగాల్ తో బంగ్లాదేశ్ సంబంధం విడదీయరానిది. చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ భేటీకి మోదీ కోల్ కతాను ఎంచుకున్నారు. 2017 లో సబర్మతీ నదీ తీరం వేదికగా ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశం జరిగింది. సబర్మతీ విశిష్టతా, మహాత్మా గాంధీ ఆశ్రమం ప్రత్యేకతలు ప్రపంచానికి తెలిపేందుకే ఈ భేటీ ఉపయోగపడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు మహాబలిపురం వేదికగా మరోసారి భారత్, చైనా చర్చలు జరపబోతున్నాయి. ఉప్పు, నిప్పులా ఉండే భారత్, చైనా సంబంధాల బలోపేతానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ వేదికలపై ఎప్పుడూ పాక్ కు వంతపాడే చైనాతో చర్చలంటే సహజంగానే ప్రతి ఒక్కరికీ ఆసక్తి. ఈ నేపధ్యంలో భారత ప్రధాని మోదీ జిన్ పింగ్ భేటీకి మహాబలిపురం వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మహాబలిపురం విశిష్టతపై చర్చసాగుతోంది. మహాబలిపురంలో ఆకట్టుకునే శిల్పాలూ, ప్రసిద్ధ శిల్పులకు పెట్టింది పేరు, ఇక్కడ అడుగడుగునా శిల్పకళ ఉట్టిపడుతుంది. మహాబలిపురాన్ని ఏడవ శతాబ్దంలో పల్లవ రాజు నరసింహవర్మ నిర్మించాడు, ఇది చెన్నై మహానగరానికి సరిగ్గా యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పల్లవ రాజు నరసింహ వర్మన్ ఇక్కడ ఓడరేవును సైతం నిర్మించాడు. తద్వారా విదేశాలతో వ్యాపారానికి మార్గం సులభతరమైంది. యుద్ధ విద్యలో ఆరితేరిన నరసింహవర్మన్ ను మమల్లన్ గా పిలిచేవారు, అతడి పేరుపైనే ఇక్కడ ఓడరేవుకు మమల్లపురంగా పేరు పెట్టారు. పల్లవరాజులు చైనాతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. తమ రాయబారులను వారు చైనాకు పంపేవారు, రెండో నరసింహవర్మన్ అరబ్స్, టిబెటియన్ల విషయంలో చైనాకు సాయమందించారు. ముఖ్యంగా చైనా, తమిళనాడు మధ్య సిల్క్ వ్యాపారానికీ మహాబలిపురం ఓడరేవు బాగా ఉపయోగపడింది. ఒకటో నరసింహవర్మన్ పాలనను ప్రత్యక్షంగా చూసిన చైనా పర్యాటకుడు హ్యున్ సంగ్ ఇక్కడి అభివృద్ధిని కొనియాడారు. ప్రజలు సుఖ సంతోషాలతో పాటు జీవిస్తున్నారనీ విద్యారంగం బాగుంటుందంటూ కితాబు ఇచ్చారు. ఇలా మహాబలిపురం, చైనా మధ్య చారిత్రక సంబంధాలున్నాయి.
కర్నూ లు జిల్లా రైతుల కన్నుగప్పి పచ్చని పొలాలపై కాలకూటం విరజిమ్మే కుట్ర  జరుగుతోంది. గత నెలలో ఓ కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు బోర్ల పేరుతో గుట్టుగా తవ్వకాలు జరిపారు. యురేనియం కోసమేనని రైతు లు పసిగట్టి వ్యతిరేకించే వారికి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అండగా నిలిచింది. దీంతో యురేనియం డ్రిల్లింగ్ పనులు నిలిచిపోయాయి.' సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపైన్ తో అఖిలప్రియ ప్రభుత్వం పై మరింత ఒత్తి డి తెచ్చారు. కడపులో మాదిరిగా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరపనున్నామని అఖిల పక్షం నేతలు తేల్చి చెప్పారు.నల్లమల్ల ప్రకృతి అందాలు పచ్చని పైర్లు అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు శిల్ప సంపదకు ఆళ్లగడ్డ నిలయం. అలాంటి ఆళ్లగడ్డ ను సర్వనాశనం చేసేందుకు కుట్ర జరుగుతోంది. ఆళ్లగడ్డ మండలం యాదవాడ గ్రామ పొలిమేరల్లో ఓ కాంట్రాక్టు సంస్థ అడుగుపెట్టింది. గలగల పారే వాగుల పచ్చని పొలాల మధ్య యంత్రాలనూ దింపింది. సంస్థ ప్రతి నిధులు యంత్రా లతో బోర్లు వేస్తునట్టు నటించి యురేనియం తవ్వకాల సర్వే పనులు మొదలు పెట్టారు. ఆరు వందల అడుగుల లోతు వరకు యురేనియం కోసం అన్వేషణ సాగించారు. బోర్లు వేస్తున్నామంటూ చుట్టు పక్కల రైతు లకు సంస్థ ప్రతి నిధులు చెప్పి బోల్తా కొట్టించారు. భూగర్భం లోంచి తీసి ల్యాబ్ కు పంపిన రాళ్ల ను చూసి రైతు లకు అనుమానం వచ్చింది.ఇప్పటికే కడప జిల్లా ప్రజల బతుకుల్లో యురేనియం విషం చిమ్ముతోంది. ఇంతలోనే మరో రాయలసీమ జిల్లా ను కూడా ఈ ముప్పు తాకనుందని రైతులు ఆందోళన చెందారు. సర్వే తవ్వకాల కు వ్యతిరేకంగా రైతు లు రోడ్డెక్కారు.మాజీ మంత్రి భూమా అఖిలప్రియ యురేనియం సర్వే తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి వచ్చి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులను వివరా లు అడిగి తెలుసుకున్నారు. యురేనియం సర్వే తవ్వకాల అనుమతులపై సంస్థ ప్రతి నిధులు రెవెన్యూ అధికారుల పొంతన లేని సమాధానమిచ్చారు. రైతుల పర్మిషన్ లేకుండా సర్వే తవ్వకాలు ఎలా జరుపుతారని భూమా అఖిలప్రియ సంస్థ ప్రతి నిధులను నిలదీశారు. దీంతో కాంట్రాక్టు సంస్థ ప్రతి నిధులు యురేనియం సర్వే తవ్వకాల పనులు తాత్కాలికం గా నిలిపివేశారు. సర్వే పనులకు అనుమతి ఇవ్వా లని ఆళ్లగడ్డ తహసీల్దార్ కు లేఖ పంపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం లో దాదాపు ఇరవై గ్రామాల్లో పదిహే ను చోట్ల మళ్లీ యురేనియం సర్వే పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం యురేనియం సర్వే పనులు ఆపెయ్యాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ ను కాపాడేందుకు 'సేవ్ నల్లమల సేవ్ ఆళ్లగడ్డ' క్యాంపెయిన్ ను ఉధృతం చేశారు.సంస్థ ప్రతి నిధులు డ్రిల్లింగ్ పనులు చేసే యంత్రాలను అక్కడి నుంచి తీసుకెళ్లారు .ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి యురేనియం తవ్వకాల సర్వేపై స్పందించారు. యురేనియం తవ్వకాలకు తాము వ్యతిరేకమన్నారు. రెండు వేల పధ్ధెనిమిది లో చంద్రబాబు యురేనియం తవ్వకాల కు అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణల యురేనియం తవ్వకాల ను సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఏపీ ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదని విపక్షా లు ప్రయత్నిస్తున్నాయి. యురేనియం తవ్వకాల కు వ్యతిరేకం గా అఖిల పక్ష బృందం కడప జిల్లాలో యురేనియం తవ్వకాల ప్రాంతాల్లో పర్యటించింది.ఆళ్లగడ్డ లో అఖిల పక్ష సమావేశం లో పాల్గొన్నారు. రాయలసీమ లో యురేనియం తవ్వకాల పై అఖిల పక్ష నేతలు ముక్త కంఠంతో వ్యతిరే కించారు. పులివెందుల ప్రజలు నరకం చూస్తున్న పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. కడప జిల్లా మాదిరి గా ఆళ్లగడ్డ లో యురేనియం తవ్వకాలు జరగనివ్వమని హెచ్చరించారు. యురేనియం తవ్వకాల పై సీపీఐ రాష్ట్ర కార్య దర్శి రామకృష్ణ సీరియస్ అయ్యారు. సీఎం జగన్ కడప జిల్లా లో యురేనియం బాధిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. యురేనియం తవ్వకాలు జరపకముందే మేల్కొన్న ఆళ్లగడ్డ ప్రజల ను రామకృష్ణ అభినందించారు. యురేనియం సర్వే తవ్వకాల వల్ల తమ భూముల రేట్లు పడిపోతున్నాయి అని ఆళ్లగడ్డ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని కుట్ర లు చేసినా సర్వే పనులను అడ్డు కుంటామన్నారు. రైతు లు ప్రజా సంఘాలు అన్ని విపక్ష పార్టీ లు ఏకం కావడం తో జగన్ సర్కార్ కు యురేనియం సెగ తగిలింది ఇక జగన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
  తెలంగాణ ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డెడ్ లైన్ విధించి ఉద్యోగాలు పోతాయని హెచ్చరించి. అయినా ఆర్టీసీ ఉద్యోగులు వెనకడుగు వేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆరే రంగంలోకి దిగారు. ఆర్టీసీలో ఇక మిగిలింది 12 వందల మంది ఉద్యోగులే అని చెప్పిన కేసీఆర్‌.. సమ్మెలో ఉన్న సుమారు 48 వేల మందిని తొలగిస్తున్నామని పరోక్షంగా హెచ్చరించారు. దీంతో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను మూకుమ్మడిగా తొలగించవచ్చా? అన్ని వేల మందిని ఒకేసారి డిస్మిస్‌ చేయడాన్ని చట్టాలు సమర్థిస్థాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అధికారంలో ఉన్న సమయంలో మూకుమ్మడిగా దాదాపు 2 లక్షల మందిని తొలగించారు. 2003 లో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు దిగగా.. మొత్తం 1.70 లక్షల మందిని తొలిగిస్తూ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే, సమ్మె చేస్తున్న 1.70 లక్షల మంది ఉద్యోగులను జయలలిత తొలగిస్తే సుప్రీంకోర్టు మాత్రం ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది. వాళ్లను తిరిగి తీసుకోవాలని చెబుతూనే, బేషరతుగా క్షమాపణ చెబుతూ.. భవిష్యత్‌లో సమ్మెలు చేయబోమంటూ ప్రమాణపత్రం ఇవ్వాలని ఉద్యోగులకు సుప్రీం నిర్దేశించింది.  ఆర్టీసీ కార్మికుల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన కూడా న్యాయసమీక్షకు నిలబడదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం తొలగిస్తే.. వారు కోర్టుకి వెళ్లే అవకాశముంది. అప్పుడు తమిళనాడు ఉద్యోగుల అంశంలో వెలువడిన తీర్పే మళ్లీ వెలువడే అవకాశముందని అంటున్నారు. మరోవైపు ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి ఉద్యోగులను తొలగించే అధికారం లేవంటున్నాయి. ‘‘మేము చట్టబద్ధంగా సమ్మె నోటీసులిచ్చాం. మంత్రి ఉన్నా.. చర్చల్లో పాల్గొనలేదు. మాకు న్యాయం చేయడానికి కోర్టులున్నాయి. చట్టాలు మూకుమ్మడి తొలగింపులను అనుమతించవు.’’ అని అంటున్నారు.
  హామీలు ఎన్నోఇస్తుంటారు కానీ రాను రాను వాటి బకాయిలు చెల్లించడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్షం వహిస్తోంది. ఉపాధి హామీ పథకం బకాయిల క్రింద కేంద్ర ప్రభుత్వ నిధులు ఇచ్చినా వాటిని కూలీలకు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెడుతోందని టిడిపి అధ్యక్షుడు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు గురువారం ఆయన లేఖ రాశారు.  కేంద్రం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు మూడు విడతలుగా పధ్ధెనిమిది వందల నలభై ఐదు కోట్లు రాష్ట్రానికి పంపింది. ఈ డబ్బులకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు కలిపి మూడు రోజుల్లోగా రాష్ట్ర ఉపాధి హామీ నిధుల బదిలీ చేయాలి. ఇలా చేయకపోతే తదుపరి నిధులు విడుదల నిలిపివేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. అలాగే జాప్యం చేసిన కాలానికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు శాతం వడ్డీ కూడా చెల్లించాలి. పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ఈ నిధులు వినియోగించాలని పాత పెండింగ్ బిల్లులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కూడా కేంద్రం తన ఆదేశాల్లో సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చెల్లించాల్సిన బిల్లులను చెల్లించలేదు. ఈ నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించిందనే ఆరోపణలు వస్తున్నాయని అందులో పేర్కొన్నారు. నెలల తరబడి బిల్లులూ పేరుకుపోవడంతో అవి రావలసిన వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని కొన్ని చోట్ల ఈ పరిణామం ఆత్మహత్యలకు కూడా దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఉపాధి హామీ పథకానికి చెడ్డ పేరు తెస్తుందని బిల్లులు పేరుకుపోవడంతో ఈ పథకంతో జత కలిపి పనులు చేయటానికి ప్రభుత్వ విభాగాలు వెనుకంజ వేస్తున్నాయని తెలిపారు.  ఉపాధి హామీ పథకం గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు ఈ పరిస్థితి పై పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలిచ్చారని గవర్నర్ ను కూడా కలిసి వివరించారని తెలిపారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలో కొనుసాగితే అతి త్వరలోనే ప్రజలు ఈ పథకం పై విశ్వాసం కోల్పోతారని ఫలితంగా గ్రామీణాభివృద్ధి తీవ్రంగా కుంటుపడుతోందని, దీనివల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠ కూడా దెబ్బతింటుందంటున్నారు. ఉపాధి హామీ పథకం అమలులో ఏపీ గత ఐదేళ్లలో దేశంలో ప్రథమ స్థానంలో నిలిచిందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ఈ పథకం నిధులతో రాష్ట్రంలో ఇరవై ఆరు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, ఆరు వేల అంగన వాడీ భవనాలు, రెండు వేల రెండు వందల గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాలు, పదివేల సాలిడ్ వేస్ట్ కేంద్రాలూ, ఏడు లక్షల పంటకుంటలు నిర్మించామని చంద్రబాబు పేర్కొన్నారు. పన్నెండు వేల కిలోమీటర్ల మేర గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పాటైంది. దేశవ్యాప్తంగా ఎనభై మూడు ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేస్తే అందులో ముప్పై మూడు ఈ రాష్ట్రం నుంచే ఉన్నాయి. మొదటి పది లో ఏడు కూడా ఈ రాష్ట్రానికి చెందినవే అని తెలియజేశారు. దీనిని పరిశీలించి పెండింగ్ బిల్లుల చెల్లింపునకు కేంద్రం చొరవ తీసుకోవాలని కోరారు. ప్రస్తుత ఆర్థిక మాంద్యంలో ఉపాధి హామీ పథకం మాత్రమే ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని రాష్ట్రం నుంచి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ బకాయిలు చెల్లింపు పై చంద్రబాబు తన దృష్టని పెట్టారని స్పష్టంగా వెల్లడవుతోంది. 
  Pain is the most common health complaint we get to experience or listen from our family and friends. We generally attribute body pains to change in weather or physical strain or stress. Most of the times, popping some pain killers would do the trick for us. However, there are some pains that come up for no apparent reason and they persist for a longer period of time and no pain killer would really help us. How do we deal with this? Pain can be the foremost indicator for a bigger issue in your environment. Instead of ignoring the pain as a regular one, start listening to your body. Our body is telling us, 'Do not ignore, there is an issue you need to look into here'. The issue most probably is an emotional one. We tend to ignore those small little things in our life, those small differences of opinions or small fights or small hurts. However they go and pile up in our subconscious memory and start playing their part. They just need a trigger to show up and what else can be a better way, change of season or weather or physical strain. Trigger can be anything from weather to workplace stress. We cannot ignore physical pain, though we ignore emotional pain. As discussed in our last article, when you stop the energy from its natural flow, it starts stinking. When we experience a thought or feeling or emotion, if we don’t allow it to flow through us but hold on to it, the stagnant energy starts showing up in our body as pain or illness. Does it mean when we stop energy from its flow, would the energy become negative or bad? Never. Energy is energy and there is nothing like bad energy or good energy. Don’t get into any belief system that there is something called bad energy or good energy. It’s just energy. If we start looking at our lives and try to understand the most common emotional reason, we experience pains whenever we do not allow ourselves to feel our anger or when suppressing anger. Remember, anger has a wide range of feelings from mild irritation to helpless rage. Each emotional cause leads to a different body pain because each part of the body is connected to a different emotion and reflects different parts of life. You can understand what your body wants to indicate by noticing your pain closely. Do you feel constrained, controlled, suppressed or pushed around? Usually the language our body speaks to us is easy to understand. Let us look at some of the most common and chronic pains, body pains, back pain and joint pain. We listen to body pain complaints mostly from our mother or grand mothers. They  never opened up and expressed their unhappiness about a situation or felt suppressed or they felt they were not living the life they wanted to live. All the resentment or frustration is not allowed to be felt, so it settles in various parts of body and manifests as body pains. If they go to a doctor, a pain medication may help. But the pain comes back, because they haven't addressed the emotional issues or feelings. You must have observed people who control others around them. Whenever we allow someone to enter into our boundaries and allow them to manipulate us, they tend to control us. Without our conscious knowledge, we follow them without questioning them or just believing them. Suddenly we feel powerless and realise what happened.  We get annoyed with ourselves, how we allowed someone to control us and our lives. Imagine yourself in the situation, don't you feel constrained, so helpless, so very powerless. How does the body express these anger based feelings? Through joint pains. Our body literally shows us I feel I am controlled so much I cannot move a step because that's how we feel emotionally, controlled in our movements. It starts with knee pain or stiff knees, loss of cartilage and finally ends up with a knee replacement surgery. It goes well for next couple of years after the operation, however in few cases it may return again because the helpless anger is still unaddressed. But you don't have to beat yourself up, even if you are the controller or you are the one being controlled, any form of control is insecurity about life. If I am not in control, life may go out of my hands! So be compassionate with yourself and address the associated feelings. I had a client suffering from severe back pain for over 5 years. He works abroad and his family is back in India. When we looked into his history, he said 5 years ago, he experienced extreme financial difficulty and took a lot of burden and stress to get over the challenge. While he was going through those difficult times of his life, he started experiencing lower back pain. He took all possible medical help which helped him to manage pain to some extent. But the pain didn't go away fully, it was in the background as nagging pain. If we look into it closely, back bone is a symbol of support system and financial security is the biggest support factor in our lives. Whenever someone experiences back pain, there is an issue with support system, either emotional support or financial support. But usually lower back pain is related to financial security. When someone experiences lack of support in financial system, they experience lower back pain. Once we know there is a cause for any pain, it's easier to heal it, while using our regular medical help, we can also look into emotional issues. Be gentle, compassionate with your body, extend all your love to the body and it will start working with you in sync. There are some who find it difficult to get their pain healed. Why would anyone want to hold on to pain? At conscious level, no one would like to have pain in their life. But once we start looking deeply, at subconscious level, it is we who hold on to pain not that pain is holding on to us. Because pain has become our identity, we don’t want to let go of the pain. I had a client who had experienced traumatic childhood. All her life is built around the trauma. She invited all experiences around the same. When we started working on her issues, she wasn't ready to let go of her childhood issues. Her question was, what will I hold on to if I let go of my pain and my past? Let's understand that we are here to experience life and we don't need to have pain as an experiencing process. We have a choice here, either experience life with pain or with happiness and peace. Body is a wonderful indicator for us. Anything you miss at emotional level even by mistake, it actually shows up glaringly into our face, as pain. Stop disconnecting with your body and start building relationship with it. "As eyes are reflection of our soul, body is reflection of our subconscious mind." Your body speaks just the truth. Even our prospective HR Managers depend on your body language, during interviews they listen to your answers but take confirmations from your body language. How cool it is?! If others are listening to our body language why don't we want to listen to it. Let's listen to our body, our own sweet selfless buddy! -Ramakrishna Maguluri  
  ఆమధ్యన ఒక శాస్త్రవేత్త చిన్నపాటి ప్రయోగం ఒకటి చేశాడట. కొన్ని పురుగులని పట్టి ఒక గాజు సీసాలో ఉంచాడు. సీసాలో వేయగానే ఒక్కసారిగా ఆ పురుగులన్నీ బయటకి ఎగిరేందుకు ప్రయత్నించాయి. అవి అలా పైకి ఎగురుతుండగానే.... సీసాకి ఓ మూతని బిగించేశారు. అంతే! ఆ పురుగులన్నీ శక్తి కొద్దీ వెళ్లి ఆ మూతకి తగులుతూ కిందకి పడిపోవడం మొదలుపెట్టాయి. అలా కాసేపు జరిగిన తర్వాత ఇక ఆ సీసాను దాటుకుని వెళ్లడం అసాధ్యమన్న విషయానికి అవి అలవాటుపడిపోయాయి. దాంతో ఇక మూతని తాకకుండా అక్కడక్కడే ఎగరడం మొదలుపెట్టాయి. కొంతసేపటి తర్వాత సీసా మూతని తీసేసినా కూడా పురుగులు అందులోంచి బయటపడేందుకు ప్రయత్నించలేదు. అడ్డుగా ఉన్న మూతని దాటుకుని వెళ్లడం అసాధన్యమన్న భ్రమలోనే అవి ఉండిపోయాయి.   ఇంటర్నెట్‌లో ‘flear in a jar’ అని టైప్ చేస్తే ఈ వీడియో కనిపిస్తుంది. ఈ వీడియోలో కనిపించేదంతా నిజమో కాదా అన్నదాని మీద పెద్ద వివాదమే ఉంది. కానీ చాలా సందర్భాలలో జీవుల ప్రవర్తనను ఇలా ప్రభావితం చేసేయవచ్చని శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. జంతువులలో కనిపించే ఇలాంటి ప్రవర్తనని conditioning అంటారు. ఈ conditioning ద్వారానే వాటిని ఒకోసారి మనకి అనుకూలంగా మలుచుకుంటూ ఉంటాము కూడా!   వీడియోలో కనిపించేంది నిజమా కాదా అన్నది పక్కన పెడితే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుందన్నది సైకాలజిస్టుల మాట. మనుషులు కూడా తమ చుట్టూ ఉండే పరిస్థితులకి ఇలాగే లోబడిపోతుంటారని తెలిసిందే! ‘నేను ఎందుకూ పనికిరానివాడిని,’ ‘నా లోపాలను మించి నేను ఎదగలేను’, ‘ఈ సమస్యలను దాటడం నా వల్ల కాదు’... లాంటి సవాలక్ష నమ్మకాలతో మనల్ని మనమే conditioning చేసుకుంటూ ఉంటాము.   ఎప్పుడో ఒకసారి మనకి ఎదురుపడిన పరాజయం మన అనుమానాలు నిజమేనన్న బలాన్ని కలిగిస్తాయి. పైకి ఎదిగేందుకు అడ్డుగా నిలుస్తాయి. మన నమ్మకాలు నిజమో కాదో మరోసారి పరీక్షించకుండానే, వాటని మన లోపాలుగా మార్చేసుకుంటూ ఉంటాము. అందుకే! పరాజయపు మాట పక్కన పెట్టి మరోసారి ప్రయత్నించి చూడమని ఈ పరిశోధన చెబుతోంది. ఎగిరేందుకు ప్రయత్నిస్తేనే కదా.... మనకి హద్దు, అదుపు ఉన్నాయో లేదో తెలిసేది! - నిర్జర.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.