LATEST NEWS
ఎన్‌టిఆర్‌ భవన్‌లో సీబీఎన్‌ వారియర్స్‌,  గుమ్మడి గోపాలకృష్ణ ప్రొడ్యూస్‌ చేసిన వీడియో పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం  (ఏప్రిల్ 19) జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నాలుగు వీడియో పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాజకీయ కార్యదర్శి  టి.డి. జనార్థన్‌, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధులు నన్నూరి నర్సిరెడ్డి, తిరునగరి జ్యోత్స్న, నిర్మాతలు కె.ఎస్‌. రామారావు, గుమ్మడి గోపాలకృష్ణ, కొడాలి వెంకటేశ్వర్‌ రావులు అతిథులుగా పాల్గొని పాటల వీడియోను విడుదల చేశారు.  ఈ సందర్భంగా  పొలిట్‌బ్యూరో సభ్యుడు టి.డి. జనార్థన్‌ మాట్లాడుతూ...  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఎన్నికల దృష్ణా ఏపీలోని జగన్  ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో చేసిన అరాచకం,  ప్రజలను వేధించిన విధానాలతో , భావితరాలకు ధన, మాన రక్షణ కరవైంది. కనుక ఏపీ లోని ఈ పరిస్థితులకు చలించిన కొంత మంది సినీ ప్రముఖులు కొన్ని పాటలను రూపొందించారు. కె.ఎస్‌. రామారావు, కొడాలి వేంకటేశ్వర్‌ రావులు కలిసి రెండు పాటలను రూపొందించారు. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఇంతకుముందే 12 పాటలను రూపొందించి ఉన్నారు. ఇప్పుడు 13వ పాటను రూపొందించి ఆ పాటను పాడటం కూడా జరిగింది. ఈ పాటలను రూపొందించడంలో  ముఖ్యపాత్ర వహించిన ప్రతి ఒక్కరికీ అభినందనలను తెలియజేస్తున్నాన్నారు.  పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ...  ఇటువంటి అద్భుతమైన పాటలను వినే అదృష్టం తనకు కలిగిందని అన్నారు. వినడం, చూడటం ద్వారా సమాజం ప్రభావం ఉంటుందనీ,  జనం పడుతున్న అనేక రకాల ఇబ్బందులను  స్పష్టంగా మన కళ్లకు కనిపించే విధంగా, చెవులలో మారుమ్రోగే విధంగా పాటలు రాసి పాడిన వారికి, నటించిన వారికి ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.  కొన్ని పాటలు ప్రభుత్వాన్నే మార్చిన పరిస్థితులను చూశాం. జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  నారా చంద్రబాబు నాయుడు  నాయకత్వాన్ని బలపర్చడం కోసం తనకు తోచిన విధంగా సహకరిస్తున్న ప్రతివ్యక్తికి, పెద్దలందరికీ పేరుపేరున ధన్యవాదాలను తెలియజేస్తున్నానన్నారు.   అనంతరం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి  తిరునగరి జ్యోత్స్న మాట్లాడుతూ జగన్ పాలనలో ఏపీ ఎదుర్కొంటున్న పరిస్థితులను చూపించి ఏపీలో ప్రజా పరిపాలన రావాలనే ఉద్దేశంతో ప్రతి వర్గం కృషి చేస్తున్నదన్నారు.  రాష్ట్రం బాగు కోసం చలన చిత్ర రంగం తన  వంతు బాధ్యతగా  కంకణబద్దులై పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాటలలో ప్రతి వర్గం పడుతున్న బాధలను కళ్లకు కట్టడమే కాకుండా, ఆ బాధలను తీర్చగలిగే నాయకుడు ఎవరన్నది కూడా   మనసుకు హత్తుకునే లా తెలియజేశాయని ప్రశంసించారు.  పాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. జగన్ ఐదేళ్ల  అరాచక పాలనకు చరమగీతం పాడాలనీ,  అటువంటి ప్రభుత్వం గద్దె దిగాలని, ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావాలన్న సత్సంకల్పంతో  ఈ బృహత్తర ఆలోచన చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం మాట్లాడిన ప్రముఖ నిర్మాత, కె.ఎస్‌. రామారావు  ఇంత మంది, ఇంత ఇన్సిపిరేషన్‌తో పాటలను రాసి, తీయడానికి ప్రధాన కారణం 45 డిగ్రీల ఎండలలోనూ చంద్రబాబు  ఏపీ ప్రజల కోసం కష్టపడుతుండటమేనన్నారు. చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్‌, నందమూరి బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్‌ గారు మండుటెండల్లో ఏపీ బాగుండాలని కష్టపడి పని చేస్తున్నారు. ఆ ఎండల ప్రభావం ఇక్కడ ఉండే మనకు తెలియదు. ఆ మండుటెండలు ఎలా ఉంటాయో ఏపీలోకి వెళ్లి చూస్తే   తెలుస్తుంది అన్నారు. ఏడు పదుల వయస్సులో  మండుటెండలో చంద్రబాబు  తిరుగుతుండటం చూసి స్ఫూర్తిని పొంది కొడాలి వేంకటేశ్వర్‌ రావు, గుమ్మడి గోపాలకృష్ణ గారు ముందుకు వచ్చి చేశారు. దేశానికి నాయకుడు కావాల్సిన చంద్రబాబు  తనను తాను తగ్గించుకుని  రాష్ట్రం కోసం పని చేస్తున్నారు, అటువంటి మనిషి ఏపీని అభివృద్ధి చేసుకుందామని ప్రజలను రిక్వెస్ట్‌ చేసుకుంటుంటే బాధ కలుగుతోందంటూ కేఎస్ రామారావు భావోద్వేగానికి గురయ్యారు.   ఏపీలో ఇంత దరిద్రపు పాలనను ఎవరూ ఊహించలేరు. చంద్రబాబు స్ఫూర్తితో ఉడతా భక్తిగా సహాయం చేయాలనే   ద్దేశంతో, టి.డి. జనార్థన్‌ గారి ప్రోత్సాహంతో ఈ పాటలను మీ ముందుకు తీసుకొస్తు న్నామన్నారు.  వీటిని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం తీసుకురావాలి. ఏపీని బాగు చేసుకోవడానికి చంద్రబాబుకి మీ అందరి సహకారం కావాలి, ఆయనను గెలిపించుకోవడం మన అందరి బాధ్యత అని కేఎస్ రామారావు అన్నారు.  ఈ కార్యక్రమంలో మాట్లాడిన నిర్మాత నిర్మాత, కొడాలి వేంకటేశ్వర్‌ రావు ఈ పాటలను   టి.వి. పరిశ్రమ వారు, వర్కర్సు చేసినవి. ఈ కార్యక్రమాన్ని మొదట హేమంత్‌ అనే వ్యక్తి ప్రారంభించారు. నేను, కె.ఎస్‌. రామారావు   చేసింది తక్కువ. నాని, చక్రి, అశోక్‌, శ్రీనివాస్‌ వంటి వారు వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని షూట్‌ చేశారు. దీనిని డైరెక్టుగా షూట్‌ చేసి సాంగ్స్‌ ను చేశాం. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా పాటలను చేయడం జరిగింది. 175 నియోజకవర్గాలకు వీటిని రీఎడిట్‌ చేసి ప్రతి నియోజకవర్గానికి పనికివచ్చే విధంగా చేయబోతున్నాం. ఈ కార్యక్రమంలో గుమ్మడి గోపాలకృష్ణ, తెలుగుదేశం పార్టీ మీడియా కమిటీ ఛైర్మన్‌  ప్రకాష్‌ రెడ్డి, శిరీషా, సీబీఎన్‌ వారియర్స్‌ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణకు సొంత నియోజకవర్గంలో ఎదురుగాలి వీస్తున్నది. వైసీపీ సీనియర్ నాయకుడైన బొత్స ఇదే చీపురుపల్లి నియోజకవర్గం  నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు విజయం సాధించారు. 2004లో ఒకసారి, 2009 ఒకసారి ఆయన చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీలో చేరిన బొత్స 2019 ఎన్నికలలో విజయం సాధించి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు మళ్లీ అదే నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. చీపురుపల్లిలో బొత్స పరాజయం లక్ష్యంగా తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఆలోచించింది. బొత్సకు దీటైన ప్రత్యర్థి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అని భావించి ఆయనను అక్కడ నుంచి పోటీలోకి దింపాలని భావించింది.  గంటా ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఏ నియోజకవర్గం నుంచైనా విజయం సాధిస్తారని ప్రతీతి. అయితే చీపురుపల్లి నుంచి బరిలోకి దిగడానికి విముఖత చూపిన గంటా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నుంచే పోటీ చేయడానికి ఇష్టపడ్డారు. బొత్సాపై పోటీకి గంటా నిరాకరించ డం తెలుగుదేశం పార్టీకి ప్రతికూల సంకేతాలు పంపిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. అయితే చీపురుపల్లిలో తెలుగుదేశం కష్టాలు అక్కడితో తీరిపోలేదు. గంటా పోటీకి నిరాకరించడంతో తెలుగుదేశం అధినేత చివరి నిముషంలో చీపురుపల్లి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కళా వెంకటరావును నిలిపారు. అయితే ఆ ఎంపిక పార్టీలో సీనియర్ నాయకుడికి టికెట్ నిరాకరించకుండా అకామిడేట్ చేసినట్లుగానే కనిపించింది.  దీంతో చీపురుపల్లిలో తెలుగుదేశం క్యాడర్ కూడా నిరుత్సాహపడింది. అక్కడ నాగార్జున గత కొంత కాలంగా పని చేసుకుంటూ క్షేత్ర స్థాయిలో మంచి పట్టు సాధించారు. అయితే చంద్రబాబు రాజాం నుంచి తీసుకువచ్చి కళా వెంటకరావుకు పార్టీ టికెట్ ఇవ్వడంతో ఆయన ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులన్నీ చీపురుపల్లిలో గంటా గెలుపు నల్లేరు మీద బండికగా మార్చేశాయని అప్పట్లో పరిశీలకులు సైతం విశ్లేషించారు. అయితే అనూహ్యంగా చీపురుపల్లిలో పరిస్థితి రోజురోజుకూ మారిపోతోంది. తీవ్ర మైన ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా నియోజకవర్గంలో బొత్సకు ఎదురు గాలి వీస్తున్నది.  నియోజకవర్గంలో అత్యంత కీలకమైన మెరకమూడిదాం మండలంలో  తెలుగుదేశం పార్టీకి గట్టి మద్దతు లభించింది. అక్కడ కళా వెంకట్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగాయి. అలాగే నియోజకవర్గంలోని పలు ఇతర మండలాల్లో కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు పెరిగాయి. ఈ పరిస్థితులను చూస్తుంటే బొత్సకు చీపురుపల్లిలో విజయం అంత వీజీ కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
అధికారం కోల్పోయినా కేసీఆర్ ఇంకా తానే ముఖ్యమంత్రినన్న భ్రమల్లో ఊరేగుతున్నట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో ప్రతి ఎన్నికల సందర్భంగానూ అంతర్గత సర్వేలు తమ పార్టీ ఘన విజయాన్నే సూచిస్తున్నాయని చెబుతూ పార్టీ నేతలూ, క్యాడర్ లో ఉత్సాహాన్నీ ఉత్తేజాన్నీ నింపేవారు. సరిగ్గా అదే విధంగా గత ఏడాది డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికలకు ముందు కూడా తాను అంతర్గతంగా నిర్వహించిన సర్వేలలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఢంకా బజాయించి మరీ చెప్పారు. అయితే వాస్తవ ఫలితం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఆయన దాదాపుగా అటువంటి సర్వేలపైనే ఆధారపడ్డారు. లోక్ సభ ఎన్నికల తరువాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల్లో పెనుమార్పులు అనివార్యమనీ, మళ్లీ బీఆర్ఎస్ హవా నడుస్తుందని పార్టీ నేతలను, శ్రేణులనూ నమ్మించే ప్రయత్నం చేశారు. లోక్ సభ ఎన్నికలలో పెటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫామ్ లు అందజేసిన కేసీఆర్ పాతిక మంది కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారనీ, లోక్ సభ ఎన్నికల తరువాత వారంతా బీఆర్ఎస్ గూటికి చేరుతారనీ చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ఓ 20 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి ఫిరాయించడానికి రెడీగా ఉన్నారని చెప్పారు. ఆయన మాటలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు రివర్స్ లో బీఆర్ఎస్ ను ఖాళీ చేస్తున్న విషయాన్ని ఆయన ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ దే పై చేయి అనీ రాష్ట్రంలో తన మాటే చెల్లుబాటు అవుతుందనీ భ్రమపడుతున్నారు.   లొక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ రాష్ట్రంలో కచ్చితంగా ఎనిమిది స్థానాలలో విజయం సాధిస్తుందనీ, మరో మూడు స్థానాల్లో కేడా గెలిచే అవకాశాలున్నాయనీ తన అంతర్గత సర్వేలో తేలిందని చెప్పుకొచ్చిన ఆయన ఆ సర్వే ఎప్పుడు ఎవరితో చేయించారో వెల్లడించలేదు. అధికారంలో ఉన్న సమయంలో అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు ద్వారా సర్వేలు చేయించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన ఇటువంటి అంతర్గత సర్వేలకు పార్టీపైనే ఆధారపడాలి. విపక్షంగా మారిన క్షణం నుంచీ బీఆర్ఎస్ స్థిమితంగా ఉన్న పరిస్థితి లేదు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఎన్నిక దగ్గర నుంచీ అంతటా కేసీఆర్ కు ఇబ్బందికరంగానే పార్టీ నేతలూ, కేడర్ వ్యవహరించారు.  ఇంతకీ ఆయన ధీమా ఏమిటంటే 104 సీట్లు వచ్చినప్పుడే  బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నించింది. 64 సీట్లతో కాంగ్రెస్‌నుఅధికారంలో ఎలా కొనసాగనిస్తుందన్నది ఆయన ధీమా. అదే జరిగితే  భవిష్యత్తు బీఆర్‌ఎస్‌దే  అని కేసీఆర్  ఊహలపల్లకిలో ఊరేగుతున్నారు.  అయితే ఆయన కాంగ్రెస్ నేతలు తనతో టచ్ లో ఉన్నారని చెప్పి 24 గంటలు గడవక ముందే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, అదీ గ్రేటర్ పరిధిలోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఒకటి రెండు రోజుల్లో ఆయన కాంగ్రస్ కండువా కప్పుకోనున్నారు. అలాగే ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఆయనా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇటీవల ఒక సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాతిక మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చారనీ, ఏ క్షణంలోనైనా వారు ‘చేయి’ అందుకుంటారనీ చెప్పారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు లోక్ సభ ఎన్నికల తరువాత నుంచీ బీఆర్ఎస్ నుంచి సిట్టింగుల వలసల వరద ప్రారంభ మౌతుందంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చెబుతున్న మాటలు, వ్యక్తం చేస్తున్న విశ్వాసంపై బీఆర్ఎస్ నేతలు భరోసా ఉంచగలరా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
నారా రోహిత్ ప్రధాన పాత్రలో మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా 'ప్రతినిధి 2'(Prathinidhi 2). వానర ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. 'ప్రతినిధి 2' ట్రైలర్ (Prathinidhi 2 Trailer) ఆకట్టుకుంటోంది. "మన స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీజీ చనిపోయినప్పుడు ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు? ఎంతమంది గుండెపోటుతో చచ్చారు?" అంటూ నారా రోహిత్ చెప్పే డైలాగ్ తో ఆలోచన రేకెత్తించేలా ట్రైలర్ ప్రారంభమైంది. ఎవరైనా రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు.. ఆ బాధ భరించలేక కొందరు సామాన్యులు సూసైడ్ చేసుకున్నారని, మరికొందరు గుండెపోటుతో మరణించారని వార్తలు చూస్తుంటాం. మహాత్ముడు చనిపోయినప్పుడే ప్రజల గుండెలు ఆగలేదు. అలాంటిది ఓ రాజకీయ నాయకుడి కోసం ఆగుతాయా? అనే ప్రశ్నను రేకెత్తిస్తూ ట్రైలర్ ను రూపొందించారు. "నిన్ను నమ్ముకున్న నీ భార్య పిల్లలు కంటే, నాలుగు పథకాలు ఇచ్చిన నాయకుడు ఎక్కువయ్యాడా?" అని నారా రోహిత్ ప్రశ్నించడం కళ్ళు తెరిపించేలా ఉంది. అవినీతి, అరాచకాలు చేసే రాజకీయ నాయకులకు వ్యతిరేకంగా ఓ జర్నలిస్ట్ చేసే పోరాటమే ఈ సినిమా కథ అని ట్రైలర్ బట్టి అర్థమవుతోంది. "ఒక్కసారి ఎక్కి కుర్చున్నాడంటే.. ఐదేళ్లు వాడు చెప్పింది చేయాల్సిందే. డిసైడ్ చేసుకో.. నిన్ను ఎవరు పరిపాలించాలో. డిసైడ్ చేసుకో.. నీకు ఎవరు కావాలో. వాడా? వీడా? ఇంకెవడైనానా?" అనే డైలాగ్ తో ట్రైలర్ ను ముగించిన తీరు బాగుంది.
'ఒకే ఒక జీవితం' వంటి విజవంతమైన చిత్రం తర్వాత ఏడాది విరామం తీసుకున్న టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand).. మరోసారి ఫీల్ గుడ్ మూవీతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అదే 'మనమే'(Manamey). శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి(Krithi Shetty) హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీజర్ విడుదలైంది. 'మనమే' టీజర్ (Manamey Teaser) కూల్ గా, బ్యూటిఫుల్ గా ఉంది. "మంచిగా కనపడే వాళ్ళందరూ మంచోళ్ళు కాదురా. ఫర్ ఎగ్జాంపుల్ నేను. చాలా మంచోడిలా కనిపిస్తా.. కానీ మంచోడిని కాదు" అంటూ శర్వానంద్ చెప్పే డైలాగ్ తో టీజర్ ప్రారంభమైంది. ఇక, మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండే యువతిగా కృతి శెట్టి పాత్ర పరిచయమైంది. శర్వానంద్, కృతి శెట్టి పాత్రలు ఒకరికొకరు పరిచయం కావడం, ఓ బాబు రాకతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయో అనే ఆసక్తిని రేకెత్తిస్తూ టీజర్ ను రూపొందించారు. బాబు ఏడుస్తున్నాడని కృతి ఎమోషనల్ అవుతూ అరుస్తుండగా.. "ఇద్దరిలో ఒక్కరే ఏడవండి" అంటూ శర్వా చెప్పిన డైలాగ్ తో టీజర్ ని ముగించిన తీరు బాగుంది. టీజర్ లో శర్వానంద్ సైలిష్ గా కనిపిస్తున్నాడు. కృతి శెట్టి కూడా ఎంతో అందంగా ఉంది. బ్యూటిఫుల్ విజువల్స్, మ్యూజిక్ తో టీజర్ కలర్ ఫుల్ గా ఉంది. ఈ సినిమా ఈ వేసవిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
The film Bhaje Vayu Vegam, starring hero Kartikeya Gummakonda, is presented by the prestigious production company UV Creations under the banner of UV Concepts.  Iswarya Menon is playing the female lead, while Rahul Tyson of Happy Days fame plays an important role. Directed by Prashanth Reddy, the movie also involves Ajay Kumar Raju.P. as the co-producer. Today, the makers announced that the teaser of "Bhaje Vayu Vegam" will be released tomorrow at 2:25 PM. The recently released first look poster and motion poster received positive responses, raising expectations for the teaser. "Bhaje Vayu Vegam" is gearing up for its release after completing all post production activities, with the theatrical release date to be announced soon.
గత సంవత్సరం అక్టోబర్ లో విడుదలైన యూత్ ఫుల్ మూవీ మ్యాడ్. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాన్ని నమోదు చేసింది. అగ్ర నిర్మాణ సంస్థ  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన తాజా న్యూస్ టాక్ అఫ్ ది డే గా నిలిచింది  మ్యాడ్ కి  సీక్వెల్ గా  మ్యాడ్ స్క్వేర్‌ రాబోతుంది. మ్యాడ్ ని పని చేసిన టీమే స్క్వేర్‌ కి కూడా పని చేస్తుంది.  ఈ మేరకు రీసెంట్ గా  మూవీ ప్రారంభోత్సవం జరిగింది. ప్రముఖ హీరో  సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అథితిగా హాజరయ్యి దర్శకుడు కళ్యాణ్ శంకర్ కి స్క్రిప్ట్ ని అందచేసాడు. జాతి రత్నాలు దర్శకుడు  అనుదీప్ కూడా హాజరయ్యి యూనిట్ కి శుభాకాంక్షలు చెప్పాడు. ఇప్పుడు ఈ ఆవార్త యూత్ లో జోష్ ని  తెస్తుంది. పార్ట్ 1 లో మెప్పించిన  యువ హీరోలు  నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ల త్రయం ఈ సీక్వెల్ కోసం మళ్ళీ రంగంలోకి దిగబోతుంది.మ్యాడ్ నెస్ ఇంకా  పూర్తి కాలేదని  ఈసారి మ్యాడ్ నెస్  రెట్టింపు ఉంటుందని మేకర్స్  పేర్కొన్నారు. దీన్ని  బట్టి చూస్తే ఈసారి కథానాయికల త్రయం చేసే అల్లరి  థియేటర్లలో నవ్వుల సునామీ సృష్టించనుందని అర్థమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.దాదాపుగా  మ్యాడ్  కోసం వర్క్ చేసిన   సాంకేతిక నిపుణులే  స్క్వేర్ కోసం పని చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా  షామ్‌దత్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నవీన్ నూలి ఎడిటర్.  
అగస్ట్ 15 న ఇండియా కి స్వాతంత్ర దినోత్సవం..ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.అలాగే అల్లు అర్జున్ వన్ మాన్ షో  పుష్ప 2  అగస్ట్ 15  రిలీజ్. ఈ విషయంలో కూడా ఎలాంటి మార్పు ఉండదు. ఇక  రిలీజ్ డేట్  దగ్గర పడే కొద్దీ మూవీకి సంబంధించిన ఒక్కో విషయం బయటకి వస్తుంది. బయటకి రావడమే కాదు ఫిలిం సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తుంది.ఈ క్రమంలోనే ఒక నయా న్యూస్ వైరల్ గా మారింది ఆల్రెడీ  పుష్ప 2 నార్త్ ఇండియా బిజినెస్, ఆడియో రైట్స్ రికార్డు ధరకి అమ్ముడయ్యాయి.ఈ న్యూస్ తెలుగుతో పాటు ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది.ఇప్పుడు ఇంకో నయా న్యూస్ పుష్ప స్టామినా ని తెలియచేస్తుంది. పుష్ప 2 బాంగ్లాదేశ్ లో విడుదల కాబోతుంది.ఇది రూమర్ కాదు నిజమైన వార్తే. ఎందుకంటే  ఈ విషయాన్ని స్వయంగా  మేకర్స్ ప్రకటించారు. పైగా బాంగ్లాదేశ్ లో విడుదల అవుతున్న మొట్టమొదటి మూవీ కూడా  పుష్ప 2 నే. ఇప్పుడు ఈ వార్తతో అయితే  మా బన్నీ తగ్గేదేలే అంటు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. ఇక పుష్ప 2 ని దర్శకుడు సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. పార్ట్ 1 ని మించి హిట్ చెయ్యాలనే పట్టుదలతో ఉన్నాడు.బన్నీ కూడా తన అభిమానులకి, ప్రేక్షకులకి పుష్ప 2 తో అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నాడు. ఇటీవల బన్నీ పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన టీజర్ తో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి.  అతి త్వరలో మూవీ నుంచి ఇంకో  టీజర్ రాబోతుంది. రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
నాలుగు గదుల మధ్య... నలుగురు మనుషులు యాంత్రికంగా కలిసున్నంత మాత్రాన అది ఇల్లనిపించుకోదు. మాయని మమతలు మనసుల మధ్య లతల్లా అల్లుకుపోవాలి. బంధాలు బలోపేతం కావాలి. అందుకే ఆంగ్లకవి ఎమర్సన్ అంటాడు 'The relationship between two members in a family should be like fish and water. It should not be like fish and fisherman'..  కుటుంబంలో ఒకరితో ఒకరికి అనుబంధం చేపకి, నీటికి ఉన్నంత సహజంగా, సౌకర్యంగా ఉండాలే కానీ... చేపకి జాలరికి మాదిరి తప్పించుకోలేని, తప్పనిసరి పరిస్థితిలా సాగిపోకూడదు. ఈ రోజుల్లో ఇళ్లన్నీ ఆధునిక సౌకర్యాలతో శోభిల్లుతున్నాయే కానీ ఆత్మీయతలతో కాదు. తమని తాము పిల్లలకు ఆదర్శంగా మలచుకోలేక, బిడ్డలు మాత్రం తమ చెప్పుచేతల్లో ఉండాలని తల్లిదండ్రులు... తాము ఎలా ఎదగాలో, ఎవరిలా ఉండాలో తేల్చుకోలేక పిల్లలు... అయోమయంతో సతమతమవుతున్నారు. ఫలితం ఎక్కడ చూసినా అంతస్తులు, ఆడంబరాలే తప్పా ఆదర్శాలు, ఆనందాలు తెలీని కుటుంబాలే కనిపిస్తున్నాయి. అన్నింటినీ మించి కుటుంబసభ్యుల్ని మాలలో పూలలా కట్టిపడేసే సాన్నిహిత్య సూత్రమే నానాటికీ సున్నితమవుతోంది.  కుటుంబమంటే ఇలా ఉండాలని పెద్దలు చెబుతున్నారు.. శ్రీరాముని చరిత్ర ఈనాటికీ చర్వితచరణమేనంటే, కారణం అది కుటుంబ విలువలకు కుదురుగా నిలిచింది. కలతలు, కల్లోలాలు ఎన్ని పొడచూపినా కుటుంబ పెద్దగా కోదండరాముడు కష్టాల్ని తనే ముందు భరించాడు... సుఖాలను అనుంగు సోదరులకు, అనుచరులకు పంచిపెట్టాడు. తన మహోన్నత వ్యక్తిత్వంతో కుటుంబాన్నే ప్రభావితం చేశాడు. అయోధ్యను ఏలాల్సినవాడు రాత్రికి రాత్రే అడవులకు పయనం కావాల్సి వచ్చింది. అందుకు కించిత్తయినా కుంగిపోలేదు. ప్రసన్న వదనంతోనే ప్రయాణమయ్యాడు. ఆయనతో అడవి కూడా అయోధ్యే అనుకుని అర్థాంగి వెంట నడిచింది... అన్నావదినల సేవే భాగ్యమనుకొని తమ్ముడూ తోడు నడిచాడు...  చివరికి ఎవరి కోసమైతే తాను రాజ్యం వదులుకున్నాడో ఆ తమ్ముడూ, అన్న పాదుకలకే పట్టాభిషేకం చేశాడు. ఆ శ్రీరాముడు తన ధర్మస్వరూపంతో ఎంత ప్రభావితం చేయకపోతే ఆ పరిగణమంతా అంత త్యాగపూరి తమవుతుంది.! అందుకే తానే కాదు తన శ్రీమతిని, సోదరుల్ని, చివరికి తన సేవకులను కూడా తనతో సమంగా దైవస్వరూపులను చేశాడు. ప్రతీ తండ్రీ ఆ రామచంద్రునిలా ధర్మాన్నే ఆచరిస్తే, ప్రతీ తల్లి సీతాదేవిలా నారీశిరోమణే అయితే... పుట్టే పిల్లలు లవకుశలు కాక  ఇంకేమవుతారు. ఆ ఇల్లు రామాలయం కాక మరేమవుతుంది.!' అంటారు. కాబట్టి ఇల్లు బాగుండాలన్నా, పిల్లలు ధర్మబద్ధంగా ఉండాలన్నా తల్లిదండ్రులు మొదట తమ దారి సరిచేసుకోవాలి..                                        ◆నిశ్శబ్ద.
సమాజంలో విద్య పాత్ర చాలా గొప్పది. విద్య కలిగినవాడి మార్గం వేరుగా ఉంటుంది. జీవితంలో గొప్ప ఉద్యోగ అవకాశాలను పొందాలి అంటే విద్య కూడా గొప్పగానే ఉండాలి.  మనిషి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి విద్య చాలా అవసరం. విటువలులేని విద్య వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం! విజ్ఞానం ద్వారా మానవాళికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుత సమాజంలో విలువలతో కూడిన విద్య సమాజానికి చాలా అవసరం. కానీ ఎక్కడా విలువలు అనేవి విద్యలో అంతగా కనిపించడం లేదు. కారణం విద్యను ఒక వ్యాపారంగా మార్చేయడం. విద్య అనేది ప్రగతిశీలకంగా చైతన్యంగా ఉన్నప్పుడే విద్యకు విలువ అనేది ఉంటుంది. భవిష్యత్ కార్యక్రమాలకు కూడా విద్య ద్వారా అందే ఫలాలు అందరికీ చేరతాయి. కొంతమంది విద్యాలయాల్లో కాకుండా స్వతంత్రంగా చదివి పైకి వచ్చినవారు ఉన్నారు. దూరవిద్య, ఓపెన్ యూనివర్శిటీల ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు కొందరు. విద్య అనేది వివేకాన్ని ఇవ్వాలి. వివేకం లేని విద్య ఎవ్వరికీ ఉపయోగపడదు. ఎందుకంటే అందరూ విద్యా వంతులైతేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. విద్యారంగం విస్తరింపబడుతుంది. దేశ ప్రగతికి, సమాజ శ్రేయస్సుకూ సాంకేతిక వృత్తి, వైద్య విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వ వలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందరూ దీనిని ముక్త కంఠంతో ఆమోదిస్తున్నా అమలుచేయడంలో మాత్రం అలసత్వమే ఎదురవుతోంది. అర్హతలు లేనివారు అందలం ఎక్కటం, విలువలు తక్కువైన విద్య, గుర్తింపు లేని విద్యాలయాలు అందరినీ ఆందోళనకు గురి చేస్తున్నాయి.  మేధావులు సలహాలూ సంప్రదింపులూ లేకుండా, కేవలం కార్యనిర్వాహక పదవులలో ఉన్నవారు. చేసే నిర్ణయాల వల్ల హాని జరుగుతుందని గుర్తించే నాటికి జరగవలసిన హాని జరిగిపోతుంది. అందుకే ఎక్కడ చూసినా అర్హత లేనివాళ్ళు ఉంటున్నారు. ప్రభుత్వనేతల రాజకీయాల ప్రాతిపదికతో కాకుండా ప్రతిభ ఆధారంగా, సమర్థులను ఈ రంగంలోకి తీసుకువస్తే విద్యా వ్యవస్థలో మార్పులకు అవకాశం ఉ ఉంటుంది. పాఠశాలలు, కళాశాలల్లో జరిగే బోధనా కార్యక్రమంతోనే విద్య యొక్క పరమావధి పూర్తిగా నెరవేరింది అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే వ్యక్తిగత అనుభవాల ద్వారా, ప్రపంచ జ్ఞానం ద్వారా, అలవాట్ల ద్వారా కూడా విద్య సమకూరుతుంది. ప్రపంచాన్ని అర్ధం చేసుకోవటానికి, ఆలోచనా పరిధిని పెంచుకోవటానికి విద్య ఉపయోగపడాలి. విద్య మనకు వినయాన్ని, సంస్కారాన్ని ఇవ్వాలి. విద్య ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, నిర్వహణా సమర్ధ్యం, నాయకత్వ పటిమ పెంపొందాలి. విద్య అనేది సమగ్ర వ్యక్తిత్వానికి పునాదిగా నిలవాలి. విలువలు లేని విద్య నిరర్ధకము. విద్యతో పాటు విలువలు కూడా నేర్చుకోవాలి. విద్యావంతులైన యువతీ యువకులు విశ్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి, సమాజ వికాసానికి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ  తమ ఉన్నత విద్య ద్వారా విదేశాలలో సైతం గౌరవం, ఆదరణ పొందాలి. విద్య ద్వారా సంస్కారవంతులు, గుణవంతులైన వారు తయారౌతారు విద్య జీవనోపాధిగా ఉండటమే కాక, జీవన పరమావధిగానూ ఉండాలి. అందుకే విద్య వస్తే సరిపోదు. దానికి విలువలు ముఖ్యం.                                         ◆నిశ్శబ్ద.
రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.