Home | News | Cinema | TV | Radio | Comedy | Romance | Shopping | Bhakti | VOD | Classifieds | NRIcorner | KidsOne | Greetings | Charity | More
                 Home >> Vanitha >> Recipes >> Festival special
 
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies hyderabad biryani
Vegetarin
Sweets
Non Vegetarian
Chicken
Mutton
Sea Foods
Tiffins
Pickles
Jams
Desserts
Drinks
Salads
Snacks
Soups
Baby Foods
Tips
 
Online-Shopping- teluguone.com
Diwali | Deepavali | Deewali | laxmi pooja | lakshmi puja | crackers | recipes | sweets | pooja vidhanam video | diwali articles | narakasura vadha | ravanasura | satyabhama | krishna | laxmi | lakshmi | vinayaka | aha emi ruchi | video recipes
Pheni Malpua Palakova Madatakaja Sorakaya Halwa
Pheni Malpua Palakova Madatakaja Sorakaya Halwa
దీపావళి స్పెషల్ స్వీట్ ఫేనీ
కావలసినవి:
ఫెనీలు - కేజీ (ఇవి స్వీట్ షాపుల్లో దొరుకుతాయి)
చిక్కటి పాలు - ఒక లీటర్
చక్కటి - అర కిలో
Pheni
తయారు చేసుకునే విధానం :
ఈ స్వీట్ చేయడం చాలా ఈజీ. ఈ ఫెనీలు దీపావళి సీజన్ లో మాత్రమే ఎక్కువగా దొరుకుతాయి అనుకోకుండా అతిధులు వచ్చినప్పుడు వారికి పెట్టవచ్చును. ఈ ఫెనీ స్వీట్ ఎంతో రుచిగా ఉంటుంది. ఫెనీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి, వాటిపైన చక్కరి వేసి వేడి పాలు పోసి కొంచెం సేపు ఉంచాలి. అంతే దీపావళి స్పెషల్ స్వీట్ ఫెనీ రెడీ.
Top
మాల్ పువా
కావలసిన వస్తువులు:
మైదా పిండి - అరకిలో
డాల్డా లేదా నూనె - వేయించడానికి సరిపడా
నెయ్యి - పావు కిలో
మిఠాయి - చిటికెడు
పంచదార - కిలో
పాలు - పావు లీటర్
యాలకులు - 5
malpav
తయారు చేసే విధానం:
మైదాలో నెయ్యి పాలు పోసి మెత్తగా కలపాలి. వెడల్పాటి మందపాటి గిన్నె తీసుకుని అందులో డాల్డా లేదా నూనె పోసి కాచాలి. మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న సైజులో మందపాటి పూరీలా వత్తాలి. వీటిని కాగిన నూనెలో వేయించి తీయాలి. విడిగా వెడల్పాటి గిన్నెలో పంచదార, తగినన్ని నీళ్ళుపోసి తీగ పాకం రానివ్వాలి. అందులోనే యాలకులపొడి, మిఠాయి రంగు కలపాలి. వేయించ పూరీల్ని ఈ పాకంలో ముంచి తీసి ఆరనిస్తే మాల్ పూవా రెడీ!
Top
పాలకోవా
కావలసిన పదార్థములు:
స్వచ్ఛమైన పాలు - ఒక లీటరు.
చక్కెర - పావు కేజీ.
నెయ్యి - కొద్దిగా.
pala kova
తయారు చేయు విధానం :

పాలు స్టవ్ మీద పెట్టి మీగడ కట్టకుండా, గరిట కింద పెట్టకుండా తిప్పుతుండాలి. రెండు గంటల అనంతరం పాలు ముద్దలా అవుతుంది. ఇంకా తిప్పుతూనే ఉండాలి. మరికొంత సేపటికి గట్టిగా ముద్దలాగ అవుతుంది. చక్కెర మెల్లమెల్లగా పోసి మళ్ళీ తిప్పుతుండాలి. పల్చని పాకం తయారవుతుంది. మరికొంత సేపటికి పంచదార పాకం అయి పల్చబడిన కోవా మళ్ళీ గట్టిగా అవుతుంది. ఒక పళ్ళానికి నెయ్యి రాసుకొని కోవా ముద్దను పళ్ళెంలో గుమ్మరించాలి. కోవా ఉండలు ఉండలుగా లేకుండా చక్కగా మెత్తగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మీ కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
చిట్కా: పాలకోవా తయారు చేసేటప్పుడు... పాలతో పాటు ముందుగానే చక్కెరను కలపకూడదు. పాలు బాగా మరగిన తరువాత చివరలో తక్కువ పంచదారను కలిపితే పాలకోవా ఎక్కువ రుచిగా వుంటుంది.

Top
మడత కాజా
కావాల్సినపదార్థాలు:
మైదా - రెండు కప్పులు
బేకింగ్ పౌడర - ఒక స్పూన్
డాల్డా లేక నెయ్యి - 7స్పూన్స్
బియ్యం ప్పిండి - రెండు స్పూన్లు
నీళ్ళు - సగం కప్పు (పాకం కోసం)
నూనె - మూడు కప్పులు (వేయించడానికి)
madata kaja
తయారుచేయువిధానం:
మైదా, బేకింగ్ పౌడర్ , మూడు టేబుల్ స్పూన్స్ డాల్డా, తగినన్ని నీళ్ళు వేసి పూరీ పిండిలా కలుపుకొని 30 నిముషాలు మూతపెట్టి నాన పెట్టాలి. డాల్డా నాలుగు స్పూన్లు, రెండు స్పూన్ల బియ్యప్పిండి జారుగా కలుపుకోవాలి. తరువాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ ఉండలను నాలుగు మూలాల ఆకారంలో పల్చగా వత్తుకోవాలి. ఇలా మూడు చపాతీలు వత్తుకోవాలి. ఒక్కొక్క చపాతి మధ్యలో డాల్డా, బియ్యప్పిండి పేస్ట్ ను రాయాలి. ఇలా మూడు చపాతీలు ఒక దానిపై ఒకటి పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చపాతీని వెడల్పుగా చుట్టాలి. ఇలా చుట్టిన చపాతిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలను చపాతి కర్రతో మధ్యలో కొద్దిగా వత్తాలి. తరువాత గిన్నెలో చక్కెర, నీళ్ళు పోసి తీగ పాకంగా చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడి పెట్టి, వేడి అయ్యాక తయారు చేసుకున్న కాజాలను వేసి, రెండు వైపులా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించిన కాజాలను చెక్కర పాకంలో వేయాలి. కాజాలకు పాకం బాగా పట్టిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మడత కాజా రెడీ.
Top
సొరకాయ హల్వా
కావాల్సినపదార్థాలు:
చిన్న సొరకాయ- ఒకటి
పాలు- ఒక లీటర్
జీడిపప్పు- 20గ్రాములు
యాలకులు - పది
కిస్‌మిస్ - కొద్దిగా
పంచదార - 300 గ్రాములు
sorakaya halwa
తయారుచేయువిధానం:

సొరకాయ చెక్కుతీసి ముక్కలుగా చేసి కొబ్బరికోరినట్లుగా సన్నగా కోరుకోవాలి. ఈ కోరును ముద్దగా చేసి నీళ్ళన్నింటినీ పిండి పొడి పొడిగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి వేడయ్యాక నెయ్యి పోసి, కాగిన తరువాత జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించాలి. తరువాత అదే గిన్నెలో, మిగిలిన నెయ్యిలో కోరిన సొరకాయను వేసి 10 నిమిషాలు వేయించాలి. ఆపై అందులోనే పాలు, పంచదార వేయాలి. అది బాగా దగ్గర పడి హల్వాలా అయ్యేదాకా గరిటతో కలుపుతూ ఉండాలి. తరువాత హల్వాను దించుకునేముందు వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్, యాలకుల పొడి కలపాలి. అంతే సొరకాయ హల్వా రెడీ.

 

More Recipes
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies fish curry salads
 

 

Online-Shopping- teluguone.com
 
     
TeluguOne Services
TV Cinema NEWS Radio (TORi)
KidsOne Comedy Panchangam Bhakti
Greetings Shopping Romance Vanitha
Health Audio Songs Buy DVDs NRI Corner
Classifieds Music Classes Games Matrimonial
Charity SocialTwist Tell-a-Friend
TeluguOne FOR YOUR BUSINESS
Ad Tariff
 
About TeluguOne
About TeluguOne
   
  Copyright © 2000 - 2012, teluguone.com, All rights reserved