|
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies hyderabad biryani
|
| |
|
 |
 |
 |
 |
| Venna Undlau |
Carrot Laddu |
Atukula Payasam |
Karapu Kajalu |
| వెన్న ఉండలు |
| కావలసినవి: |
మైదా : 1 కప్పు
బియ్యపు పిండి : 1/4 కప్పు
పంచదార : 1 కప్పు
వెన్న : 1/4 కప్పు
యాలకులపొడి : ఒక స్పూన్
వంట సోడా : చిటికెడు
నూనె : ఫ్రై చేసుకోడానికి సరిపడా
|
 |
|
తయారు చేసుకునే విధానం : |
ఒక పాత్రలో మైదా, బియ్యపుపిండి, వంట సోడా, వెన్న అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. దానిలో వేడినీళ్ళు వేసి పిండిని మెత్తగా కలుపుకోవాలి. దానిని తడిగుడ్డతో కప్పి 1 గంట ప్రక్కన పెట్టుకోవాలి. 1 గంట తరువాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వీటిని తడిగుడ్డతో కప్పి 5 నిముషాలు ప్రక్కన పెట్టుకోవాలి. ఫ్రై చెయ్యడానికి నూనెను వేడిచేసుకోవాలి. ఈ ఉండలను నూనెలో వేసి చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చేవరకూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఉండలను చల్లారనివ్వాలి. తరువాత చక్కర పాకం పట్టుకోవాలి. దానికి ఒక గిన్నెలో చక్కర వేసి, కరగడానికి కావలసినంత నీరుపోసి పాకం గట్టిపడే వరకూ కలుపుతూ ఉండాలి. తరువాత దానిలో యాలకులపొడి వేసి కలుపుకోవాలి. ఈ పాకం ఎలా ఉండాలంటే, గరిటతో పాకం తీసి ప్లేట్లో చిన్న డ్రాప్ వేస్తె అది స్ప్రెడ్ ( ప్రాకకూడదు ) అవ్వకూడదు. ఇలా అయ్యిన పాకాన్ని స్టవ్ మీద నుండి తీసి ప్రక్కన పెట్టుకుని, ఈ పాకంలో చల్లారబెట్టుకున్న ఉండలను వేసి ఆపకుండా కొన్ని నిముషాలు కలుపుకోవాలి. దానిని చల్లారనివ్వాలి. అంతే...
|
|
| Top |
| క్యారెట్ లడ్డు |
| కావలసిన వస్తువులు: |
క్యారెట్ తురుము - 200 గ్రా.
పచ్చి కొబ్బరి తురుము - 50 గ్రా.
బొంబాయి రవ్వ - 30 గ్రా.
జీడిపప్పు - 10 గ్రా.
కిస్ మిస్ - 10 గ్రా.
పంచదార - 50 గ్రా.
యాలుకల పొడి - చిటికెడు.
|
 |
|
తయారు చేసే విధానం: |
స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో రెండు టీ స్పూన్ ల నెయ్యి వేస్తూ బొంబాయి రవ్వ, క్యారెట్, కొబ్బరి తురుము విడివిడిగా వేపి పక్కన పెట్టుకొవాలి. ఇలా విడివిడిగా వేయించి పెట్టుకొన్న పదార్థాలను అన్నింటిని ఒక బౌల్ లో వేసి, చెక్కర, యాలకల పొడి చల్లి ఈ మిశ్రమానంతటిని బాగా కలపాలి. ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని చిన్న చిన్ని వుండలుగా చేయాలి. ఇలా తయారైన లడ్డులపై జీడిపప్పుతో అలంకరించి వడ్డించండి చాలా రుచికరంగా ఉంటాయి. మరియు చిన్న పిల్లలు ఇష్టంగా కూడా తింటారు.
|
|
| Top |
| అటుకుల పాయసం |
| కావలసిన పదార్థములు: |
పాలు - 1 ltr
అటుకులు - 1/4 kg
చక్కెర - 1/2 kg
యాలకలు - 4
జీడిపప్పు - 4 tbsp
ఎండుద్రాక్ష - 2 tbsp
నెయ్యి - 2 tbsp
|
 |
|
తయారు చేయు విధానం : |
ముందుగా అటుకుల్ని కడిగి నీళ్ళు లేకుండా పదినిముషాలు ఆర బెట్టాలి. మందపాటి బాణలిలో పాలు పోసి కాసేపు అంటే మీగడ కట్టే విధంగా మరిగించాలి. అందులో అటుకులు వేసి తక్కువ మంటమీద కాసేపు ఉడికించాలి. తరవాత పంచదార, యాలుకల పొడి వేసి పాలు సగమయ్యేవరకు ఉడికించి దించాలి. మరో బాణలీలో నెయ్యి వేసి జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పాయసంలో కలపాలి.
|
|
| Top |
| కారపు కాజాలు
|
| కావాల్సినపదార్థాలు: |
గోధుమపిండి - ఒక కిలో
సోపు - 50గ్రాములు
పచ్చిమిర్చి - 100 గ్రాములు
ఉల్లిపాయలు - 100 గ్రాములు
ఉప్పు - తగినంత
నూనె -ఒక కిలో
మైదా - 100 గ్రాములు
నీళ్లు - తగినన్ని
|
 |
|
తయారుచేయువిధానం: |
ముందుగా ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ముద్గగా నూరుకోవాలి. ఒక గిన్నెలోకి గోధుమపిండి తీసుకోవాలి. ఇందులో సోపు, పచ్చిమర్చి ముద్ద, దోరగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, 50 గ్రాముల నూనె, తగినన్ని నీళ్లు వేసి ముద్దలా కలుపుకోవాలి. (పూరి పిండికన్నా గట్టిగా ఉండాలి) కలిపిన పిండిని మూడు ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని చపాతీలుగా చేసుకోవాలి. ఈ చపాతీని డైమెండ్ ఆకారంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద వెడల్పాటి కడాయి పెట్టి తగినంత నూనె పోసి బాగా వెడెక్కాక ఈ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకూ వేయించుకోవాలి.
|
|
|
| |
|
| More Recipes |
|
andhra telugu english online recipes pickles nonvegetarian dishes vegetarian dishes tiffins chutnies fish curry salads
|
|
|