www.teluguone.com   
Home | News | Cinema | TV | Radio | Vinodam | Sarasam | Shopping | Bhakti | VOD | Classifieds | NRIcorner | KidsOne | Greetings | Charity | More
 
 
   Home >> vanitha >> Beauty
  ::  Ladies Features
Yoga
Home and Career
Beauty Care
Fashion
Mehendi Designs
Recipes
Diet and Health
Health Science
Baby Care
Rangoli

Untitled Document
Tone Ads
Srinivasa-Leelamrutham-Audio-Serial
 
Srinivasa-Leelamrutham-Audio-Serial
Online-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-ArticalesOnline-Devotional-Songs-Articales
 Andame Anandam
» Skincare » Eyecare » Haircare » Dental care
» Pedicure & Manicure » Beauty Tips » Lipcare    
               

Eye Care at Home
ఐ మేకప్..
 
కంటికి తీసుకునే జాగ్రత్తలలోనే సంరక్షణ కూడా దాగి వుంది. కళ్ళు ఆరోగ్యంగా మిలమిలా మెరుస్తూ వుంటేనే ముఖం అందంగా కనపడుతుంది. కంటికి కేవలం మేకప్ వేసుకున్నంత మాత్రాన అందంగా కనపడదు. దానిక్ తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే వాటి అందం రెట్టింపు అవుతుంది. కంటికి తీసుకునే జాగ్రత్తలు మీకోసం...
  • ధారాళంగా గాలి వెలుతురూ వచ్చే గదిలోనే కూర్చుని చదువుకోవాలి. వెలుతురు ఏమాత్రం తగ్గినా చదవకూడదు.

  • పుస్తకాన్ని నిటారుగా కూర్చుని మాత్రమే చదవాలి. పడుకొని చదవడం అనేది అంత మంచి అలవాటు కాదు. కంటికి, చదివే పుస్తకానికి కనీసం 35 నుంచి 40 సెంటీమీటర్ల దూరం వుండే విధంగా చూసుకోవాలి.

  • అదే విధంగా టీవీ చూసేటప్పుడు కూడా దూరాన్ని పాటించాలి. టీవీకి మీరు కూర్చునే కుర్చీకి కనీసం పది అడుగుల దూరం వుండాలి. ఇంతకన్నా దగ్గరగా కూర్చుంటే కళ్ళు అలసటకి గురవుతాయి.

  • టీవీ చూసేటప్పుడు లేదా కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు కళ్ళకి తరచూ విరామం ఇస్తూ వుండాలి, ప్రతి గంటకి ఒక సారి పదినిమిషాల పాటు కంప్యూటర్ లేదా టీవి ముందు లేస్తూ వుండాలి.

  • రోజుకి కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం అది ఒక్కొక్కరి శరీర తత్త్వాన్ని బట్టి మారుతుంది. తక్కువ నిద్రపోతే కంటి కింద నల్లటి ఛాయలు ఏర్పడతాయి. ఇవి అందాన్ని దెబ్బతీయడమే కాకుండా అనారోగ్యానికి చిహ్నాలు కూడా.

  • కళ్ళు అలసటకి గురవుతున్నాయని అనిపించినప్పుడల్లా చల్లని నీతితో కళ్ళను కడుక్కుంటూ వుండాలి.

  • రసాయనాల దగ్గర పనిచేసేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదవశాత్తు ఏదైనా రసాయన పదార్థం కంటిలో పడిన వెంటనే చల్లని నీతితో శుభ్రంగా కడుక్కుని డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. ఎత్తి పరిస్థితుల్లోనూ సొంత వైద్యం పనికి రాదు.

  • కంట్లో ఇసుక, చెత్త పడినప్పుడు నీటితో వాటిని తొలగించే ప్రయత్నం చేయాలి తప్ప అదేపనిగా వాటిని నలపకూడదు.

  • కాంటాక్ట్ లెన్స్ ఉన్నవారు నిద్రపోయే ముందు వాటిని తీసి జాగ్రత్త చేయాలి. లేకుంటే దాని వలన ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం వుంది.

  • కళ్ళ కలక ఇతర ఇన్ ఫెక్షన్లు సోకినప్పుడు చేతులు శుభ్రం చేసుకోకుండా కళ్ళను తాకకూడదు. కళ్లకలక వచ్చినప్పుడు కన్ను విపరీతంగా దురదపెడుతూ వుంటుంది. చేతులు శుభ్రం చేసుకోకుండా కాంతిని చుపినప్పుడు ఇన్ ఫెక్షన్ మరింత ఎక్కువై కంటితో పాటు చుట్టుపక్కల ప్రదేశంలో కూడా వాపు వస్తుంది.

  • తరచూ వచ్చే తలనొప్పికి కళ్ళు ముఖ్య కారణం కావచ్చు. కంటిచూపు తగ్గడం వలన వస్తోందా? లేక కంటికి సంబంధించి మరే ఇతర సమస్య వలనైన్న తలనొప్పి వస్తోందా? అన్నది వైద్యుడి దగ్గరకు వెళ్ళి నిర్థారించుకోవాలి. తలనొప్పి విషయంలో సొంత వైద్యం ఎంత మాత్రం పనికిరాడు.

  • కంటికి మేకప్ సామాగ్రే విషయంలో మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువునూ కొని ఉపయోగించకూడదు. మస్కారా, ఐ లైనర్, కాటుక వంటివి కొనేటప్పుడు పేరున్న కంపెనీలవి మాత్రమే ఉపయోగించాలి.

  • చివరగా ఒక సూచన... సంవత్సరానికి ఒకసారన్నా కళ్ళను పరీక్షించుకోవాలి.

Previous

   

Watch-Online-Movie-Bumper-Offer-Maa-Nanna-Chiranjeevi
 
 
 
 
SocialTwist Tell-a-Friend Subscribe   |  Help   |  Site Map   |  Site Tour   |  Recommend  |  FAQ  |  Reminder  |  Ad Tariffs  |  Feedback  |  Your Page
24 hours customer service Send your Queries to support@teluguone.com
Copyright © 2000 - 2009, teluguone.com, All rights reserved .  Send your Feedback
Messengers : teluguone@yahoo.com - teluguone@hotmail.com - support.teluguone@gmail.com
Live Help