Next Page 
మయసభ పేజి 1

                                                             మయసభ

                                                    ___సూర్యదేవర రామ్ మోహనరావు 

 

 

                                                   

 



    సాయం సంధ్య......

    సంద్రానికి సంతోషంగా వుంది.......

    అలల్నే రెక్కలుగా చేసుకుని అగాధంలోకి అంచులకు చేరి భూమండలాన్ని సంధించాలని ప్రయత్నిస్తోంది.

    సుదూరంగా కలుషితమైపోయిన బీసెంట్ బీచ్ కనిపిస్తోంది. రకరకాల మనుష్యులతో కిక్కింసి పోయి నిశ్శబ్దనికి, ప్రశాంతతకు దూరమోపోయిన ఆ బీచ్ ని చూసి అవంతి విసురుగా తల తోప్పుకుంది.

    తన చుట్టూ చూసుకుంది

    ఎవ్వరూ లేరు. మసక చీకటి.... మనుష్యు సంచారానికి దూరంగా ప్రశాంతంగా వుంది.

    వందడుగుల దూరంలో ఉవ్వెత్తున లేచి విరిగిపడుతున్న అలలు.... రోరింగ్ .... విచిత్రమైనా అలల శబ్దం.......

    క్రమంగా విజిలిబిటీ మసక చీకటి మాటుకు చేరుకుంటో౦ది.

    ఆమె లేచింది.....

    చీర కంటుకున్న ఇసుక రేణువుల్ని సుతారంగా దులుపుకో బోతుండగా ఆమెకు తెలిసింది. తాను చేయలకున్న పనినే మరెవరో చేస్తున్నారని.
   
    ఒక్కసారి ఆమె శరీరం గగుర్పాటుకి లోసయింది.

    తన మసక నించున్నది ఎవరన్నది గుర్తుంచి చటుక్కున వెనుదిరిగి అతనికేసి చిరుకోపంతో చూసింది.

    అతను నవ్వాడు.... పెదాలు విడివాడకుండా నవ్వాడు. "నీ చేతులు కందిపోటాయనే....." అతను నవ్వుతూనే అన్నాడు.

    అతనిచ్చిన సంజాయిషిలో ఆమెకి కవ్వింపు ధోరణే ఎక్కువుగా కనిపించింది.

    "నిజం ....?" ఆమె గాలికి ఎగిరి మోముకి అడ్డుపడుతున్న కారు మొఘల్లాటి తన పొడవైన జుత్తుని అలవోకగా తప్పించుకుంటూ అంది.

    "నిజమంటే ....?" అతను సందేహంగా ఆగిపోయాడు.

    "కేవలం నా చేతులు కందిపోటాయనేనా....?" ఆమె కంఠం శ్రావ్యముగా వుంది. నిజం తెలుసుకునేందుకు ఆత్రుత చందుతున్నట్ట్లుగా  వుంది.

    అతను తన కుడి అరచేతిని ప్రేమగా, ఆర్తిగా, ఆరాధనగా ముద్దిడుకున్నాడు.

    ఆమె గుండె ఒక్క క్షణం లయతప్పింది.

    అతనెందుకా పనిచేసింది ఆమెకు తెలుసు.

    అతను ఇసుకపై కూర్చుంటూ ఆమెకేసి తన ఎడంచేతిని అందించాడు.

    ఆమె అతనికేసే చూస్తూ ఒక్కక్షణం అలాగే నిల్చుండిపోయింది

    తన చేతిని గాల్లో మరికొంచెం పైకి లెపాడు.

    "నీకు ఆసరా ఇద్దామని ...." అతను సగం సగమే మాట్లాడతూన్నాడు.

    ఆమె తన కుడిచేతిని అతనికి అందించి అతని ప్రక్కనే కూర్చుంది.

    "రిషీ ... నాకు తప్పయినా, ఒప్పయినా నిర్భీతితో నిజాల్ని మాట్లాడే వాళ్ళంటేనే ఇష్టం...." ఆమె తన చేతిని అతని చేతిలోంచి తీసుకుంటూ అంది.

    "నా మనసులో ఇప్పుడేముందని అడుగు...."

    "ఏముంది.....?" ఆమె ఓరగా చూస్తూ అడిగింది.

    "నిజం చెప్పామన్నవుగా ...? అదంటేనే కదా నీకిష్టం . అది చెప్పే నేనంటే మరీ ఇష్టముంటుంది. కదా....? అయితే చెప్పేస్తున్నాను. నాకు నీ ఒడిలో పడుకోవాలని వుంది...." అని అటూంనే అడ్డంగా తిరిగిపోయి, ఆమె కుడి చేతిన్బి తనకడ్డం లేకుండా చూసుకుంటూ ఆమె ఒడిలోకి వాలిపోయాడు.

    ఆమె శరీరం అతని స్పర్శకు కొద్ది క్షణాలు పులకరించింది.

    అది తనకిష్టమో...... చెప్పేలోపే ఆమె మూగదయిపోయింది.

    "ఇప్పుడు మరో నిజం చెబుతున్నాను. నీ స్పర్శ నాలోని భయాల్ని. బాధల్ని నిరశాల్ని, నిస్పృహల్ని తరిమికొట్టే ఏకైక సాధనం.... అంటూ ఆమె ఒడిలో కుదురుగా లేకుండా అటూ ఇటూ కదులుతున్నాడు......

    ఆమె కొద్ది క్షణాలకు తేరుకుంది.

    అతని ఒత్తయిన జుత్తుని నిమురుతూ __

    "రిషీ ..." అంది.

    "ఊ... చెప్పు" అన్నాడు రిషి.

    "నిజంగా నీలోని భయాల్ని, బాధల్ని నిరశాల్ని నిస్పృహల్ని తరిమికొట్టే ప్రయత్నం చేయనా....?" తన మోముని జుత్తువేపుకి తెస్తూ అంది అవంతి.

    అతను కొద్ది క్షణాలు మౌనంగా వుండిపోయాడు. అవంతి నుంచి వస్తున్న జోవన్ ఈవినింగ్ ఎడిషన్ ఫర్ ఉమెన్ స్ప్రే పరిమిళాన్ని ఆస్వాదిస్తూ చిన్న పిల్లాడిలా, తనదే అయిన తన తల్లి ఆడవి మరెవరూ చేరరాదన్న పసితనపు పోసేసివ్ నేచర్ తో మరింతగా ఆమె ఒడిలోకి తలను దూర్చి కళ్ళు మూసుకున్నాడు.

    అప్పుడతనికి అతని సమస్యలుగాని, బాధలు కాని, భయాలు కాని, నిరాశా నిస్ప్రుహాలు కాని గుర్తుకు రావటంలేదు.
   
    మానవజాతిని బౌతిక ప్రపంచంనుంచి, ఆ ప్రపంచపు తాలూకు భారమైన అనుభవాల దూరంచేసే ఏకైక వరం నిద్ర.... గాఢనిద్ర....

    అదే కలతయితే కాఠిన్యాల్ని కనుమరుగుచేసే తాత్కలికపు చీకటి మందు.....

    మొదటిది వరమైతే. రెండవది సెల్ఫ్ డిస్ట్రక్షన్ . ఈ రెంటిని మించినది సంయమనం వేదాంతం....!

    వీటన్నింటిని మించిన ఎక్సయిటింగ్ , ఫాంటాబ్యులస్  షంగ్రిలా.... అనుభూతించటమే తప్ప ఆ అనుభవానికి భాష్యం చెప్పలేని బ్రహ్మాండం బ్రద్దలయ్యెంత గొప్పది, విలువయినది ప్రియురాలి ఒడి.... సేద తీర్చి, చెదునిజాల భయాలనుంచి తప్పించే నూతనోత్సాహాన్ని గుండెలనిండా నింపే ఔషధ౦ స్రీ ఒడి......

    పకృతిలోని సమస్త అందాల సారం స్త్రీ .... ఇంక్రీడిబుల్ ఎక్స్ ట్రాక్ట్ ... మనిషి స్పూర్తికి ఇంధనం .... మమతానురగాల చందనం ......

    రిషి అంతరంగాన్ని స్కాన్ చేస్తోంది అవంతి.

    మెలుకువతో ఉన్న మగవాడికి ధైర్యానిచ్చి, ఆత్మస్థయిర్యాన్ని పంచగల అమృత కలకలంలాంటిఒడిని స్త్రీ జాతికే పంచిన సృష్టి నిజంగా ఎంత గొప్పది ....?! ఆ సృష్టికి స్రీ జాతి ఎంత రుణపడి వుంది? ఆదే సృష్టి స్త్రీ జాతికి ఏమానసిక రుగ్మతులను అందని పవిత్రమయిన సృష్టికార్యాన్ని ఇచ్చి మాత్రుమూర్తిని కూడా చేయగలగటం ఎంత గొప్ప వరం ...?

    అమెకప్పుడు నిజంగా గర్వంగా వుంది.

    తన ఒడి అతనికంత ప్రశాంతతను పంచగలిగినందుకు ఆనందంగా కూడా వుండి. వేటాడే దుఃఖ భాజకమైన అనుభవాలనుంచి,. అతన్ని తన ఒడి, డిటాచ్ చేయగలుగుతొందంటే, ఒక్కోసారి మనిషి మనసుకన్నా దేవుడి గుదికన్నా స్త్రీ ఒడి మాత్రమే గొప్పదనిపిస్తుంది.

    అయితే ఈనాడెంతమంది పురుషులు స్త్రీ ఒడిలోని దివ్యానుభూతిని పొందగలుగుతున్నారు? ఆరాధిస్తున్నారు....? ఏమ్తమంది స్త్రీలు ప్రేమతో . ఆరాధనతో ఆర్తిగా తమ ఒడిని తమ పురుషుడుకి పంచగల్గుతున్నారు ....?

    "రిషి...." ఆమె పిలిచింది ప్రేమగా

    ఆ పిలుపు ఆమె మనస్సు లోతుల్లోంచి, గుండె గొంతుకలోంచి వచ్చిందని అతనికీ తెలుసు.

    ఎందుకో అతనికి మాట్లాడాలని లేదు. తనను తాను మరచి పొగలుగుతూ. ఆమె ఒడిలోని తియ్యదనపు అంచులలో ఆదమరచి విశ్రమించన అతనికి తేరుకోవాలని, మేలుకోవాలని లేదు. అతనికి అలాంటి సందర్భంలోనే నిశ్శబ్డంపై మక్కువ పెరుగుతుంది మౌనంపై మనస్సు పడతాడు.

    ఆమె తన చేటువెళ్ళ చివర్లతో అతని జుట్టును మృదువుగా నిమురుతూ దువ్వుతూ అతని చెంపకు తన చేక్కిల్ని అద్దుతూ తనూ మౌనంగా వుండిపోయింది.

    స్త్రీ, పురుషుల మానసిక మా౦ధ్యానికి ఆ కలయిక గొప్ప ఔషధ మేమో.....?

    "నిద్రపోతున్నావా? మేలుకునే వునావా....?" ఆమె అతని చెవిలో గుసగుసలాడింది.

    తన నాసికాగ్రంతో అతని చేవును సున్నితంగా సృజిస్తూ .... స్ప్రుజిస్తూ .... మునిపంటితో గాట వేసింది.

    అతను కనీస మాత్రంగా కూడా కదలలేదు.... బాధకు చలించలేదు.

    "నొప్పిగా లేదా....?" ఆమె తిరిగి గుసగుసలాడింది.

    "నొప్పా.....?" ఇది కూడా పురుషుడుకి ఒక నొప్పె అయితే తన అస్తిత్వానికి ఆఖరి గీతం పాడుకోవటం మంచింది......


Next Page 

  • WRITERS
    PUBLICATIONS