Previous Page Next Page 
కొత్తమలుపు పేజి 4

    రెండు రవి మూడు శారద. ముచ్చటగా ముగ్గురు పిల్లలతో దేనికి లోటులేని సంసారం వారిది. రూప బి.ఏ. పరిక్ష వచ్చిందగ్గిరనించి కూతురికి పెళ్ళి చెయ్యాలని పద్మావతి విశ్వనాధంగార్ని తొందరపెట్టింది. గత మూడు నెలలుగా అయన వీళ్ళని, వాళ్ళని మంచి సంబంధాల కోసం వాకబు చేస్తూనే వున్నాడు. కాస్త వెయ్యిరూపాయలు తెచ్చుకునేవాడుగా ఏ ఇంజనిరో, డాక్టరో కాక మంచి కంపెని ఉద్యోగంలో వున్నవాడో చూసి చెయ్యాలని అయన సంబంధాలు చూస్తున్నారు. కాస్తో కూస్తో కట్నం ఇవగల శక్తి వుంది. వున్నది ముగ్గురే కనక, శారద పెళ్ళి ఇప్పట్లో లేదు కనక ఓ ఇరవై- పాతిక వేలు ఖర్చు పెట్టి మంచి సంబంధం చెయ్యాలని వారి కోరిక.
    రూప పేరుకు తగ్గట్టు రూపస్! తండ్రి రంగు, తల్లి పోలికలతో సన్నగా నాజుగ్గా పొడుగ్గా, తెల్లగా అందంగానే వుంటుంది. అందానికి తోడు ఈ కాలం పిల్లల్లా ఆకర్షణియంగా అలంకరించుకుంటుంది. ఆమె చిన్నతనం యించు మించు కాస్త మంచి వూర్లలో గడపడం, చిన్నప్పటినించి కాన్వెంటు స్కూల్స్ లో చదవడం, మెట్రిక్ దగ్గరనించి హైదరాబాద్ లో వుండటం అన్ని కలిసి ఆమెకి నాగరికంగా వుండటం, ఆధునికంగా ముస్తాబవడం తెగ ఇంగ్లిషు పుస్తకాలు చదవడం, నచ్చిన సినిమాలన్నీ చూడడం, ఫ్రెండ్సు, పార్టిలు అంటూ తిరగడం అన్నీ అలవాటే.   
    ఇంట్లో ఏ పని ముట్టుకోకుండా ఏ మిక్స్ అండ్ బూన్ నవలో పట్టుకుని రికార్డులు వింటూ కూర్చోవడం, టెలిఫోనులో గంటలకొద్దీ స్నాహితులతో కబుర్లు- ఈ కాలం పిల్లలికి ప్రతిక రూప.
    విశ్వనాధం గారు కాస్త పాత భావాలున్న ఆయన. ఆడపిల్లలు విచ్చలవిడిగా తిరగడం ఆయనకి నచ్చదు. చక్కగా వాల్చడ వేసుకుని చీరకట్టుకోకుండా ఆ మ్యాక్సిలు, బెల్ బాటమ్స్ వేసుకోవడం ఆయనకి నచ్చదు. కాని రూప యింట్లో తల్లిని వేధించి ప్రాణాలు తీసి మా ఫ్రెండ్స్ అందరూ బెల్ బాటమ్స్  వేసుకుంటుంటే  నేను ముసలమ్మలా చీర కట్టుకోవాలా, ప్రతి వాళ్ళు కట్టుకుంటుంటే నాకేనా వచ్చింది అని సాధించి పంతం నేగ్గించుకునేది.
    విశ్వనాధం గారు మొదట్లో అభ్యంతరం చెప్పేవారు. పద్మావతిని కసిరెవరు--ఏమిటి మగరాయుడిలా ఆ బట్టలేమిటి, ఆ రావిగాడికి దీనికి ఒకేలా బట్టలు? ఆ జీన్స్ ఏమిటి అసహ్యంగా? ఆ రంగు వెల్సిపోయిన ఆ ప్యాంటులు ఫాషనా......శుభ్రమైన జుట్టంతా అలా కత్తిరించుకుంది ఎందుకు, ఆ కను బొమ్మలు కోసుకోవడం ఏమిటి, ఆ హిల్స్ చాలా జోళ్ళకి -అంటూ గిణిగేవారు భార్య దగ్గిర.
    మీరు మరీను.....ఊరుకోండి, అన్నింటికి సాధిస్తారేమిటి? దాని ఈడూ పిల్లలు అందరూ అలా తయారవుతుంటే అది వూరుకుంటుందేమిటి? ఈరోజుల్లో ఫాషన్ ఇది. మన కాలంలా పరికిణి, ఒణి, వాల్చడ వేసుకోమంటే వేసుకుంటారా ఈ కాలం పిల్లలు. కొన్ని చూసి చూడనట్టు వూరుకోవాలి మనమూ అనేది. భార్య, కూతురు ఒకటవడం, మిగతా ఆడపిల్లల్ని అందర్నీ చూసి ఫేషను కాబోలు అని అయన కొన్నాళ్ళకి సర్దుకుని వూరుకున్నారు.
    సినిమాలకి, షికార్లకి ఫ్రెండ్స్ తో తిరగడం మొదలైన విషయాలు ఆయనకి తెలియకుండా కొన్ని దాచి పెట్టాల్సి వచ్చేది పద్మావతికి. ప్రాణాలు కోరికే పిల్లలు.....పిల్లల సరదాలు అనుకోకుండా రాద్దాంతం చేసే భర్త మధ్య పద్మావతికి అప్పుడప్పుడు ప్రాణసంకటంగా వుండేది. ఈడోచ్చిన పిల్లలు, అందునా ఈకాలం పిల్లలు ఇంట్లో తల్లితండ్రుల భావాలా ఒల్డు ఫేషన్ అనుకుని తల్లిమాట లెక్కచెయ్యకుండా తిరిగేది రూప. అది భర్తకు తెలియకుండా కప్పిపుచ్చుతూ, ఏదో సర్ది చెపుతూ అవస్ధపడేది. పదిసార్లు ప్రాణం తీస్తే నాలుగుసార్లు ఒప్పుకునేది సినిమాలకి వాటికీ. తెల్సిన రోజు భర్తతో చివాట్లు తినేది.
    విశ్వనాధం ఎంతసేపు భార్య మీద ఎగిరేవాడు. కాని పిల్లలని అదేం అని ఎదురుగా అడిగేవాడు కాడు. విశ్వనాధమే కాదు ముడోంతుల మంది తల్లితండ్రులు పిల్లలు ఏం చేసినా తల్లిదే తప్పన్నట్టు పిల్లలని పిలిచి అడగకుండా భార్యని తిడ్తారు. దాంతో పిల్లలకి తిట్టినా అమ్మని తిడ్తారు అన్న ధైర్యం వచ్చి తల్లిమాట లెక్కచేయరు దాంతో రూప తల్లిమాట అలుసు అయి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయేది. భర్తకి తెలిస్తే తిట్లు తనకేనని పద్మావతి అది దాచేది. ఆ విధంగా రూప కావాలనుకున్న చోటికి యిష్టం వచ్చినట్లు తిరగడం అలవాటయింది.
    కాలేజిలో చదివిన్నాళ్ళు ఫ్రెండ్స్ తో అట్నించి అటూ మ్యాట్ని సినిమాలకి చెక్కేయడం, ఏమంత ఆలస్యం మయిందటే ఏ ఎక్స్ స్ట్రా  క్లాసు వుందనో అనేది.
    కాలేజి వున్నన్ని రోజులు రోజుకో డ్రెస్స్ తో ముస్తబయి విచ్చలవిడిగా తిరిగేది. పరిక్ష లవగానే కాళ్ళు, చేతులు కట్టేసినట్లయి పోయేది. ఏ వంకన ఇంట్లోంచి బయటపడాలా అని ఆలోచించేది. ప్రతిరోజూ బయటికి వెళ్ళడానికి లక్ష ఆంక్షలు చెప్పేది పద్మావతి. ఒక నెలరోజులు ఇంట్లో కూర్చుని సరికి పిచ్చి ఎక్కినట్లయింది రూపకి.
    ఆఖరికి ఓ రోజు టాంక్ బండ్  వైపు షికారు వేడ్తుంటే తోవలో ఓ టైపు ఇన్ స్టిట్యుట్ కన్పించింది. దాన్ని చూడగానే ఓ ఆలోచన తళుక్కుమంది రూపకి. లోపలికెళ్ళి వివరాలు కనుక్కుంది. సాయంత్రం ఓ గంట గంటన్నర టైపు నేర్చుకునే వంకతో ఇంట్లోంచి బయట ప్[పడొచ్చని సంతోషించింది. టైపు నేర్చుకోవడము సరదాగా వుంటుంది. ఏదన్నా ఉద్యోగం చెయ్యాలంటే సుళువుగా దొరికే ఛాన్సు వుంటుంది.
    తల్లిని ఏలాగైనా ఒప్పించవచ్చు, తండ్రి ఒప్పికోవడమే ప్రాబ్లం అనుకుంది. "నీకేందుకే టైపు ఇప్పుడు పనిపాట లేక" అంది పద్మావతి అడగగానే. "ఏదో ఆడపిల్లలకి డిగ్రీలుండాలని చదివించాం కాని నీవేం ఉద్యోగం చెయ్యలా, వుల్లెలాలా? ఆ టైపెందుకు దండగ, రేపో మాపో పెళ్ళి చేసుకుని వెడతావు. ఎటూ కాకుండా నాల్గురోజులు నేర్చుకుని ఏం లాభం" అంది.
    "ఆ! లాభం ఎందుకులేదు, ఆర్నెల్లు నేర్చుకుంటే లోయర్ పరిక్ష పాసయితే ఏదన్నా ఉద్యోగం చెయ్యొచ్చు. నాకు యింట్లో బోర్ కొట్టి చస్తున్నాను, టైపు నేర్చుకున్నట్లుంటుంది , నాకూ తోస్తుంది...."
    "ఒసే, నీవు నా ప్రాణాలు తినకు, వెళ్ళి మీ నాన్నని అడుగు. మీ నాన్న మాట్లాడితే ఆడపిల్ల వంటరిగా వెళ్ళి ఆ టైపు వేర్చుకోకపోతే కొంప మునగదు అంటారు. కాలేజి కంటే తప్పక-- చదువు లేకపోతే లాభం లేదని పంపారు గాని టైపు గీపు అంటే ఒప్పుకోరు నేనడగను. నీవే అడుగు...." అంది పద్మావతి విసుగ్గా.
    "అబ్బబ్బ.....ఆడపిల్ల....ఆడపిల్ల.....ఏమిటమ్మా ఎన్నాళ్ళయినా ఈ ఆడపిల్ల అన్న మాట మీరు వదలరేం. ఏం ఆడపిల్లనయితే ఏం తక్కువ వచ్చింది. మన ఇంటినుంచి మహా అయితే అర కిలోమీటరు దూరం. నడిబజారు, సాయంత్రం ఒక గంటన్నరకి వెళ్ళి రావడానికి ఆడపిల్ల ఏమిటి, టైపు నేర్చుకుంటే దేనికన్నా పనికొస్తుంది. నేను వెడతాను" మొండిగా అంది రూప.
    "ఉద్యోగం చేయ్యలనుకున్నవాళ్ళకి టైపు పనికొస్తుంది. నీకెందుకు? రేపో మాపో పెళ్ళి చేద్దాం అనుకునే దానికి ఆ డబ్బు దండగ ఎందుకు."
    "ఆ...చేస్తారు పెళ్ళి, అంతా మీ ఇష్టమే, నేను ఎం.ఏ చదవాలి. ముందు రిజల్ట్స్ రావాలి. యూనివర్సిటిలో చేరాలి. ఈలోగా టైపు నేర్చుకుంటాను. అంతే నాన్నకి నీవు చెప్పుకో. రేపట్నించి నేను వెడుతున్నాను." అంటూ నిష్కర్షగా చెప్పేసింది రూప.
    కూతురు మొండితనం తెల్సింది కనక ఏం చేసినా పంతం నెగ్గించుకుంటుందని అర్ధం అయి విశ్వనాధంగారికి నచ్చచెప్పి, బతిమిలాడి తిట్లు తిని ఒప్పించింది.
    "పోనిలెండి! కాలక్షేపం లేదని కొట్టుకొంటోంది. ఆడపిల్లలకి ఇటు చదువూ లేకా, అటూ పెళ్ళి లేక ఇంట్లో కూర్చోడం అంటే విసుగురాదు! పోనీ బద్దకంగా ఈ చెత్త ఆ చెత్త చదివేకంటే పనికొచ్చే పని మంచిదేగా! పదిరుపాయలే అట నెలకి. సాయంత్రం ఓ గంటేగా - ఆ పెళ్ళి కుదిరితే అపుడే మన్పించవచ్చు. ఇంక వద్దంటే రోజు తోచడం లేదంటూ సినిమాలు, షికార్లు అంటూ ప్రాణాలు తీస్తుంది" అంటూ బతిమిలాడి ఒప్పించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS