Previous Page Next Page 
పంచభూతాలు పేజి 4

               

                                    సౌందర్య సంబంధం


   వానాకాలంలో నదిలోని నీరు పొంగి పొలాలలో  పొరలింది. ధాన్యపు పొలాలు నీటిలో మునిగిపోయాయి. మాపడవ నీటిలో మునిగి ధాన్యపు మొక్కల మీదుగా చప్పుడు చేసుకుంటూ సాగిపోతోంది.
    దగ్గరలో ఎత్తునేలమీద ఒంటి అంతస్తు ఇల్లు, దాని నాలుగు వైపులా ప్రహరీగోడ కనిపించాయి. దాని దగ్గర టిన్ను రేకుల యిల్లు, అరటి చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు వున్నాయి.
     అక్క డ నుంచి సన్నాయి వాయిద్యం వినిపిస్తూంది. సన్నాయి అపస్వరం పలుకుతోంది. పల్లెటూరి పాటలావుంది. డోలక్ వాయిస్తున్న శబ్దం లేచి ఆకాశాన్ని దలదన్న తలచినట్టుంది.
     సమీపంలోనే ఎవరిదో వివాహ మహోత్సవం జరుగుతోందని శ్రీమతి నిర్ఘరిణీదేవి గ్రహించింది. ఆమె నాటకంలోలాగ కిటికీలోనుంచి తల బయటకు పెట్టి చెట్లతో నిండిన నదీతీరం వేపు దృష్టి నిలిపింది.
    తీరంలో  కట్టివేసిన నావ సరంగును నేను, "ఏమిటి? అక్కడ బాజాలు మోగుతున్నాయి యెందుకు?" అని అడిగాను.
     సరంగు, "ఇవేళ జమీందారుగారి పుణ్యాహం," అని చెప్పాడు.
     పుణ్యాహం అంటే అర్దం వివాహం కాదు. కాబట్టి ఆ మాటలు వినేసరికి నిర్ఘరిణీదేవి మొహంలో  నిరాశ పొటమరించింది. ఆమెకు చెట్టు నీడలో గ్రామీణ వనశోభను చూడాలని కుతూహలంగా వుంది.
     అపుడు నేను, "పుణ్యాహం అంటే జమీందారుగారి జన్మదినోత్సవానికి ముందు రోజు, నేడు ప్రజలు పన్నులు పట్టుకుని వెళ్ళి శిబిరం లోని గుమాస్తాకు చెల్లిస్తారు. ఇదీ ఇక్కడి ఆచారం. వృక్షాలు ఆనంద పూర్వక వసంతానికి పుష్పాంజలి కానుకగా సమర్పించిన విధం యీ ఆచారం" అన్నాను.
     దానిమీద ప్రకాశవతి, "పన్నులు చెల్లించేందుకు మేళతాళాలు అవసరమేముంది?" అని అడిగింది.
     శ్రీ పృద్వీరాజ్, "ప్రజలు బలిమేకలు. మేకలను బలి యిచ్చే సమయంలో బాజాలు వాయించరా? యివాళ పన్నులదేవత సమీపంలో బలి బాజాలు వాయిస్తున్నారు" అన్నాడు.
     "అటువంటి భావం మీ బోటివారికి వుండవచ్చు. కాని బలి యివ్వాలనే నా అభిప్రాయం. అయితే పశుహత్యా భావంతో కాదు. ఎంత వున్నత భావంతో బలి యిస్తే అంత మంచిది."అని నేను అన్నాను.
     అపుడు పృద్వీరాజ్, "నేను యీమాటను అంగీకరిస్తున్నాను. సత్యభావం కోసం గట్టిగా నిలబడడం మంచిదే. అనేకసార్లు వున్నత భావాలతో చెడు పనులను  నింపి ఆ వున్నత భావాలను కూడా నీరసింపజేస్తాం." అని అన్నాను.
     "భావంలో సత్యా సత్యాలలో ఎక్కువభాగం మన వివేచనమీద ఆధారపడి వుంటుంది. నేను వర్షాకాలంలో పొంగి పొరలే నదిని ఒక దృష్టితో చూస్తాను.  సరంగు ఆ నదినే యింకో దృష్టితో చూస్తాడు. నా దృష్టి భ్రమయుక్త మయిందని ఎన్నటికీ అంగీకరించను," అని అన్నాను నేను.
     పవన్ దేవ్, "ఎక్కువ మంది మనుష్యుల భావాలలోని సత్యాసత్యాలు వారి గురుత్వ పరిమాణానికి కొలబద్దలు. పరిమాణం పెద్దదయితే అందులో సత్యం, కాంక్ష వుంటుంది. సౌందర్యకాంక్ష ధూళి, స్నేహకాంక్ష స్వార్దం. ఇక ప్రేమ కాంక్ష ఆకలిలాంటిది. నిజం" అన్నాడు.
     "అలా అయితే మనుష్యులు తగు సమయంలో ఈ విషయాలలో ఆందోళన చెందుతారు. ధూళిని దాచేస్తారు, స్వార్దాన్ని ధిక్కరిస్తారు. ఆకలిని మౌనంతో శాంతింప జేస్తారు. చెడు ప్రపంచంలో అన్నిటికంటే  పురాతన సృష్టి. చెత్తాచెదారం మీద కాంక్ష పురాతన విషయాలలో దొరకడం కష్టం. కాబట్టి యింటిని రోజూ శుభ్రం చేసే లక్ష్మీ రూపగృహిణి సత్యం. అసత్యమనడం బుకాయింపే."
     శ్రీ పృధ్వీరాజ్, "భాయీ! మీ కింత భయమెందుకు? నేను మీ అంతఃపుర గోడను తుపాకిమందులో పేల్చి వేయడానికి రాలేదే. కాని పుణ్యాహం  రోజున యీ గార్దభస్వరంతో సన్నాయి వాయించడం వల్ల ప్రపంచంలో యేది చక్కబడుతుందో కొంచెం ప్రశాంత చిత్తంతో ఆలోచించు.  సంగీత కళవల్ల అలా ప్రపంచం చక్కబడితే భగవంతుడు కూడా మెచ్చడు" అన్నాడు.
     "మరేంలేదు. ఈ మేళతాళాల అర్దం కొత్త సంవత్సరంలో పదార్పణ. సంవత్సరమంతా ఒకచోట కూర్చుని ఉయ్యాలలూగడం ఈ పుణ్యాహ ఉద్దేశం" అని అన్నాడు పవన్ దేవ్.
     సంసార కోలాహలంలో అపుడపుడు ఆనందదేవతను కలుసుకోవడంవల్ల కొద్ది క్షణాలపాటు పృద్వీకి శోభ తిరిగి వస్తుంది. పల్లెటూరి  బజారులో గృహానికి శోభ చేకూరుతుంది.  అమ్మడం కొనడం, యివ్వడం పుచ్చుకోవడం కఠినం కావడం మంచిదే.  ప్రేమ స్నిగ్దజోత్స్నను నలువేపులా వెదజల్లి దాని నిశ్శబ్ద స్వరంతో వుంటాయి.  యోగ్యమయినది. అపుడపుడు సంభవించి సౌందర్య దేవతను నింపుతుంది. ఆ సమయంలో చీత్కారస్వరం మధురమయి  ఆ దేవతలో కలిసిపోతుంది. పుణ్యాహం అటువంట సంగీత దినం.
     ఉత్సవ ఉద్దేశం అదే. మనుష్యులు ఒక్కొక్క రోజున తమ. కార్యక్రమాన్ని  భంగపర్చుకుని తమ మనస్సులకు విశ్రాంతి చేకూరుస్తారు. అది ప్రతిదినమూ సంభవిస్తుంది. గాని ఒక రోజు వ్యయపరచవలసి వుంటుంది. ప్రతిదినం ద్వారం బంధించి వుంటుంది. ఒకరోజున మాత్రమే తెరచి వుంటుంది. ఇంటిలో దాని యజమాని ప్రతిదినం నివశిస్తుంటాడు;ఒక రోజున అందరిని సేవకులను చేస్తాడు. ఆ రోజు సంతోషించదగిన శుభదినం. ఆ రోజును ఉత్సవదినమని అంటారు. అది ఆదర్శదినం. సాటిలేని దినం.  దానిముందు ఏదయినా హేయమైనదే. పూలమాల, స్పటిక దీపంకూడా దానితో తులతూగలేవు. దానిలో శోభ  సంపూర్ణంగా ప్రవేశిస్తుంది. మనం సౌభ్రాతృత్వంతో మనసులు కలుపుకొని అభీష్టసిద్దిని పొందడానికి వచ్చాను. కాని బీదవారం కావడంవల్ల  ఆనందం పొందలేక పోయాం. ఏ రోజున నేను ఆనందం పొందితే ఆ రోజే నాకు ప్రధానదినం," అని నేను అన్నాను.
     "ఈ ప్రపంచంలో బీదవారి సంఖ్యకు అంతూ పొంతూ లేదు. కాని ఆ దృష్టితో చూస్తే మానవజీవితం సారవిహీనం అయిపోతుంది. మానవతాదర్శం కోరుకున్నంత వున్నతంగా యెందుకు లేదు?  వారికి రెండుపూటలా గుప్పెడు మెతుకులు కావాలి. మానవత ఒకవేపున శాశ్వతంగావుంటుంది. ఇంకోవేపున సామాన్య వస్తువులకోసం తలబద్దలు కొట్టుకుని మరణిస్తుంది. ఎలా కావాలంటే అలాగే అది ప్రతిరోజూ ప్రపంచ విషయాల కోసం సంఘర్షణ పడుతూంటుంది. అందువల్ల అది విశదమవుతుంది. సిగ్గుపడుతుంది. కాబట్టి అది తన నీరసతను యెల్లప్పుడూ దాచుకోవడానికి యత్నిస్తూంటుంది" అన్నాడు పవన్ దేవ్.
     "దానికి ప్రమాణం పుణ్యాహదిన ఆనందమే. భూమి ఒకరిది. ఇంకొకడు కొంటాడు. యీ నీరసతతో, సిగ్గుతో జీవాత్మ ఒకానొక భావ సౌందర్యంతో మిళితమయి ఆ రెంటి మధ్య   ఆత్మీయ సంబంధమును కలుపుకోవాలని వాంఛిస్తుంది. ఇందులో ఆదానప్రదానాల చిక్కులేదు. ప్రేమస్వాతంత్ర్యం వుంది. అందుకని దీనిని రుజువుచేయాలని తలపోస్తుంది. రాజుకు, ప్రజలకు సంబంధం వుంది. ఆ దానప్రదానాలు హృదయానికి సంబంధించిన కర్తవ్యాలు. కోశాగార సన్నాయిస్వర ప్రసాదానికి స్థానంలేదు. కాని భావసంబంధం గలవారిని పిల్లంగ్రోవి ఆహ్వానిస్తుంది. రాగిణి దీనిని ప్రకటిస్తుంది. గ్రామపిల్లంగ్రోవి యధాశక్తి 'నేను నా పుణ్యాహ' మని ప్రకటిస్తుంది. ఈ రోజున రాజూ, ప్రజ రామ భరతులలాగా కలుసుకొనే రోజు. రాజుగారు శిబిరంలో కూడా మానవాత్మ తన ప్రవేశద్వారమును సిద్దం చేసుకోవాలని కాంక్షిస్తుంది. ఒక భావ ఆసనాన్ని విస్తృతంగా వుంచుంది." అన్నాను నేను.
     నిర్ఘరిణీదేవి సాలోచనగా"ఇందులో కేవలం శరీర సౌందర్య వృద్ది మాత్రమే లేదని నా అభిప్రాయం. నిజానికి దుఃఖభారం కూడా కలుగుతుంది.  ప్రపంచంలో ఉత్తమసత్యం విలయానికి ముందు నాశనం కాదు. అపుడు వున్నత నీచత్వాలకు అఖండ సంబంధం .యేర్పడడానికి వున్నత భావాన్ని సహించడం సులభమవుతుంది. కాని బాహ్యాభారం తప్పించుకోవడం కష్టం." అన్నది.
     ఈ ఉపయుక్త భాషణకు నిర్ఘరిణి సిగ్గుపడింది అపరాధిలాగా కనిపించసాగింది. చాలామంది యితరుల భావాలను దొంగిలించి వాటిని తమ భావాలుగా వెల్లడిస్తూ సిగ్గుపడరు.
     "పరాజయం పొందినచోట మానవుడు తన హీనస్థితివల్ల కలిగిన దుఃఖం నివారించుకోవడానికి భావసంబంధం కల్పించుకుని ఆ సంబంధాన్ని సర్వత్రా వ్యాపింపచేస్తాడు. ప్రపంచంలో జన్మించిన మానవుడు తుఫానును, దావాగ్నిని, వరదను వశం చేసుకోలేడు. పర్వతం ద్వారా పాలకునిలాగా మార్గమును అడ్డగించి ఆకాశమును ముద్దిడుకుంటూ నిలబడి వుంటుంది. ఇక ఆకాశం ఫలవంతమైన యిచ్చా శక్తి ప్రబావంతో వడగళ్లవానను కురిపిస్తుంది. అపుడు మానవుడు దానిని దేవతయని భావించి పూజించడం మొదలు పెడతాను. లేకపోతే  ఈ ప్రకృతితో మానవ సంబంధం ఎప్పుడు స్థాపితమయి వుండేదికాదు. ముందుగా ఏ సాదృశ్య ప్రకృతిని ఆరాధించి జయించాడో అప్పుడు మానవాత్మ దానిలో గౌరవంతో నివసించసాగింది." అనినేను చెప్పాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS