Previous Page Next Page 
షా పేజి 3

 

    ఎందుకంటే ఈ బాన్ గురించి ప్రజలూ డాక్టర్ లూ పేపర్ లలో చదివే వుంటారు. ఎమిడో సైరిన్ చాలా దేశాలలో ఎప్పుడో బాన్ చేశారు. కానీ మనకు దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఇతమిద్దంగా తేలీపోవటం వలన కంటిన్యూ చేస్తున్నాము. అలాగే టేట్రాసైక్లిన్ విటమిన్ "సి" కాంబినేషన్ కూడా......." ఇంతవరకూ చెప్పి కొద్ది క్షణాలు ఆగాడు శ్రీధర్. అతని ముఖమంతా చెమటలు పట్టేసింది.
    అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. అతనేం చెప్పబోతున్నాడా అని.
    "మన కంపెనీ కేవలం ఈ రెండు బ్రాండ్స్ అమ్మాకాలవలెనే నడుస్తుందని లాభాలు గడిస్తుందనీ మీ అందరకూ తెలుసు. ఇప్పుడు మనం యీ రెండింటి ప్రొడక్షన్ ఆపివేస్తే......కంపెనీ ...బహుశా మూసేసే పరిస్థితి రావచ్చు."
    సూది వేస్తె వినబడేంత నిశ్శబ్దం.
    "కనుక ఈ కిష్ట పరిస్థితి నుంచి మనం తప్పించుకొడానికి ఎవరయినా ఏమయినా సజెషన్స్ యివగలిగితే ....." అందరి వేపూ చూస్తూ అడిగాడతను "కంపనీ వారికి ఎంతో ఋణపడి ఉంటుంది."
    ఆ మాట చెప్పగానే ప్రసాదు లేచి నిలబడ్డాడు. అతను ఎమ్మెస్సీ చదివాడు. ఈ మధ్యే ఆ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేరాడు. చేరిన సంవత్సరం లోపలే అతను చూపిన చొరవకు కంపెనీ సూపర్ వైజర్ గా ప్రమోషన్ కూడా ఇచ్చింది.
    "సర్! టెట్రాసైక్లిన్ విత్ విటమిన్ "సి" ప్రభుత్వం బాన్ చేసిందంటున్నారు. కానీ మనం అదే ప్రిపెరేషను డాక్సీ సైక్లిన్ విత్ విటమిన్ "సి" తో చేయవచ్చు కదా! దాని మీద ప్రభుత్వం బాన్ లేదు!"
    శ్రీధర్ చిరునవ్వు నవ్వాడు.
    తనా విషయం ముందే ఆలోచించాడు.
    "ఆఫ్ కోర్స్ చేయవచ్చు. థాంక్యూ !"
    ఈసారి కృష్ణారావు లేచి నిలబడ్డాడు.
    "అలాగే ఎమిడో సైరిన్ బదులు మనం డైపైరిన్ వాడవచ్చును కదా!"
    "యస్" యూ టూ ఆర్ కరెక్ట్! కానీ మనం ఇక్కడో విషయం గుర్తుంచుకోవాల్సి ఉంది. మీరన్నట్లు ఆ మార్పులు చేస్తే ఆ మందుల బ్రాండ్ నేమ్స్ కూడా మార్చాల్సి వస్తుంది. అవి మార్చాలంటే మళ్ళీ ఆ కొత్త పేర్లను ప్రచారంలోకి తేవడానికి చాలా కాలం పడుతుంది. లేదా వాటి మీద కూడా "బాన్" రావచ్చు. వీటన్నింటినీ మించి మరో విషయం కూడా మనం ఆలోచించాల్సి ఉంది.
    మనం ఏం చేసినా ప్రభుత్వం కళ్ళు కప్పటానికే చేయగలం. కానీ అందువలన హాని జరిగేది ఎవరికి? ప్రజలకు ధట్  అయ్ డోంట్ వాంట్? సమాజం పట్ల మనకు నైతిక భాద్యత ఉంది. కనుక యివన్నీ అలోచించి నేనో నిర్ణయానికి వచ్చాను. యింక మన కంపెనీ ఆ రెండు డ్రగ్స్ ప్రొడక్షన్ నిలిపేస్తుంది. ఫలితం ఏమయినా కానీ!
    ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి సమావేశపరచడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన కంపెనీ తయారుచేస్తున్న మిగతా మూడు మేడిసిన్స్ నీ మనం పుషప్ చేయడానికి ప్రయత్నించాలి. మన కంపెనీ భవిష్యత్తు కేవలం వాటి సేల్స్ మీద ఆధారపడి ఉంటుంది.
    "ఈ పరిస్థితి మీకు ఆందోళనకరంగా ఉంటుందని నాకు తెలుసు. అయినా మీరంతా పర్సనల్ గా శ్రద్ధ తీసుకుని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీకోసం , మాకోసం, మనందరి కోసం మీరు శ్రమపడాలి. ఈ విషయంలో మీరేమయినా ప్రత్యేక సహాయం అవసరమయితే అందజేయడానికి సిద్దంగా వున్నాను.......థాంక్యూ!"
    ముగించి కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు శ్రీధర్.
    అందరూ గౌరవపూర్వకంగా లేచి నిలబడ్డారు.
    శ్రీధర్ మళ్ళీ తన రూమ్ లో కొచ్చి కూర్చున్నాడు.
    ఇదంతా వృధా ప్రయాస. తను కంపెనీని ఇంకెవ్వరూ రక్షించలేరు. తనకు తెలుసా విషయం! ప్రభుత్వం "బాన్" రాకముందు నుంచే తమ కంపెనీ బ్రాండ్ మందులన్నీ అమ్మకాలు పడిపోయాయ్. ఎక్కడి కక్కడ కంపీటిషన్ పెరిగిపోయే సరికి పరిస్థితి దారుణంగా తయారయింది.
    ఫ్యూన్ లోపలికొచ్చాడు. "సార్! భోజనం వడ్డించమంటారా?"
    "వద్దు కాఫీ తెచ్చిపెట్టు"
    "భోజనం టైమయిందీ సార్ ఇప్పుడు"
    "ఈ పూట భోజనం చేయను నర్శింలూ ! కారియర్ యింటిలో ఇచ్చేసేయ్"
    "అలాగే సార్"
    "ఇవాళ సాయంత్రం మీటింగ్ వుంది. అంచేత ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని చెప్పు అమ్మగారికి."
    "అలాగే సార్?"
    శ్రీధర్ రివాల్వింగ్ కుర్చీలో వెనక్కు వాలి కాఫీ తాగసాగాడు. అతని మనసులోని ఆందోళన ఇంకా తగ్గలేదు.
    తమ కంపెనీ త్వరలోనే మూత పడబోతోందని తన నమ్మకం! మిగతా పార్టనర్స్ ఎవ్వరూ ఈ విషయం అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటె వారందరికీ యింకా చాలా వ్యాపార సంస్థలలో భాగస్వామ్యం వుంది. అంచేత వారు పోగొట్టుకునేదీ కూడా తక్కువే.
    కంపెనీ మూసివేయడం జరిగితే విపరీతంగా నష్టపోయేది తానొక్కడే తనదే మేజర్ షేర్ అవటం అందుక్కారణం. అదీ గాక తనకింక వేరే ఆస్తులు కూడా లేవు. తన సర్వస్వం ఈ కంపీనీయే.
    కంపెనీ మూతపడకుండా ఉండటానికి ఇది తను చేస్తున్న ఆఖరి ప్రయత్నం.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS