Previous Page Next Page 
పంచభూతాలు పేజి 2

     ఇదే నా ఆఖరు పాత్రల సంప్రదాయం. వారిలో శ్రీమతి ప్రకాశవతీ దేవి ఒకరోజు వేకువజామున "మీరు డైరీ ఎందుకు రాయరు?" అని అడిగింది.
     స్త్రీల మస్తిష్కం అంధ సంస్కారంతో మిళితమయి పోయింది. శ్రీమతి ప్రకాశవతి మస్తిష్కంలో నేను తన మనిషిని కాదనే భావం నాటుకుని వుంది. నేను ఎప్పుడూ ఈ సంస్కారాన్ని దూరం చేయడానికి ఏ ఉపాయమూ పన్నలేదని చెప్పలేను.
     పవన్ దేవ్ నావీపుమీద చరచి: 'రాయకూడదా?' అన్నాడు. పృద్వీరాజ్ గగన్ మాట్లాడలేదు. అపుడు నేను 'డైరీ రాయడం మహా దోషం' అన్నాను. దానిమీద శ్రీమతి ప్రకాశవతి వ్యాకులపడి, 'అయినా మీరు రాయడం మంచిది' అన్నది.
     నిర్ఘరణీదేవి మృదు మధురంగా, "దోషమేముంది? మా మాట వినడం మంచిది" అన్నది.
     దానిమీద నేను, "డైరీ కృత్రిమమయింది.  కాని నేను రాసేది నా ప్రాకృతిక జీవనం మీద. నా ఆధిపత్యం వుంటుంది. మనిషిలో వేయి భాగాలు వుంటాయి. వాటిని రక్షించుకుని సంసారం సాగించడం  కష్టం.  ఆ పైన బయట నుంచి స్వయంగా ఆపదను కొని తెచ్చుకోవడం మహా మూర్ఖత" అన్నాను.
     హఠాత్తుగా గగన్ దేవ్, " అందుకని తత్వజ్ఞానుల ద్వారా సకలం నిషేధించడం దేనికి! యింకో కార్యకలాపం వల్ల ఏదో ఒక సృష్టి జరుగుతుంది. మనం భోగ విషయాలను గురించి ఆలోచించినకొద్దీ పనిలో చిక్కుకుంటాం. అందుకని ఆత్మను పరిశుద్దంగా వుంచదలచుకుంటే సకల  కార్యకలాపాలను కట్టిపెట్టాలి" అన్నాడు.
     నేను గగన్ కు ప్రత్యుత్తరం ఇవ్వకుండా, "నేను నన్ను ఖండఖండాలుగా ఖండిచడం కోరుకోను. నాలో ఆత్మ రకరకాలుగా చింతన,  కర్మల  మాలను కట్టి ప్రతిదినం ప్రపంచంలో ఒకకొత్త నియమము   ఒక కొత్త జీవనధారను ప్రవహింపజేస్తుంది .అయినా డైరీ రాసే పనికూడా సాగిస్తే ఆ జీవనాన్ని తత్తునియలు చేసి యింకొక కొత్త జీవనం ప్రారంభమవుతుంది" అన్నాను.
     పృద్వీరాజ్ నవ్వి "డైరీని వేరు జీవనమని యెందుకు అనడం? ఆ రెంటి భేదం నాకూ తెలియడం లేదు" అన్నాడు.
     నేను అన్నాను, "జీవితం మరొక మార్గం వెంట నడుస్తూంటుంది. కాని దానికి సమానాంతర రేఖను గీస్తే అటువంటి స్థితి రావడం సంభవిస్తుంది. మీ లేఖని  మీ జీవితానికి అనురూపమయిన  రేఖనే గీస్తుంది గనక దీనిని గ్రహించడం కష్టం ఈ రెండు రేఖలలో అసలు రేఖ యేదో, నకిలీ రేఖ యేదో నిర్ణయించడం బహు కష్టం. జీవితగతి స్వబావ సిద్దంగా రహస్యపూర్ణమయింది. వానిలో ఆత్మఖండన, పూర్వాపర అసమంజత వుంటాయి. కాని లేఖిని స్వబావ సిద్దంగా ఒకనిర్దిష్ట మార్గం వెంట వెళుతుంది. అది సకల అసమంజతాలను సమానం చేసి ఒక సాధారణ రేఖను గీయగలుగుతుంది. ఒక ఘటనను చూసి దానిలో ఒకయుక్తి యుక్తమయిన సిద్దాంతానికి చేరకుండా వుడంలేదు."
     ఈ విషయం అర్దం చేసుకోవడంలో నేను నా వ్యాకులతను గాంచి నిర్ఘరిణి దయాపూర్వకంగా "నువ్వేం చెప్పదలచావో నాకు తెలుసు. స్వభావ సిద్దంగా మా ప్రాణి మా గుప్త నిర్మాణాలయంలో కూర్చుని ఒక అపూర్వం నియమానుసారం మా జీవితాన్ని నిర్మిస్తుంది. అయినా డైరీ   రాయడం  వల్ల జీవిత నిర్మాణ భారం యిద్దరు మనుష్యుల మీద పడుతుంది. చాలా విషయాలలో  డైరీని అనుసరించి జీవితం నడుస్తుంది. విషయాలు అధికమయినకొద్దీ డైరీయే జీవితాన్ని అనుసరిస్తుంది" అన్నది.
     నిర్ఘరిణి నా మాటలను ఎంతో శ్రద్దగా విన్నది. చేష్టాపూర్వకముగా నా మాటలను అర్దం చేసుకోవడానికి  యత్నిస్తూ హఠాత్తుగా వాటిని పూర్వమే అర్దం చేసుకున్నట్లు తెలుసుకుంది.
     "బాగుంది" అన్నానేను.
     దానిమీద ప్రకాశవతి, "ఇందులో దోషమేముంది?" అని అడిగింది.
     "ఈ విషయం భుక్తభోగి మాత్రమే తెలుసుకోగల్గుతాడు. సాహిత్యం మీద ప్రేమగల మనిషికే నా మాటలు అర్దమవుతాయి. సాహిత్య వ్యవసాయానికి లోపలనుంచి రకరకాల భావాలు, పాత్రలు బహిర్గత మవుతాయి. నేర్పరియైన తోటమాలి  రకరకాల పూలు పుడతాయి. పెద్ద ఆకుల రంగు విలక్షణంగా వుంటుంది. సువాసనలో విభిన్నత్వం వుంటుంది. ఆ విధంగానే సాహిత్య వ్యాపారి తన మనసులో నుంచి విబిన్న భావాలను బహిర్గతం చేస్తాడు. ఆ భావాలను స్వతంత్ర సంపూర్ణ రూపంలో నిర్మలంగా ప్రకటిస్తాడు. అవి శాశ్వతంగా నిలిచిపోతాయి. యీ విధంగా సాహితీపరుని మనసులో ఒక స్వచ్చంద ప్రాణియొక్క గ్రహం కూడా  వర్దిల్లుతుంది. దాని జీవితంలో ఐక్యత వుండదు. మెల్లమెల్లగా నూరు భాగాలుగా భావిజితమవుతుంది. సాహిత్యపరునిద్వారా లబించిన మనోభావ దళాలు ప్రపంచంలో నాలుగు  దిక్కులా తమ బాహువులను విస్తరించుకుంటూ పోతాయి. సకల విషయాలలో కుతూహలం కలుగుతుంది. సౌందర్యం తన వేదనాపాశంలో చిక్కుకుంటుంది. దుఃఖితులను కూడా తన ఆటలో స్నేహితులుగా చేసుకుంటుంది. మృత్యువును కూడా ఒకసారి పరీక్షించాలని చూస్తుంది. నవీన కుతూహలంతో పిల్లలలాగా  సకల వస్తువులను స్పృశిస్తుంది. ఆఘ్రాణిస్తుంది. బలాత్కారంగా యెందులోనూ వసించకోరదు. ఒకే దీపంలో అనేక వత్తులు వెలిగించితే నూనె కొద్దికేపటికే అయిపోతుంది. ఆ విధంగానే యీ మనోభావాల కారణంగా మానవ జీవితం మహా వేగముతో భస్మీపటలమయి పోతుంది. ప్రకృతిలో జీవిత వికాసం బద్దవిరోధం నుంచి విశృంఖలత జనిస్తుంది" అన్నాను నేను.
     ప్రకాశవతి మందహాసం చేసి, 'ఈ విధమయిన  స్వచ్చంద, విచిత్ర రూపంలో  ప్రకటించడం ఆనందం కలగడం లేదా?' అన్నది.
     "నిర్మాణంలో ఒక విచిత్రమైన ఆనందం వుంటుంది. కాని యే మానవుడూ యెల్లపుడూ నిర్మాణ కార్యకలాపం నిర్వహించలేడు.  అతని  శక్తికి ముగిస్తాడు.  ఈ జీవనయాత్రలో అతనికి అనేకమైన  చిక్కులు సంభవిస్తాయి.  ఒక అడుగు పిల్లనగ్రోవి వాద్య యంత్ర దృష్టిలో శ్రేష్టమయినదే, వూదితే మోగుతుంది.  కాని రంధ్రాలు లేని వెదురు లాఠీ కూడా అవసరమే. జీవితం దానిని ఆశ్రయించుకొని వుంటుంది" అన్నాను నేను.
     అపుడు పవన్ దేవ్, "దౌర్బాగ్యవంశంచేత వెదురు ముక్కలాగా మానవుని కార్యకలాపాల్ని విభాగించడానికి వీల్లేదు. మానవునికి పిల్లని గ్రోవితోను, లాఠీతోనూ పని పడుతుంది. విభిన్న పరిస్థితులలో విభిన్నంగా అభినయించవలసి వుంటుంది. కాని బాయీ! మీరు మంచివారే మీకు పిల్లం గ్రోవి కావాలి, లాఠీ కావాలి. కాని నేను మాత్రం కేవలం గాలిని. నాకు పిల్లంగ్రోవి గానానికి పనికివచ్చే వుపకరణం. కేవలం బాహ్యాకృతిగల యంత్రం గాదు. దాని నుంచి రాగ రాగిణుల  వెలువడతాయి" అన్నాడు.
     ప్రకాశవతి, "మానవ జీవితంలో అనేక వస్తువులు వ్యర్దంగా నాశనమవుతుంటాయి. అనేక దుంఖాలు, అనేక భావాలు, అనేక ఘనటలు;  సుఖ దుఃఖ తరంగాలను లేపడంవల్ల మేము అస్తిరంగా జీవిస్తుంటాం.  కాని మేము వాటిని లిపిబద్దం చేసి రాస్తే మా జీవితంలోని అధిక భాగం మా పక్కనే వుంటుంది. సుఖ దుఃఖాలలో దేనిని కోరినా మా మనస్సు సంపూర్ణంగా దానిని పరహరించకోరదు" అన్నది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS