Next Page 
మరో ప్రస్థానం పేజి 1


                                            మరో ప్రస్థానం
          
                                                     - శ్రీశ్రీ

 

                                      

యిప్లవం యాడుందిరా
ఆడనే నీ కూడుందిరా నీ గూడుందిరా
గోడుగోడున యేడస్తవుంటే
యాడు నీవొంక రాడింకరా

యిప్లవం యాడుందిరా - నీ
గుండెలోనే కూకుందిరా - మన    
కళ్ళల్లోనే దాగుందిరా

ఓరయ్యో సేద్యగాడ
అయ్యయ్యో బానిసీడ
యెన్నాళ్ళు చాకిరీ
యెన్నేళ్ళు నౌకిరీ
నిన్నేలే దొరగాడు
ఆడొక్క పోకిరీ
నీ చెమటపిండీ
నీ బతుకునుండీ
రూపాయలే గుంజుకుంటాడు - అవి
రాకుంటే తెగ గింజుకుంటాడు - నిన్ను    
అప్పుల్లో ముంచి
వడ్డీలు పెంచి
నీ కొండ్రనే నంజుకుంటాడు
ఏంది దొరా యీ గోరం
ఏందని అడిగావంటే
బూటుతో కొడతాడు
బూతులు తిడతాడు
ఆస్తి కరిగి కస్తి పెరిగి
చస్తావుంటే పైకం
తెస్తావా తెమ్మంటాడు - లేదా నీ
పెళ్ళాన్నే రమ్మంటాడు - కాదా నీ
కూతుర్నే యిమ్మంటాడు -అలాంటోణ్ణి
గొడ్డళ్ళతో నరకాలిరా
కొడవళ్ళతో తరగాలిరా
యిప్లవం పిలిసింది - రా

ఓరోరి కూలీ
ఔరా హమాలీ
పల్లెటూరు వదిలావు
పట్నానికి కదిలావు
పస్తుల్లో నలిగావు
రెండుకాళ్ళ పసుపులాగ
యెండల్లో తిరిగావు
కానీలే యింతే నా
కరమమనీ పనికిరాని
జలమమనీ యెందుకిలా
కళ్ళు తేల వేస్తావు
కాళ్ళు జారవేస్తావు
బతికుండే చస్తావు
యిప్లవ మేమంటున్నదో
యిప్పుడైన తెలుసుకో
మనిసిలాగ మసలుకో
పీడించే కామందు
ఆడే ఒక రాబందు - అలాంటోడికి
సుత్తిపోటే
కత్తివేటే
మత్తుదించే ఒక మందు - అప్పుడే
ఆడి మాయ సాగదు ఇక ముందు

యిప్లవం యేమందిరా
మనిసికొకటే సావందిరా
కట్లు తెంచుక రమ్మందిరా
కత్తి దూసుక లెమ్మందిరా
యిప్లవం నీదమ్మందిరా

ఓహో ఓ విద్యార్థీ
ఓహోహో ఓ మేధావీ
పొట్టకూడు మీకియ్యక
చుట్టుబండలాయె చదువు
మేటవేసిపోయె మెదడు
భ్రష్టుపట్టిపోయె బ్రదుకు
మెదడైనా ఒడలైనా
శ్రమ చేస్తేనే సంపద
కలవారల కొమ్ము కాసి
పడుచుకునే వృత్తిరోసి
కర్షక కార్మిక జన సం
ఘాతంతో కలియండి
బూర్జువాల రాజ్యాంగపు
బూజంతా దులపండి
భూతలాన స్వర్గపు ని
ర్మాతలుగా నిలవండి - ఆ దిక్కుగా
మీకు దారి చూపించే
మేటి తరం విరిసింది - అలాంటివాళ్ళలో
కొందరు మరణించారు
ఎందరో బతికున్నారు
అందరిదీ ఒక లక్ష్యం
ఒక గమ్యం ఒక ధ్యేయం
అదే మనకుపాధేయం
విప్లవం వెలిగించరా!

చండ్ర పుల్లారెడ్డి1
తరిమెల నాగిరెడ్డి2
వేసిన పొలికేక
సత్యమూర్తి3 పెను ఢాక
చారుమజుందార్4 పవర్
మనవేనోయ్ డియర్ బ్రదర్
కొల్లిపరా5, పంచాదీ6
అల్లిపురం7, సిమ్మడ్రీ8
చాగంటీ9, తామాడా10


Next Page 

  • WRITERS
    PUBLICATIONS