Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 2

 


    రామచంద్రం సమాధానం చెప్పలేదు.
    వాడిగా కదిలిపోయాడు ఏటి దిక్కుకు కాదు - వెనక్కు అతడు కనుమరుగయ్యే వరకూ అక్కడే నిలబడిపోయింది వారిజ. ఏటికి వచ్చే పోయే జనం తనను వింతగా చూసి నవ్వుకోవటం తెలుసు వారిజకి - ఇలాంటి విషయాలకు విలువనిచ్చే దశ దాటిపోయింది ఆమె జీవితంలో. నవులూ, వెక్కిరింతలూ, ప్రశంషలూ, మన్ననలూ అన్నీ ఒకటే ఆవిడా కిప్పుడు , బరువుగా అడుగులు వేస్తూ తన యింటికి కదిలింది వారిజ.


                                             --    --    --

    వారిజ అనుకున్నట్లే రామచంద్ర అరోజూ మరునాడు కూడా వారిజ యింటికి రాలేదు. ఏటి గట్టున కనిపించనూ లేదు. అయినా వారిజ తెల్లవారుజామున ఏటి గట్టున కూర్చోవటం మానలేదు. దూరంగా కనిపిస్తోన్న ఆకృతిని చూడగానే గుండె ఝల్లుమంది వారిజకు. అతనే! వస్తున్నాడు ఫరవాలేదు ......తన బ్రతుకులోనూ ఇంకా కొంత మాధుర్యం మిగిలి ఉంది.
    వారిజను చూసి ఒక్క క్షణం కాలం ఆగిపోయి మళ్ళీ ముందుకు అడుగులు వేశాడు రామచంద్ర.
    "రెండు రోజులుగా రావటం లేదేం?" మములుగా అడిగింది వారిజ. అతను తలెత్తి వారిజ ముఖంలోకి చూశాడు. "రాకుండా ఉండగలనేమో - నన్ను పరీక్షించుకోవడానికి ఆగిపోయాను.' \
    "ఊ! ఏమయింది పరీక్ష ఫలితం?"
    "తెలుస్తోందిగా?"
    వారిజ కళ్ళు వింతగా మెరిశాయి. ఆ మెరుపుల్ని ఏరుకోకుండా ఉండటం రామచంద్ర వశం కాలేదు. "మీరే జయించారు మా ఇంటికి రాకుండా ఉండగలిగారుగా!" నిష్టూరంగా అంది వారిజ.
    "కాదు ఓడిపోబట్టీ మీ ఇంటికి రాలేకపోయాను.'
    "అంటే?"
    "స్పష్టంగా చెపుతున్నాను - ఇంతవరకూ ఏ స్త్రీ తో మాట్లాదినప్పుడూ నాకింత సంకోచం కలుగలేదు - నా శరీరం ఇలా వణికిపోలేదు. అందుకే మీ యింటికి రాలేకపోయాను."
    'ఇంకేం మీ వణుకు మిమ్మల్ని కాపాడుతుందిగా రండి. అయినా ఒక్కమాట! మీకు నాలో నమ్మకం లేకపోవచ్చు - కాని నాలో నాకు నమ్మకం వుంది. మిమ్మల్ని కాపాడి ఎలా వచ్చారో అలా బయటికి పంపే బాధ్యత నాది రండి." కొంచెం బాధగా అంది వారిజ.
    అసహనాన్ని సూచిస్తూ అతని కనురెప్పలు అల్లల్లాడాయి. కలవరం కంఠంలో పలికింది. "కాదు మీలో నమ్మకం లేకపోవటం కాదు - ఈనాడే కాదు - ఏనాడు మీలో నాకు అపనమ్మకం కలుగదు . ఆ విశ్వాసం నా మీద నాకు ......"
    "మీ ఆత్మ పరిజ్హానం ఇంతగా జాగృతమయి ఉన్నప్పుడే మీరెక్కడి కెళితేనేం! ఎవరి మధ్య మసిలితేనేం?"
    "ప్రలోభాలు పరిజ్ఞానాన్ని అతి తేలికగా క్రమ్మివేస్తాయి. తాత్కాలికమే అయినా ప్రలోభం జయించే పరిజ్ఞానం అణగిపొతే ఆ తర్వాత పరిజ్ఞానం మేల్కొని ఎంత కుమిలిపోయినా ప్రయోజనం వుండదు."
    వారిజ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి.
    రామచంద్ర ఆందోళనగా చూశాడు.
    "ఏమిటది ? ఎందుకు?"
    వారిజ ముఖం తిప్పుకుంది!
    :మీరు మా ఇంటికి రానంటున్నందుకు......"
    "వస్తాను"
    "ఎప్పుడు రమ్మంటారు?"
    "మీ యిష్టం- ఎప్పుడైనా సరే!"
    "ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి వస్తాను సరేనా!"
    "తప్పకుండా రావాలి"
    "తప్పకుండా!"
    "సరే నేను వెళతాను -- మీరు సుఖంగా స్నానం చెయ్యండి."
    గాలిలో తేలిపోతూ వెళ్ళిపోయింది వారిజ.
    ఉదయం నుంచి ఆత్రుతగా గడియారాన్నే గమనిస్తోన్న వారిజ. నాలుగు కొట్టగానే ఒక్కసారి తేలిగ్గా నిట్టూర్చింది. కాని ఆ తరువాత సెకన్లు కూడా భరింపరానంత దీర్ఘంగా తయారై పోయాయి. నాలుగు గంటల వరకూ సాగిన నీరీక్షణ కంటే నాలుగాయిన తరువాత నీరీక్షణ మరింత ఉద్వేగ పూరితమయిన వారిజ మనసుని మేలి పెట్టెసింది. బెదురు బెదురుగా లోపలకు అడుగు పెడుతోన్న రామచంద్రను చూడగానే వారిజ ముఖంలో వేయి చందమామల వెన్నెలలు మెరిశాయి.
    "రండి - అంత సంకోచం పనికి రాదు" సాదరంగా ఆహ్వానిస్తూ సోఫా చూపించింది. ఖరీదైన సోఫా సెట్లు మూలగా బల్ల మీద వున్న అర్ధ నగ్న నాట్య సుందరి శిల్పమూ - ఇవన్నీ గమనిస్తూ ఆవిడ ధనికురాలై ఉండాలని నిర్ణయించుకున్నాడు రామచంద్ర.
    "వారేరీ?" అన్నాడు చుట్టూ చూస్తూ.
    "వారు ఎవరు?"
    "అదే మీ శ్రీ వారు........" తల వంచుకుని అన్నాడు.
    ఒక్క క్షణం అయోమయంగా చూసిన ఆమె అంతలో పకాలున నవ్వింది. రోషంగా తలెత్తాడు రామచంద్ర.
    "ఎందుకలా నవ్వుతారు?"
    రామచంద్ర చూపుల ననుసరించి వారిజ చూపులు ఆవిడ మెడలో నల్ల పూసల తాడును తడిమాయి. ఆ నల్లపూసల దండ చేత్తో పట్టుకుని చెక్కిలి కానించుకుని బరువుగా రామచంద్రను చూస్తూ అంది వారిజ.
    "మా వారు నా దగ్గిరే ఉన్నారు."
    "ఎక్కడ?"
    "ఇక్కడే"
    "ఏరీ?" వింతగా చుట్టూ చూశాడు అతను.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS