Previous Page Next Page 
జోగబాల పేజి 2


    ఆ దీప కాంతిలో నల్లగావున్నా యవ్వనపు మిసమిసలతో మెలమెలలాడుతున్న ఆమె సౌందర్యం ఎగసి పడుతోంది. అది నలగని సౌందర్యం కాదు. చెక్కుచెదరని యవ్వనం కాదు. అయినా ఇంకా పటుత్వం నిండివున్న బిగువుల కలపోత.


    సవ్వడి విని ఆ యువతి తల తిప్పి చూసింది. వచ్చినతని చూడగానే పెదాలమీదకు చిన్న చిరునవ్వు అవతరించింది.


    "మెలకువగానే ఉన్నావా?" అంటూ అతడామెపక్క వెళ్ళి కూర్చున్నాడు.


    చాలా మామూలుగా ఇంచుమించు ఏ భావమూ లేకుండా తన విశాలమయిన కళ్ళతో అతనివైపు చూస్తోంది. వంగి ఆమె పెదాలమీద ముద్దుపెట్టుకున్నాడు. తన మీద నుంచి అతని మొఖం తీసేశాక చేత్తో పెదాలమీద తడి తుడిచేసుకుని "తెచ్చావా?" అనడిగింది. ఇప్పుడామె గొంతులో ఎంతో ఆశ ప్రతిధ్వనిస్తోంది.


    "ఊఁ!"


    "ఏదీ?"


    జేబులోంచి ఓ సీసా బయటికి తీశాడు. క్వార్టర్ బాటిల్. లేచి కూర్చుని ఆబగా అతని చేతిలోంచి లాక్కుంది. ఓ పక్కన ఉన్న కుండలో అల్యూమినియం గ్లాసు ముంచి సగందాకా నీళ్ళు దీసుకుంది. సీసాలోని బ్రాంది ఆ గ్లాసులో కొంత వంపుకుంది.


    ఆ బుడ్డి దీపం వెలుతురులోనే ఆమె కళ్ళల్లో కుతి, కసి, ఆబ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్లాసు నోటిదగ్గర పెట్టుకుని గబగబా త్రాగుతోంది. పులిలా ఆమె వంక చూస్తున్నాడు అతడు.


    పుష్ప తన ప్రక్కనే యింకో మనిషి ఉన్నాడన్న ధ్యాస కూడా లేకుండా కేవలం త్రాగడం మీదే దృష్టి నిలిపింది. అయిదు నిమిషాల్లో గ్లాసు పూర్తిచేసి_ రెండోసారి సీసాలోని బ్రాందీ మొత్తం వొంపుకొని, నీళ్ళు కలుపుని త్రాగేస్తోంది.


    పమిట పూర్తిగా జారిపోయి, హుక్సు సరిగాలేని జాకెట్ లోంచి నలిగినా వాడని యవ్వనాలు బయటపడుతున్నాయి.


    యువకుడి కళ్ళలో ఆకలీ, దాహం ఎక్కువవుతున్నాయి. ముందుకి వంగి ఆమె చీరె కుచ్చిళ్ళ మీద చెయ్యి వేశాడు. అసలే వొదులుగా వున్న కుచ్చిళ్ళు వూడి చేతులోకి వొచ్చేశాయి.


    గ్లాసు పూర్తిచేసి ప్రక్కన గిరాటేస్తూ అతనివంక నవ్వుతూ చూసి_మత్తుగా చాపమీద వాలింది.


    ఆమె కళ్ళలో ఆహ్వానం లేదు. కోరిక లేదు. రొటీన్ గా వుంది. ఎవరికైనా ఏమయినా యివ్వగలిగే ఓరిమి వుంది. ఆమె వొంట్లో అణువణువునా తనని అర్పించుకునే శాస్త్రముంది.


    యువకుడు ఆమెకు దగ్గరగా జరిగి ప్రక్కనే పడుకుని మీదకు లాక్కున్నాడు.


    అక్కడికి కొన్ని అడుగుల దూరంలో కేవలం గోనెసంచీ అడ్డుగా ఆ యువతి తల్లీ, తండ్రి వున్నారన్న ధ్యాస లేకుండా యిద్దరూ_ యాంత్రికమైన సహకారంతో ఒకరూ కోరికలతో మ్రగ్గుతూ ఒకరూ కలిసి కదిలిపోతున్నారు.


    అతను బ్రాంది సీసా తీసుకురాకపోయినా హరువాత డబ్బులిచ్చినా యివ్వకపోయినా ఆ సన్నివేశం ఆ విధంగానే సాగి వుండేది.


    ఆమె జోగిని.


    సరిగ్గా అయిదింటికి ఎదురుగా వున్న యింకో పూరిపాకలో బుడ్డి దీపం ఎదురుగా పెట్టుకుని ఒక పదహారేళ్ళ అమ్మాయి పుస్తకాలు ముందేసుకుని దీక్షగా చదువుతోంది.


    విశాలంగా కదిలే పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రని ముఖం, చామన ఛాయ రంగు చాలా అందంగా వుంది. ఆ ముఖంలో, కళ్ళలో అమాయకత్వం తిరిగి చూస్తోంది.


    కొద్ది దూరంలో ఏదో అలికిడయినట్లయితే కితిఈలో ఏర్పాటు చేసుకున్న చిన్న రంధ్రానికి అడ్డుగా వున్న తెరను తొలగించుకొని చూసింది.


    ఎదురుగా వున్న పాకలోంచి నీడలా ఒక మనిషి బయటకువచ్చి ఊరివైపు వెళ్ళిపోతూ వుండడం కనిపించింది.


    వొళ్ళు ఝల్లుమంది.


    నుదుటి మీద చిరు చెమటలు పడుతుండగా వొణికే చేత్తో తెర దించేసి మళ్ళీ పుస్తకాల్లో మనసు లగ్నం చెయ్యడానికి ప్రయత్నిస్తోంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS