Next Page 
అనూహ్య పేజి 1


                 కొత్త సీరియల్ ప్రారంభం

                           అనూహ్య             

 
                                                                     -  బలభద్ర పాత్రుని రమణి   

 

                                                               

    డయానా, ద ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ హజ్ డయిడ్!
    ప్రపంచం అంతా అట్టుడికిపోయింది.
    బి.బి.సి.వాళ్లు ఆమెని  గూర్చి అదేపనిగా హోరెత్తిపోతున్నారు.
    తెల్లవారేసరికి దావానలంలా వ్యాపించినదా మరణవార్త! 'బకింగ్ హమ్ ప్యాలెస్ చిన్న బోయింది!
    'ఎర్రగులాభి రక్తాశ్రవులు విందిస్తూ నేల రాలిపోయింది!'
    'ముప్త్పే ఆరేళ్ళ వయసుకే నూరేళ్ళ జీవితం అనుభవించేసి కన్నుమూసింది!'
    బిల్ క్లింటన్, టోనిబ్ల్తేర్, ఎలిజబెత్ మహారాణి అందరూ ఆమె గుణగణాల్ని పొగిడికంటతడి పెట్టేసేరు.
    మీడియా వ్యామోహంలో చిక్కుకున్న రాకుమారి మిడియావల్లె ప్రాణాలు పోగొట్టుకుంది.
    ఆమె  హెయిర్ స్టైల్  ఒకప్పటి  ఫ్యాషన్.....
    ఆమె నడక, ఆమె  మాట,  ఆమె  అందం, ఇప్పటి మరణం అంతా వింతే!
    ప్రపంచం అంతా ఈ విషయంపట్ల తమ విస్మయం, దుఃఖం, పరితాపం ప్రకటించేస్తున్నారు! నిన్నటివరకూ విమర్శించివాళ్ళు స్తెతం! అమాయకమ్తెన కళ్ళతో అందమ్తెన డయానా ముఖం తెరమీద చిరునవ్వులు చిందిస్తోంది.
    కొత్త సిరియల్ ప్రారంభం కొత్త సిరియల్ ప్రారంభం.  
                                            

 



    నేను టి.వీ. ఆఫ్ చేసేశాను.
    నేను డయానా ప్రపంచానికి అంతటికి తెలియను. కనీసం ఈ నగరంలో ఓ వందమందికికూడా తెలియనేమో! నేను కాళ్ళు జుపుకుని సోపాలో పడుకుని వుండగా, బాత్ రూమ్ లో స్నానంచేస్తుండగా, రహస్యంగా నా ఫోటోలు  తీసే  ఫోటో గ్రాఫర్లు, నా ప్రాణం తిసి స్వంత విషయాలు చెప్పమని వేధించే పత్రికలవాళ్ళూ ఎవరూ లేరు!
    ఐయామ్ ఫ్రీ...ఐయామ్ లక్కి....ఐయామ్ హ్యాపి! ఆనందంతో గిరగిరా తిరగాలనిపించింది.
    ఆ ఆనందంలో వుండగానే డోర్ బెల్ మ్రోగింది. ఉత్సాహంగా వెళ్ళి తీశాను.



    ఎదురింటి మామీ ముక్కుబేసరి చమక్కుమని మెరుస్తుండగా, పళ్ళన్నీ కనపడేటట్లు నవ్వుతూ- "కాఫిపొడి కావాలి... అనూహ్య నీ కాఫిదా  రొంబబాగుండుంది" అంది.
    ఆమెచేతిలోని స్టీలు పాత్ర  అందుకుంటూ "మామీ నేను ఏమాత అదృష్టవంతురాల్నో తెలుసా?" అన్నాను.
    మామి కళ్లు పెద్దవిచేసి చూస్తూ "వివేక్ ఏమన్నా వచ్చేనా?" అంది.
    నాఉత్సాహం అంతా గాలితీసిన బెలూన్లా అయిపోయింది. నా అదృష్టం అంతా వివేక్ తోనే ముడిపడి వుందా?
    "లేదు!" అని  లోపలికి వెళ్ళి కాఫిపొడి తీసుకొచ్చి ఇచ్చేశాను.
    "ఏమిది అనూహ్య? ఇందాకా రొంబ అదృష్టం అంటివే?" అంది మామి.
    నేను  చేదు తిన్నట్లు ముఖం అదోలా  పెట్టి-" తల నొప్పి... తర్వాత చెప్తాను, అబ్బా! వెంటనే  స్నానం చెయ్యాలి"అన్నాను.
    "సరిదా! నేను మళ్ళి వస్తా" అని మామీ వెళ్ళి పోయింది.
    'డయానా కలల జీవితం రాచరికపు  రక్కసి కోరల్లో  చిక్కిచినిగి వాలికలైంది!
    నేనూ వివేక్ తో నా వ్తె వాహిక జీవితం అంతే  ఆశతో ప్రారంభించాను. ఒక ఏడాది తిరిగేసరికే అది చివరి అధ్యాయానికి వచ్చేసింది!
    'poetry is what milton saw when he went blind'  అన్నాడో కవి.
    అలాగే వివేక్ తో  విడిపోయాకా నాకు వై వాహిక జీవితం అంటే చాలా  తెలిసిపోయింది!
    అందమైన బాల్యం అనుభవిస్తూ, గెంతులేస్తున్న హృదయానికి పరదా కప్పి పెద్ద దానివయ్యావంటారు.
    అప్పట్నించీ మనసులొని ఆలోచనలన్నీ తెరవెనుక భాగోతాలే! జీవితాన్ని ఎలా అనుభవించాలో తెలిసేపరికల్లా అదిమన చేతుల్లో  వుండదు!
    నాకు  ఇప్పుడు పెళ్లికాని ఆడపిల్లలకి చెప్పాలనిపిస్తుంది 'ప్రతి విషయాన్నీ అతిపవిత్రంగాకాదు అతి వాస్తవంగా ఆలోచించండి! అని.
    ఎన్నెన్ని కోర్కెలతో..... ఎన్నెన్ని ఆశలతో వివేక్  జీవితంలోకి నేను అడుగు పెట్టానూ!
    నా ఆశల పతంగం ఇలా  నేలరాలి ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం ఎవరూ?
    నాకు  మొదటిసారిగా వివేక్ ని చూసిన క్షణం గుర్తుకొచ్చింది.
    పెళ్ళిచూపులు....
                                              *        *        *


Next Page 

  • WRITERS
    PUBLICATIONS