Next Page 
అమ్మో! అమ్మాయిలు  పేజి 1

                                                            

                            అమ్మో అమ్మాయిలు

                                                                                               __కురుమద్దాలి విజయలక్ష్మి

    " ఇల్లు అద్దె కివ్వబడును రోయ్!" అంటూ వ్యాకర్ణ గట్టిగా అరిచాడు.

    " నిజమే! 'టులెట్' అని బోర్డుకూడా తగిలించారు" భూతద్దాల కళ్ళజోడు లోంచి చూస్తూ తల తాటించి మరీ ఒప్పుకున్నాడు అబ్బులు.

    " ఆలస్యం అరటిపండు విషం" అన్నారు పెద్దలు. లోపలి కెళదాం పదరా! వ్యాకర్ణ ఓ అడుగు ముదు కేసి అన్నాడు.

    " ఒ రేయ్! అమృతం విషమంటా రురా" అంటూ తప్పు దిద్దాడు అబ్బులు.

    " చూడు నాయనా, అబ్బునాధం! నీ విక్కడ ఏది విషమో పరిశోధన చేస్తూ కూర్చుంటే అరటిపండూ అమృతమూ ఆఖరికి అద్దె యిల్లు కూడా విషమే అవుతాయి. తొందరగా లోపలికి తగలడ దాము పద" అంటూ విసుక్కున్నాడు వ్యాకర్ణ.

    పద అంటే పద అని, నీవు ముందంటే నీవు ముందని వ్యాకర్ణ, అబ్బులు ధైర్యం చేసి " టులెట్ బోర్డు" వున్న ఇంటి తలుపు తట్టారు.

    తలుపు తట్టె ముందు కళ్ళజోడు సవరించుకుని జేబులో వున్న చిన్న దివ్వేనతో క్రాపు దువ్వుకున్నాడు అబ్బులు. ఓసారి కాలరు సవరించుకుని జేబులో చెయ్యి దూర్చుకుని నిటారుగా నిలబడ్డాడు వ్యాకర్ణ.

    అబ్బులు, వ్యాకర్ణ ప్రాణమిత్రులు. వాళ్ళు ప్రస్తుతం వున్న రూమ్ వెంటనే ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వారం రోజుల బట్టి రాత్రింబవళ్ళు విసుగు లేకుండా తిరిగిన వాళ్ళు తిరిగినట్టే వున్నారు, ఖాళీ రూమ్ కోసం.

    అది ఎండాకాలం. తిరిగి తిరిగి ప్రాణం పోతున్నది గాని ఖాళీ రూమ్ మాత్రం కనబలేదు.

    ఈ ఇంటికున్న 'టూలెట్' బోర్డు చూడగానే ప్రాణం లేచొచ్చింది మిత్రుల కిద్దెరకు. ఎండుకయినా మంచిదని మద్దెల మోగించి నట్లు గాక వీణ మిటినట్లు తలుపు పై మిటారు.

    ఆ ఇంట్లో వారివి పాముచేవులేమో, వీళ్ళిలా తపులు తట్టడం ఏమిటి అలా తలుపు తీయటం ఏమిటి ఏక కాలంలో జరిగాయి. ఇరువురు కూడ పలుక్కున్నట్లు టక్కున " నమస్తే" చెప్పారు.

     ఆ ఇంట్లోంచి వచ్చిన వ్యక్తి వీళ్ళ నమస్కరానికి తబ్బిబ్బయి రెండు గుటకలు మింగి ఆనందాశ్చర్యాలతో " నాకేనా, మిరూ నమస్కారం పెట్టింది?" అన్నాడు.

    ఓ పక్క ముఖాన నమస్కారం పెడుతుంటే ' నా కేనా?' అనే ఈ యింటాయన మనస్తత్వం ఏమటా అని మిత్రు లిరువురు కూడా ఆనందాశ్చర్యాలు పడి " నమస్కారం మికే నండి బాబూ!" అన్నారు మరో నమస్కారం పారేసి.

    వచ్చిన యింటాయన పూచిక పుల్లలా వున్నాడు గాని కంచు కంఠంతో " ఏమేవ్ ఓసారిలా రా" అంటూ లోపలికి తొంగి చూసి కేక వేశాడు.

    లోపలినుంచి జవాబు లేదు. మరోసారి కేకేశాడు. జవాబు లేదుగాని, గాజుల శబ్దం అయింది. ఆపై సిడిగాలిలా యింటిగలావిడ బైటికి దూసుకొచ్చింది. వస్తూనే " ఏమొచ్చిందీ, ఏమిటా గావు కేకలు? నెమ్మదిగా పిలవ లేరూ!" అంటూ గదమాయించింది.

    " వీళ్ళు నాకు నమస్కారం పెట్టారేవ్!" అన్నాడు ఆయన నెమ్మదిగా.

    " మి ముఖానికి నమస్కారం పెటాల్సిందే ఏం చూసి, ఎందుకు?" అంటూ గయ్యి మంది ఆవిడ.

    ముఖముఖాలు చూసుకున్నారు మిత్రులు, బెదురుతూ.

     

       


Next Page 

  • WRITERS
    PUBLICATIONS