Next Page 
స్టార్ వార్స్  పేజి 1

                                                                స్టార్ వార్స్

                                                                             

                                                                      __:సూర్యదేవర రామ్ మోహన్ రావు
   
    "సార్..."

    పిలిపిమ్చాననుకున్నాదామె.

    కాని అతడి నుదుటిమీదున్న

    గీతాల్ని చూసిన అమె నోట్లోని

    మాట పెదవులుదాటి రాలేదు.

    అతడి నుదిటీ మీది గీతలు అతడి మనోభావాలను తెలియజేస్తున్నాయి.

    ఆ క్షణాన అతడి కళ్ళు మూతలుపడి వున్నాయి.

    కాని ఆలోచనలు నెమరు వేస్తున్నాయి. చేతిలోనో విస్కీగ్లాసు కొద్దిగా ఖాళీ అయింది.

                          'ఓల్డ్ మాంక్ ' అతడి ఫేవరేట్ డ్రింక్.

    అతి ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకునేముందు 'ఓల్డ్ మాంక్' సిఫ్ చేస్తూ, అతడలా తన ప్రైవేటు రూములో ఆలోచనల్లో కూరుకుపోవడం కొత్తకాదు. అటువంటి సమయాలలో తననెవరూ డిస్టర్బ్ చేయకుండా బయట రెడ్ లైటు వేస్తాడు. కాని ఈ రోజున కావాలని రెడ్ లైట్ వెయలేదో లేక మర్చిపోయాడో గాని లైటు వెలగడంలేదు.

    అతడు తాగేముందు దగ్గర్నుంచి అతడు తీసుకునే నిర్లయాలవరకు ప్రతిదానికీ ఏదో ఒక స్పేషాల్టీ ఆపాదించటం అతడి స్పెషాలిటీ. అతడు తాగే సిగార్, ధరించే దుస్తులు, ఆ గది ప్లోరింగ్ కున్న జపనీస్ తివాచి దొరు కర్టేన్సు, ఎదురుగా ప్లవర్ రేజ్ లోని ప్లవర్స్ చూపరుల్ని ఎంతగా ఆకట్టుకుంటయో ఆరడుగుల అతడి భారీ శరీరం అంతగా ఆకట్టుకుంటుంది.

    అతడి పేరు ఏం. వి. అయ్య__ నూటికి నూరుపైసల తెలుగువాడు__ అసలు పేరు మాడాల. కృష్ణజిల్లాలోని పెనమలూరు వారి స్వగ్రామం. కాని చాలామంది__ మద్రాసు, బొంబాయి, కాలికట్, కలకత్తా, డీల్లీ లోనివారు మొదట్లో 'అయ్యర్' అనుకునేవారు. కాని ఇప్పుడు ఆ ప్రమాదం తొలగిపోయింది. 'అయ్యా' అన్నది వాణిజ్యవర్గాలకే కాదు, అధికారులకీ కూడా బాగా తెలిసినపేరు. ప్రస్తుతం రాజకీయరంగంలో సంచలన తారగా ఎన్టీ ఆర్ తెలుగువారికి ఎంతటి గుణనీయమైన గుర్తింపు, గౌరవం తీసుకోచ్చారో వాణిజ్య రంగంలో మాదాల వెంకట్రామయ్య అంతటి గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారు.

    బొంబాయిలో జుహుబీచ్ ప్రాంతంలో వున్నా ఎనిమిది అంతస్థుల భవనం అది.ఆ భవంతికి రెండు ప్రత్యేకతలున్నాయి. ఒకటి__జనసమర్దం ఎక్కువుగా వుంది వాణిజ్య వర్గాలతో కిటకిటలాడిపోయే బొంబాయి మహానగరంలో ప్రకృతికాంత నుదుటి బొట్టులా అందంగా, ప్రశాంతంగా, ఆహ్లాదకరమయిన వాతావరణంలోనున్న ఏకైక కమర్షియల్ కాంప్లెక్సు అదే! రెండు_ బొంబాయివంటి మహానగరంలో అయిదారు గదులున్న ఆఫీసులు అనేకం వున్నాయి. కాని నలబై గదులున్న పుల్ ప్లోర్ ఆఫీసు వెంకట్రామయ్యదే!

    అతడి చేతిలోని గ్లాసు ఖాళీ అవుతోంది. అతడి ఆలోచనలు పదునేక్కుతున్నాయి. అంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కాష్యూ నెట్ ఫ్రైచేసి అతని టేబుల్ మీదున్నది. కిటికీ తేరా తొలగించి బయటకిచూసాడు. అక్కడక్కడ మేఘాలు దూరంగా కనపడుతున్నాయి. అవి వేగంగా కదుల్తున్నాయి.

    అదే అదనుగా తీసుకుని, "సార్..." అని పిలిచిందామె.

    సమాధానంగా ఖాళీగ్లాసు ఆమె ముందుకు జరిపాడు.

    ప్రపంచ పటంలో అతిపెద్ద దేశాలలో ఇకటిగా చెప్పబడే భారతదేశంలో పేదదేశంగానే చాలామందికి తెలుసు. కాని పారిశ్రామికంగా ప్రపంచంలో భారతదేశంకూడా నాయకత్వం వహిస్తున్న సంఘటనలు కొన్ని వున్నాయన్న సంగాతిఅతి కొద్దిమందికి తెలుసు. భారతదేశంలో "హిరో సైకిల్" పేరు, "నిర్మా" దితర్జంట్ పేరు విననివారు ఉపయోగించనివారు చాలా తక్కువమంది. వినియోగదారిడికి సైకిల్ ధర, డిటర్జెంట్ సోపు నాణ్యత ముఖ్యంగాని వాటి తయారీదారుడెవ్వరు అన్నది అంత ముఖ్యంగాదు. ఆ వ్యక్తీ మాదాల వెంకట్రామయ్య__ ఏం.వి.అయ్య.


   
                      *          *        *           *
   
    పౌండ్రీకునివలె నుదుట విబూది రేఖలు_ పట్టు పీతాంబరం ధరించి సుబ్రమణ్యస్వామి విగ్రహం ముందు తన్మయత్వంతో కీర్తిస్తున్నాడు వడయారు.

    అతడి మెడలోని రుద్రాక్షా మాల__

    నిత్యం చన్నీటి స్నానం, ఒకపూట భోజనం_ శాఖాహరం, దీక్షలు_వ్రతాలతో శుష్కించిన శరీరం, పట్టు వస్రాధారణ, సువర్ణఛాయాతో, ప్రశాంత వదనంతో డై వసంనిధిలోనున్న అయానను చూస్తె ఎవరయినా ఆ ప్రయత్నంగా చేతులు జోడిస్తారు


Next Page 

  • WRITERS
    PUBLICATIONS