Next Page 
సరస్వతీ మహల్  పేజి 1

                             సరస్వతీ మహల్

                                                                      -----యామినీ సరస్వతి

                                        దాన జపాగ్ని హోమపరతంత్రుడు

    అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరు మా ఊరు. మా ఊరి పేరేంటో తెలుసా? అరుణాస్పదం. మా ఊరి పక్కనే ఓ నది ఉంది. అది వరుణ. కాశీకి మొదటి పేరేంటో తెలుసా? వారణాసి. వరుణ, అసి అని రెండు నదుల సంగమం కాబట్టి వారణాసి అంటారు. అదిగో ఆ వరుణే మా వూరి పక్కనున్న వరుణానది.

    నేను వేకువనే నిద్దర్లేస్తాను. వరుణకు స్నానానికి వెళ్లి అనుష్ఠానం తీర్చుకొని ఇంటికొస్తూ నా శిష్యుల్చేత వేదం చదివిస్తాను. మా నాన్నా, అమ్మా ఇంటి విషయాలు చూసుకొంటారు. నాకు అధ్యయన అధ్యాపన యజన యాజనాలే తప్ప మరో దిగుల్లేదు. దిగుల్లేదంటే - ఇంట్లో నాకు దీటైన సొమిదమ్మతో కాపురంలో దిగుల్లేదు. బోల్డన్ని మాన్యాలున్నాయి. అవి తెగ పండుతాయి. ఇల్లు గడవడానికి వనర్లున్నాయి. ఇంట్లో నిరతాన్నదానము. మా ఆవిడకి చాలా ఓపిక - రాత్రింబవళ్ళనకుండా అతిధి అభ్యాగతులకు వండి పెడుతూ ఉంటుంది. మరిన్ని ఉన్నా ఓ దిగులు మాత్రం ఉంది.

    అదేమిటంటే - తీర్ధ యాత్రలు చేయాలని!

    కానీ ఇల్లును - ఇల్లాల్ని విడిచి వెళ్ళాలంటే ఎలకుదుర్తాయి అందుకే దిగులు.

    ఇలా ఉండగా ఓ రోజు -

    మా ఇంటికి ఓ సిద్ధుడు వచ్చాడు. అతని రాకతో మా యిల్లు పావనమైంది అనుకున్నాం.
"అయ్యా! మీ మాటలు మంత్రాలు - మీరెక్కడ కాలుబెడ్తే అది ప్రయాగ మీ కాళ్ళు కడిగి శిరసున చల్లుకునే నీళ్ళు "ఆకాశ గంగా జలమే" అన్నాను మనస్ఫూర్తిగా.

    ఆయన చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యం వేసింది.

    చూస్తే వయసేమో చిన్నది. ఆయన చెప్పిన క్షేత్రాల పట్టీ పెద్దది. అవన్నీ తిరిగి రావాలంటే యెన్నేండ్లు పడుతుంది. నా సందేహం దాచుకోకుండా అడిగా.

    ఆయన నవ్వాడు. రహస్యం చెప్పాడు. పాదలేపం ప్రభావంతో ఆయన ఇవన్నీ తిరిగొచ్చాడట.
    నాకు ప్రాణం లేచొచ్చింది.

    స్వామీ! స్వామీ నాకు ఎన్నేళ్ళనుంచో తీర్ధయాత్రలు చేయాలని ఉంది. ఈ శిష్యుని మీద దయతో అనుగ్రహించండి అన్నా.

    ఆ సిద్ధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇది అదీ అని చెప్పకుండా దంతపు భరణిలోని ఒక పసరు నా పాదాలకు పట్టించి వెళ్ళిపోయాడు. ఇంకేముంది? నేను ----

    తుహిన భూధర శృంగ శ్యామల కోమల కానన హేమాఢ్యదరీ ఝరీ నిరీక్షాపేక్షతో బయలుదేరాను అక్కడేం చూశాను.

    ....అంబర చుంబి శిరస్స రఝ్ఘరీ
    పటల ముహుర్మహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
    స్పుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
    కటక చరత్క రేణు కరకంపిత సాలము శీత శైలమున్

    అహో! ఏమి హిమాలయాలు! ఏమా మంచుకొండల సౌందర్యం. ఏ మందము! ఏ మందం! అరే అప్పుడే మధ్యాహ్నమైందే! ఈ ఎండకే మంచు కరిగిపోతోందే! అబ్బో చాలా ఆలస్యమైంది. ఇంటికెళ్ళాలి దేవతార్చన చేయాలి. దేవతా నివేదనా చేయాలి. అమ్మా, నాన్నా ఆకలికి తట్టుకోలేరు. సోమిదమ్మ వంటంతా పూర్తిచేసి ఈయనెక్కడికి వెళ్లారో ఏమిటో ఇంకా రాలేదు ఏమిటా అని ఎదురుచూస్తూ ఉంటుంది. పాపం పిచ్చిది ఇలా హిమవత్పర్వత శ్రేణిని చూసొచ్చానని చెబ్తే ఎంత అబ్బుర పడ్తుందో! అసలు నమ్ముతుందా! రేపు మళ్లి వచ్చేటప్పుడు ఈ పసరు తీసి తన కాలికీ కొంత రాస్తే సరి తనూ వస్తుంది. ఈ వేళకిక చాలు వెళ్ళిపోదాం.

    అరె!

    ఇదేమిటీ! కదల్నేమిటీ! ఇక్కడి వాడ్ని ఇక్కడే ఉన్నావే! ఈ పసరు పనయిపోయిందా! అయ్యో! ఎంత కర్మ వచ్చి పడింది.

    ఎక్కడ అరుణా స్పదపుర

    మెక్కడి తుహినాద్రి క్రొవ్వియె రాదగునే

    అక్కట! మును చనుదెంచిన

    దిక్కది యని యెరుగ వెడలు తెరువెయ్యదియో!

    ఎక్కడికి పోవాలి! ఎవర్నడగాలి! ఎలా తిరిగి చేరుకోవడం! పరమేశ్వరా ఎంత కష్టం.

    నడుస్తూ నడుస్తూ ఆగేను.

    అల్లంత దూరంలో ఓ భవనం. ఓహో! మిన్నులు పడ్డ చోటుకు వచ్చాననుకున్నాను. కానీ ఇది జనాన్వితమే - ఇదేమిటి ఈ గాలి!

    మృగమద సౌరభ విభవ ద్విగుణిత ఘనసార సాంద్రవీటి గాంధస్థగి తేతర పరిమళమై మగువ పొలుపు దెలుపుతూ ఉండే!

    చూద్దాం అనుకుంటూ నడిచాను.... అక్కడ

    ....విద్యుల్లతా విగ్రహన్

    శత పత్రేక్షణ చంచరీక చికురన్ చంద్రాస్య చక్రస్తనిన్ నతనాభిన్ నవలా....మరున్నారీ శిరోరత్నము...ఓ మామిడిచెట్టు మొదట్లో అరుగుమీద....అలవోకగా కూర్చొని....వీణ వాయిస్తోంది. అరే - వేరే మద్దెల లేదే - ఆమె చేతి కంకణాల ధ్వనే మద్దెలగా ఉందే! సగం కళ్ళు మూసుకొని ఎంత పారవశ్యంగా వుంది.

    అరే! చప్పున కళ్ళు తెరిచిందే! నన్నేమిటి మిర్రిమిర్రి చూస్తోంది! అలావచ్చి పోక చెట్టుకు ఆనుకుని నిల్చిందేవిటి. కనురెప్పపాటే లేదే! ఇటే వస్తోందే!

    ఎవ్వతే - నీవు భీత హరినేక్షణ! యొంటి జరించె దోటలే
    కివ్వన భూమి భూసురడనే త్రోవతప్పితిన్
    గ్రొవ్వుగా నిన్న గాగ్రమునకున్ జనుదెంచి పురంబుజేర నిం
    కెవ్విధిగాంతు దెల్పగదనే తెరుదెద్ది శుభంబు నీకగున్.

    భలే! ఏమందునయ్యా అందగాడా! చారడేసి కళ్ళున్నాయి. వెళ్ళేదారి ఎవర్నడుగుతావు! ఒంటరి దాన్నున్నానని -ఏదో సాకు పెట్టుకుని నన్ను పల్కరిస్తావే మరీ ఇంత భయంలేకుండా పలకరించేందుకు ఎంత లోకువయ్యాం అంది.

    నేను నిర్ఘాంత పోయి నిల్చున్నాను.

    మేం అప్సరసలం నా పేరు వరూదుని - మేం ఈ కొండల్లో తిరుగుతూ ఉంటామయ్యా నువ్వు నా అతిధివి - మా ఇల్లు - అదిగో - ఎండలో అలిసిపోయావు - రా - నూ ఇల్లూ పావనం చేసి మా ఆతిధ్యం స్వీకరించు అంది మళ్ళీ.

    అమ్మా నేను తొందరగా మా ఊరు వెళ్ళాలి! నువ్వు నాకు ఆతిధ్యమిచ్చి ఒకటి ఇవ్వక ఒకటా! పిలిచిందే పదివేలు! నువ్వు దేవతా స్త్రీవి. నీ మహత్తుతో నన్ను మా ఊరు చేర్చు! అన్నాను.... ఏం వూరయ్య అందగాడా! మావి రత్నాల మేడలు - ఈ నందన చందనోత్కారాలు - గంగా సైకతాలు మీ పల్లెటూరికి - పూరింటికి సాటిరావా? వూరువూరని వూరేగుతానంటావేం? ఇదంతా ఎందుకు! నాకు నీపై మనసైంది. రా పోదాం. అంది కాముకత్వంతో.

    భలే దానివే! నువ్వు. మేం బ్రాహ్మణులం ఇంటిదగ్గర అగ్నిహోత్రాలు చెడిపోతాయి! మా అమ్మా నాన్నా ముసలి వాళ్ళు - నేను ఇంటికి పోకపోతే వాళ్ళు భోంచెయ్యరు.

    ఏమిటిపిచ్చి బ్రాహ్మడివి! యజ్ఞాలు యాగాలు మాకోసమే కదా! ఆనందో బ్రహ్మా అని విన్లేదా! రా! ఆనందం అనుభవించు! నాకు భలే కోపం వచ్చింది. చెడామడా హితువు చెప్పాను. అంటే ఏమందో తెలుసా! వనిత తనంత తా వలచి వచ్చిన చుల్కన కాదె యేరికిన్ అని ఇంక ఆగలేనట్టు మీదబడి కౌగిలించింది.

    "హా శ్రీహరి"! అని చప్పున దూరం తోశాను. పాటునకిం లోర్తురె కృపారెహితాత్మక నీవు త్రోవ నిచ్చోట భవన్న ఖాంకురము సోకె కనుం గొనుమంచు జూపి.... వల వల ఏడ్చింది. ఆపై భూసురవర్య ఇంతదల పోయవు. నీ చదువు ఏల చెపుమా అంది,

    నేనింకేం అంటాను---

    అక్కడ్నించి వచ్చి గల గలా పారే సెలయేట్లో ఆమె కౌగిలించుకున్నప్పుడు అయిన జవ్వాది కడిగేసుకొని మాధ్యాహ్నికం వార్చి అగ్నిని స్తోత్రం చేశాను.

    'ఓం అగ్ని మీళే పురోహితమ్'

    ఆ అగ్ని నన్నిల్లు చేర్చాడు - హమ్మయ్యా బ్రతికి పోయాను. మళ్ళీ యాత్రలు వద్దు పుణ్యము వద్దు - ఇంతకు నన్నెవరుగా గుర్తించారు! నేను-దాన జపాగ్ని హోమ పరతంత్రుడ్ని - ప్రవరుడిని....

                                                                          ---*---

Next Page 

  • WRITERS
    PUBLICATIONS