Previous Page Next Page 
ఏవమ్ ఇంద్రజిత్ పేజి 3


    విమల్: అమల్ - నువ్వు యూత్  బర్నల్ ఫిలిం ఏమయినా చూశావా?___
    అమల్ : దాదాపు అన్నీ చూశాను. బ్రహ్మాండంగా వుంటాయి. యూత్  బర్నర్  ముందు -  మార్లేన్ బ్రాండో ఎందుకూ పనికిరాడనుకో ఇంద్ర నీవు చూశావా?__
    ఇంద్ర : చూశాను.
    కమల్: ఏడ్చినట్టుంటాడు - వాడి గుండూ వాడూను!
    అమల్ : గుండే! అయితేనేం? వాడి బుర్రకాయ అలాంటిది. గుండు కొట్టించుకొనే సాహసం -అందుకే, అతనికుంది.
    విమల్ : బుర్రకాయ అలాంటిది అంటే మరో అర్ధం వస్తుంది బ్రదర్!
    కమల్: అంటే ఆయిన్ స్టాయిన్ బుర్రలాగ!
    ఇంద్ర: ఆయిన్ స్టాయిన్ పుస్తకం ఒకటి చదివాను. అసలు  అర్ధం  అయితేనా?-
    అమల్: డైమన్ షన్సు నాలుగు  అన్నాడు. ఆయిన్స్టాన్.
    విమల్ : నాలుగో  డైమెన్ షన్ టైం అన్నాడు కదూ!
    కమల్: కాలేజీలో ఫిజిక్సు మింగుడు పడటంలేదు. పైగా  నాలుగో  డైమెన్ షన్ ఒకటి  మన ప్రాణానికి. అమల్ -  నీ ప్రాక్టికల్ బుక్ తయరయిందా?
    అమల్ - మా అన్నయ్య బుక్ చూసి కాపీ చేసేస్తాను. ఆఁ - ఎప్పుడు సబ్ మిట్  చెయ్యాలి ? 
    విమల్ :  పదమూడో తారీఖులోపల. యింతవరకూ నేను మొదలుపెట్టనేలేదు. ఇంద్రా - నీ రథం  ఎంతదూరం కదిలింది?
    ఇంద్ర : నిన్ననే ప్రారంభించాను. ఒక మంచిపుస్తకం దొరికింది.  కోర్సు పుస్తకాలు రెండు రోజులనుంచి ముట్టలేదు.
    కమల్ : ఏం పుస్తకం?
    ఇంద్ర:  బెర్నార్డ్ షా ! కంప్లీట్ ప్లేస్ !
    అమల్ : బెర్నార్డుషా ! ఆహ! ఏం దంచేస్తున్నాడు.  నువ్వు- మాన్ -  అండ్ - సూపర్ మాన్ - చదివావా?
    విమల్ : నేను ప్లేస్ అండ్ ప్లే లెట్సు మాత్రం చదివాను.
    కమల్: మన  ప్రధమ్ బీసీకూడా ఇలాంటి ప్లేసే రాశాడు.
    అమల్ : తగ్గు! ఎక్కడ జి. బిసి - ఎక్కడ ప్రధమ  బీ సీ !
    విమల్: ప్రథం. బీ సి - పాలిటిక్సు ఇరికిస్తాడు.
    కమల్ : అయితే ఏం? సాహిత్యంలో పాలిటిక్సు వుంటూనే వుంటాయి. ఆ మాటకొస్తే అవుసరం కూడా!
    అమల్: నేను  ఒప్పుకొను. సాహిత్యం, - 'సత్యం - శివం సుందరం'కు ప్రతీక. చెత్త పాలిటిక్సు అందులోస్తావంలేదు.
    విమల్ : చెత్త ! అంటూ తోసేయడానికి నేను అంగీకరించను. చెత్తకూడా సత్యమే. సత్యంనుంచి పారిపోవటాన్ని ఎస్ జేపిజం అంటాను. సాహిత్యం జీవిత ప్రతిబింబం. రియాలిస్టిక్ ఇంద్ర నీ అబిప్రాయం. ఏమిటి?-
    ఇం : నాకంతగా తెలియదు. కాని _ ఒకటి -  సాహిత్య రియలిస్టిక్ గా, వుండాలనేది  నిజమే కానీ నగ్నసత్యాన్ని ప్రతిబింబించేదిగా......
    కమల్: (వెంటనే అందుకోవలెను) అరె, అప్పుడే, ఏడున్నరయిందే!
    అమల్ : మైగాడ్ ! ప్రాక్టికల్  బుక్కు తయారుచేయాలి. పదండి -పదండి!
    విమల్ : మాత్రోన వేరు-
    కమల్ : వెళ్దాం పద అమల్-
    (అమల్ - కమల్ - నిష్ర్కమిస్తారు.)
    విమల్ : ఇంద్ర! ఇంటికి వెళ్ళవా?
    ఇం: నాకు వేరే పనివుంది.
    విమల్ : ఎక్కడి కెళ్ళాలి?
    ఇం : అటు !
    విమల్ : అటయితే వాళ్ళతో ఎందుకెళ్ళలేదు.
    ఇం : అప్పడనుకోలేను.
    విమల్ : తస్సాదియ్యా! నేను ఒక్కణ్ణే వెళ్ళాలి.
    (విమల్ నిష్ర్కమణ - ఇంతవరకు మందంగా మ్రోగుతున్న, తబలా వాద్యం ధ్వని పెద్దదవుతుంది.)
    (రచయిత ప్రవేశిస్తాడు.)
    రచ: ఇంద్ర ! నువ్వింకా ఇక్కడే వున్నావా?
    ఇం: ఊ! (ఆలోచనలో వుండును.)
    రచ: ఏమిటాలోచిస్తున్నావు?
    ఇం:ఏమిలేదు.
    రచ: వాళ్ళివాళ  రాలేదా?
    ఇం: వచ్చి  వెళ్ళాను.
    రచ: ఎవరెవరు?
    ఇం: అమల్ - విమల్ - కమల్.
    రచ: ఏం  చేశారు? మీరంతా చేరి?
    ఇం: కబుర్లు చెప్పకున్నాము.
    రచ: ఏం కబుర్లు?
    ఇం: ఆ - ఏదో ఆ సంగతీ  - ఈ సంగతీ!
    రచ: క్రికెట్ - సినిమా - ఫిజిక్సు - రాజనీతి - సాహిత్యం - అవునా?
    ఇం: అరె! క్రికెట్ -సినిమా- ఫిజిక్సు- రాజనీతి-సాహిత్యం- ఇవన్నీ  నీకెలా తెలుసు?
    (రచయిత  జవాబు  ఇవ్వదు.  జేబులోనుంచి  వేరుశనగకాయలు తీసి ఇస్తాడు.)
    రచ:ఇంద! తిను!
    ఇం: ఏం చెయ్యమంటావో చెప్పు?
    రచ: ఏ విషయం?
    ఇం : అదే! ఈ చదువు  నా వల్ల కావటం లేదు.
    రచ: మరి ఇంకేం, చేస్తావు?
    ఇం: అదే తెలియటంలేదు. అన్నీ వదిలేసి, ఎక్కడకైనా పారిపోవాలని అనిపిస్తుంది.
    రచ: ఎక్కడికి  పారిపోవాలని?
    ఇం : అదీ  తెలియదు. ఎక్కడుకో - దూరంగా  బహు దూరగా - అక్కడ  ఏముంటుందో కూడా తెలియని స్ధలానికి - అరణ్యం -ఎడారి - మంచుకొండలు- పక్షులు- ఆస్ట్రిన్ - జంతువులు- కంగారు - మనుష్యులు.
    రచ: ఇంతేగదా! ఇదేమంత పెద్ద విషయం సరళభూగోళశాస్త్రం - డి.పి.ఐ. ద్వారా ఆరోక్లాసుకు పెట్టిన పుస్తకం-
    ఇం : భూగోళానికి అవతలగూడా, మరో ప్రపంచం వుంది. ఆ ప్రపంచం ఇక్కడెక్కదాలేదు- దూరంగా - సుదూరంగా - ఈ ప్రపంచానికి అవతల __
    రచ: క్రికెట్ - సినిమా -  ఫిజిక్సు - రాజనీతి - సాహిత్యం -  వీటన్నిటికీ, దూరంగానా!
    ఇం : అవును! వీటన్నిటికీ, దూరంగా!
    రచ: అయితే పద!
    ఇం: ఎక్కడికి?
    రచ: అన్నీ వదలి పారిపోతావన్నావుగా?
    ఇం: ఇప్పుడా ?
    రచ: ఇంకెప్పుడు?
    ఇం: నీతో చెప్పడం అంత బుద్దితక్కువ మరొకటిలేదు.
    రచ: నీ జేబులో డబ్బు ఎంతుంది?
    ఇం: ఎనిమిదణాలు ఏం, ఎందుకు?
    రచ: ణా జేబులో రూపాయి పావలా వుంది. రూపాయి పన్నెండణాలతో, హైదరాబాదు స్టేషన్ నుంచి, పోగలిగినంత దూరం వెళదాం. ఆ  తరువాత పాదయాత్ర వుండనే వుంది!
    ఇం: ఇలా ఎగతాళి చేస్తాననుకొంటే, నీతో మాట్లాడకపోదును.
    రచ: నేను చాలా  సీరియస్ గానే, మాట్లాడుతున్నాను.
    (ఇంద్ర- రచయిత ముఖంలోకి చూస్తాడు. అతను నిజంగానే -సీరియస్ గానే కనిపిస్తాడు. ఇంద్రజిత్ సందిగ్దంలో పడిపోతాడు.)
    ఇం: కాని-అమ్మ....
    రచ:నిజమే, అమ్మ....
    ఇం : పరిక్షలుగూడా దగ్గరకొచ్చాయి.
    రచ:పరీక్షల తర్వాత మాట్లాడుదాంతే! ఇవిగో తీసుకో.
    (అంటూ  జేబులో నుంచి వేరు  శనక్కాయలు  తీసి  యిచ్చి, వెళ్ళిపోతాడు.)
    (నేపద్యంలో పిన్ని కంఠం వినిపిస్తుంది)
    "ఇంద్ర!"
    ఇం: ఆఁ వస్తున్నా!
    (ఇంద్ర కదలడు నిలుచునే వుంటాడు. పిన్ని ప్రవేశం)
    పిన్ని: ఏరా! తిండి తినవా ఏమిటి? ఎంతసేపు వంటింట్లో కూర్చోమంటావు?
    ఇం : అమ్మా !మరే....
    రచ: ఆఁ, ఏమిటి? 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS