Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 2

 

    ఫైర్ మెన్ లు చురుకుగా కదుల్తున్నారు.
    సగం కాలి నీటిలో తడిసి వికృతంగా తయారయిన శవాల్ని తీసుకువచ్చి సాయికృప ముందున్న లాన్ లో పచ్చగడ్డి మీద పడుకోబెడుతున్నారు వరుసగా!
    తమ వాళ్ళని గుర్తించుకోవాలని , మిగిలిన దేమయినా ఉంటే దక్కించుకోవాలని మిగిలినవారు ఆరాటపడుతున్నారు. ఆ వలయం లోంచి దూసుకు పోవాలని ప్రయత్నిస్తున్నారు.
    కాని సూపరింటెండెంట్ ఎవరినీ అనుమతించలేదు. రెండో అంతస్థులో మంటలు అదుపులోకి వచ్చాయి.
    మూడవ అంతస్థు పూర్తిగా కుప్ప కూలి పోయింది. గది గోడలు అన్నీ చిన్న చిన్న సిమెంటు పెచ్చులుగా పగిలిపోయింది.
    కొన్ని కుర్చీలు ఇనుప బీరువాలు ఎండు టాకుల్లా గాలిలోకి లేచి ఎక్కడెక్కడో పడ్డాయి.  
    మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక చుట్టూ చేరిన వేలాది జనంలో ట్రెండ్ మారింది.
    ప్రాణభయం తగ్గిపోయి వార్తలు, వివరాల కోసం ఆరాటం పెరిగిపోయింది. ఎందుకు చనిపోయారో?
    "ఎవరు చేశారు?" ఎలా జరిగింది?"
    "అదెలా తెలుస్తుంది భాయ్! ఎవరు చేశారో మహానుభావులు మారణ హోమం సృష్టించారు. అటు చూడు ఎన్ని శవాలో? నేను పుట్టి పెరిగాక ఇలాంటి ఘోర దృశ్యం చూడలేదు!"
    "ఇల్లు దాటి వచ్చిన ముఖమాయితేగా యిలాంటివి చూడటానికి?"
    "ఇప్పుడెలా వచ్చానంటావు?"
    "ఇప్పటి సంగతి వేరు. కాళ్ళూ కళ్ళూ లేని కబోదులు కూడా వచ్చారు. అమ్మో! ఆ విస్పోటం! తలచుకుంటేనే గుండె బేజారు అవుతోంది!"
    "మీ మాటలు సరే! తొలగండి! తొలగండి! పోలీసులోచ్చారు."
    "పోలీసులొచ్చారు . దారి యివ్వండి. అఆరుస్తున్నారు వెనుక నించి జనం తప్పుకుని దారి యిచ్చారు.
    ఎ,ఎస్.పి విక్రమ్ నేరుగా ఫైర్ స్టేషన్ సూపరింటెండెంట్ దగ్గరకు పోయాడు. పలకరింపులు పూర్తీ అయిం తరువాత  అడిగాడు.
    "వాటీజ్ ది పొజిషన్!"
    "మంటల్ని అదుపులోకి తెచ్చాం! చాలా ఘోరం సార్! ఎవర్నీ ప్రాణాలతో కాపాడలేకపోయాం! సారీ! ఆ శవాల్ని చూడండి."
    "ఎస్! ఐ విల్! ఇంకా మీరు చేయవలసింది ఏమయినా ఉందా?"
    "ఫ్లోర్ లో స్ట్రాంగ్ రూమ్ లాకర్స్ కూడా బ్రద్దలయ్యాయి . అక్కడింకా స్టీల్ పీసెస్ కాలుతున్నాయి. నా మనుషులు పని చేస్తున్నారు. అదుగో చూడండి క్రేన్ మీద!"
    ఎ ఎస్. పి విక్రమ్ తల ఎత్తి చూచాడు. పైరింజన్ వెనుక నించి పొడవుగా ఆకాశంలోకి సాగిపోతోంది క్రేన్ అమ్!
    దాని అంచున స్టీల్ వలలో అయిపోయి వాటర్ చార్జితో స్ప్రేయింగ్ జరుగుతోంది. శ్రద్దా పూర్వక కర్తవ్య పాలన వారిది!
    ఫైర్ యూనిట్! ఓహ్! ఎంత సహస వంతులు! మానవ జాతికి ప్రాణాపాయంలో పిలువకుండా వచ్చి ఆదుకునే మహోన్నతలయిన మిత్రులు. ఆర్తులకు ఆత్మీయులు!
    దట్స్ గుడ్! క్రింది అంతస్తులోకి పోవచ్చా! యిఫ్ యిటీజ్ పాజిబుల్! యిఫ్ యూ పర్మిట్ మీ!"
    "నో సర్! ఐ కాంట్ పర్మిట్ యూ! జరిగింది చాలా హై పవర్ ఎక్స్ ఫోషన్! భవనమంతా బీటలు వారిపోయింది. పైగా మావాళ్ళు నీళ్ళతో తడిసి ముద్ద చేశారు.
    ఏ క్షణంలో ఏ భాగం కూలిపోతుందో తెలియదు. నా మనుషుల్నే గదుల్లోకి ఎంటర్ కవద్దన్నాను. ప్రతి అంగుళం లో ప్రమాదం! చాల ప్రమాదం సర్! ఇరవై నాలుగు గంటలు ఎవరూ ఆ కప్పు క్రిందికి పోకూడదు . సారీ!"
    "థాంక్యూ! శవాల్ని నాకు అప్పగించండి"
    'అలాగే! పదకొండు సగం కాలిన శవాల్ని , ప్రేలి కుప్ప కూలిపోగా మంటలు చల్లార్చిన భవనాన్ని ఏ.ఎస్.పి కి అప్పగించినట్లుగా కేసు వివరాలు వ్రాసి అప్పగించాడు.
    మరికొద్ది నిముషాల అనంతరం తన మనుషుల్తో వెళ్ళిపోయాడు.
    'అలాఫ్ యు ఫాలిన్! ఆజ్ఞాపించాడు ఎ.ఎస్.పి!
    ఇరవై మంది పి.సి.లు ముగ్గురు ఎస్.ఐ లు , ఓ.సి.ఐ అందరూ ఫాలిన్ అయారు. బొమ్మల్లా నిలిచిపోయారు ఆదేశాల్ కోసం!
    "ఆటేన్షన్!' కరకర బూట్లు సర్దుకున్నాయి.
    "నేను చెప్పేది జాగ్రత్తగా వినండి! భవనం పునాదులు కదిలాయి. పైగా నీళ్ళతో తడిసి బరువెక్కి పోయి వుంది. ఆ చాయలకు ఎవరూ వెళ్ళవద్దు! ఇన్ స్ట్రక్షన్స్ నెంబర్ వన్!
    నెంబర్ టూ! పాత టౌను పి.సి లందరూ జనం ముందుకు రాకుండా చూడండి. వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రతి మాట రికార్డ్ అయి పోవాలి! ఏం జరిగిందో ! ఎలా జరిగిందో!
    నెంబర్ త్రీ! టూ టవున్ వాళ్ళు శవాల్ని గుర్తుంచి వారిని ముందుకు రప్పించి వివరాలు తీసుకోవాలి! ఎస్.ఐ లు గైడెన్స్ ఇస్తారు. ఫాలో అవుతున్నారా?
    హియర్ మీ! పొరపాటు జరిగితే క్షమించను.
    నెంబర్ ఫోర్! ఈ మహా జనం లోంచి భవనంలో నివాసముంటున్న వాళ్ళని వేరుచేయండి. ఈ సంఘటన జరిగినప్పటి పూర్వాపరాలు సమీక్షించండి! జాగ్రత్తగా వివరాలు సేకరించండి. సి.ఐ గారూ! వింటున్నారా? నిద్రపోతున్నారా?
    "ఎస్! సర్! మిమ్మల్ని ఫాలో అవుతున్నాను"
    "దట్స్ గుడ్! రైట్ టర్న్" కరకర బూట్లు సర్దుకున్నాయి మళ్ళీ.
    "డబలప్! డిస్పర్స్!" ఎవరి పనుల మీద వాళ్ళు పరుగులు తీసారు.
    శవాల్ని చూచేందుకు కొచ్చాడు ఎ.ఎస్.పి విక్రమ్! చూచేందుకు అతి ఘోరంగా వికృతంగా దారుణంగా ఉన్నాయి పరిస్థితులు . శవాల వంక చూస్తె మనసు విటాలమవుతోంది.
    "నూలు బట్ట తెచ్చారా?"
    "సర్! తెప్పించి కంట్రోల్ రూమ్ లో పెట్టాం. వాన్ లో వెయ్యటం మర్చిపోయాం సర్! నంగిగా సమాధానం చెప్పాడు.
    "రాస్కేల్స్! ఎలా మర్చిపోయారు. రెండు నిమిషాల్లో అది ఇక్కడుండాలి!" కన్నులు ఎర్రపడ్డాయి.
    "సార్! కారులో వెళ్ళినా పది నిమిషాలు పడుతుంది."
    "సో! వాట్! వాజమ్మలా నన్ను చేతులు ముడుకుని కూర్చోమంటావా ?యూస్ లెస్ రోగ్స్! అదంతా నాకు తెలియదు . రెండేరెండు నిమిషాలు టైమిస్తున్నాను.
    నూలుబట్ట యిక్కడుండాలి. ఎస్.ఐ ఒణికి పోయాడు.
    ఎ ఎస్ పి మరీ చిన్నవాడు. డైరెక్ట్ రిక్రూట్! వేడి రక్తం. ఏమైనా చెయ్యగలడు. అని అలోచించి భయపడిపోయాడు.
    ఇరవై అయిదు సంవత్సరాల సర్వీసుతో తలపండిన ఎస్.ఐ రెండే రెండు క్షణాలు ఆలోచించాడు.
    సాయికృప కాంప్లెక్స్ ప్రక్కనే ఉన్న "డింగ్ డాంగ్! ' బట్టల సోరూం కి పరుగు తీశాడు వెపన్ తో సహా!
    ఒక తెల్లని బట్టల తాను తీసుకుని బయటకు లగాయించాలని ప్రయత్నించాడు.
    "యే క్యా గలత్ చల్తా హై బాబూ!" షాపు యజమాని అడ్డు పడ్డాడు.
    "ఎఎస్.పి సాబ్ ఆర్డర్! హటావ్!" పడద్రోసుకుంటూ పరుగు తీసి రెండో నిమిషం యాభయితొమ్మిదో సెకన్ లో సాబ్ కి సెల్యూట్ కొట్టాడు ఎస్.ఐ. నూలు వస్త్రాలతో సహా!
    "దట్స్ గుడ్ ప్రొసీడ్!" శవాల వైపు నడిపించాడు.
    కొట్టు వాడి దురదృష్టం కాబోలు చాల ఖరీదయిన స్పీడ్ గుడ్డ తాను వచ్చింది. దాన్ని ఆరడుగుల ముక్కలుగా చింపి శవాల మీద కప్పడం ప్రారంభించాడు మనసు కలలో పడే దృశ్యం అది!
    అప్పటికే జనంలోంచి సాయికృప చుట్టూ ప్రక్కలలో అద్దెలకుంటున్న వాళ్ళు వేరు చేయబడ్డారు. కొన్ని శవాలు గుర్తించేందుకు వీలుగా వున్నాయి. కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయి మసిబొగ్గుల్లా తయారయినాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS